
వాషింగ్టన్: భారత సంతతి అమెరికన్ నీరా టాండన్ (51)కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే సీని యర్ అడ్వైజర్ హోదాలో ఉన్న ఆమెను వైట్‌హౌస్ స్టాఫ్ సెక్రటరీగా నియమించినట్లు వైట్‌హౌస్ వర్గాలను ఉటంకిస్తూ మీడియా తెలిపింది. అధ్యక్ష భవనం స్టాఫ్ సెక్రటరీగా అధికార యంత్రాంగం, ఫెడరల్ ప్రభుత్వం నుంచి అధ్యక్షుడికి అందే అన్ని రకాల ఫైళ్ల బాధ్యతలను నీరా టాండన్ పర్యవేక్షించాల్సి ఉంటుంది.
వైట్‌హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ రాన్ క్లెయిన్‌కు ఆమె తన విభాగం తరఫున నివేదికలను అందజేస్తారు. అందుకే, వైట్‌హౌస్‌కు సంబంధించి ఈ పోస్టును అత్యంత కీలకమైనదిగా భావిస్తారు. ఈ నియామకానికి సెనేట్ ఆమోదం అవసరం లేదు. జో బైడెన్ 8 నెలల క్రితం వైట్‌హౌస్ ఆఫీస్ ఆఫ్ మేనేజ్‌మెంట్, బడ్జెట్ డైరెక్టర్ పదవికి ఆమెను నామినేట్ చేయగా రిపబ్లికన్ సెనేటర్లు వ్యతిరేకించారు. దీంతో, ఆమె తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment