సీఎం సలహాదారు గా రాజీవ్‌శర్మ | As chief adviser rajivsarma | Sakshi
Sakshi News home page

సీఎం సలహాదారు గా రాజీవ్‌శర్మ

Published Mon, Nov 21 2016 2:09 AM | Last Updated on Wed, Aug 15 2018 8:06 PM

సీఎం సలహాదారు గా రాజీవ్‌శర్మ - Sakshi

సీఎం సలహాదారు గా రాజీవ్‌శర్మ

 ఈ నెలాఖరున సీఎస్‌గా రిటైరయ్యాక కొత్త బాధ్యతలు?
►  పరిపాలనా సంస్కరణల సలహాదారుగా  నియామకానికి సర్కారు యోచన
►  నూతన సీఎస్‌గా ప్రదీప్ చంద్రవైపు సర్కారు మొగ్గు

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్‌శర్మ ఈ నెల 30న పదవీ విరమణ అనంతరం ముఖ్యమంత్రి సలహాదారుగా కొత్త పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. వివిధ విభాగాల పరిధిలో ఇప్ప టికే ఉన్న సలహాదారుల తరహాలో పరిపా లనా సంస్కరణల సలహాదారుగా ప్రభుత్వం ఆయన్ను నియమించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అనుభవజ్ఞుడు కావటం, తెలం గాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచీ సీఎస్‌గా ఉండటంతో రాజీవ్ శర్మ సేవలను మరికొంత కాలం వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు భావిస్తున్నారు. కొత్త జిల్లాల నేపథ్యంలో చోటుచేసుకున్న పరిణా మాలు, క్షేత్రస్థాయిలో పరిపాలనా విభాగాల కుదింపు, సిబ్బంది సర్దుబాటు ప్రభావంతో పాటు కేంద్రంతో ముడిపడిన అంశా లను అధ్యయనం చేసే బాధ్యతలను సర్కారు రాజీవ్‌శర్మకు అప్పగించాల నుకుంటోంది.

అందుకు సంబంధిం చిన ఫైలు ముఖ్యమంత్రి పరిశీల నలో ఉంది. మరోవైపు కొత్త సలహాదారుకు సీ బ్లాక్‌లో ప్రత్యేక చాంబర్ రూపుదిద్దుకుంటోంది. సీ బ్లాక్‌లోని ఆరో అంతస్తులో ఉత్తరం వైపున ఆర్ అండ్ బీ అధికారులు కొత్త చాంబర్‌ను సిద్ధం చేస్తున్నారు. అందుకు వీలుగా ప్రస్తుతం సీఎం వ్యక్తిగత కార్యదర్శి అరుణ్ కుమార్ చాంబర్‌ను కుడి పక్కనున్న సీఎం చాంబర్ వైపు మార్చారు. అక్కడే ఉన్న ప్రొటోకాల్ క్యాంటీన్‌ను అక్కణ్ణుంచి తరలించారు. దీంతో రాజీవ్‌శర్మ కొత్త పాత్రలో కొలువు దీరేందుకు మార్గం సుగమమైనట్లు స్పష్టమవుతోంది.

ప్రదీప్ చంద్రకే సీఎస్ చాన్‌‌స!
కొత్త సీఎస్‌గా ప్రదీప్ చంద్రను నియమిం చేందుకే ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. ముఖ్యమంత్రి సైతం అందుకు సూచనప్రా యంగా ఆమోదం తెలిపినట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. 1982 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ప్రదీప్ చంద్ర...సీఎస్ రాజీవ్‌శర్మ తర్వాత ఐఏఎస్ అధికారుల్లో సీనియర్. ప్రస్తుతం ఆయన రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నారు.

గతంలో పరిశ్రమలు, వాణిజ్యం, ఆర్థిక శాఖలతోపాటు ఉమ్మడి రాష్ట్రంలో కీలకమైన విభాగాల్లో, విశాఖపట్నం, గుంటూరు జిల్లాల కలెక్టర్‌గా సైతం పని చేశారు. తెలు గు రాష్ట్రాలకు చెందిన ఐఏఎస్ కావటం తోపాటు వివిధ శాఖల్లో పని చేసిన అను భవం ఉండటంతో ఆయన్ను సీఎస్‌గా నియ మించే అవకాశాలున్నాయి. సీఎస్ రేసులో సీనియర్ ఐఏఎస్‌లు ఎస్‌పీ సింగ్, ఎస్‌కే జోషీ, ఎంజీ గోపాల్, ఆర్.ఆర్. ఆచార్య పేర్లు ఉన్నప్పటికీ సీఎం మాత్రం ఈ కీలక బాధ్యతలను ప్రదీప్ చంద్రకు అప్పగించను న్నట్లు తెలుస్తోంది.
 
వచ్చే వారంలో ఐఏఎస్‌ల బదిలీలు
వివిధ విభాగాల్లో ఉన్న అవసరాల దృష్ట్యా వచ్చే వారంలో భారీగా ఐఏఎస్ అధికారు లను బదిలీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ యోచిస్తున్నారు. ఇప్పటికే అందుకు సంబంధించిన ప్రాధమిక కసరత్తు పూర్తి చేశారు. మరోవైపు పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో సచివాలయం తరలింపునకు బ్రేక్ పడింది. పెద్ద నోట్ల రద్దు వల్ల రాష్ట్ర ఆదాయం తగ్గే ప్రమాదముండటంతో ఈ తరుణంలో సచివాలయం నిర్మాణం చేపట్టడం సరికాదని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నట్లు తెలిసింది.

24న సీఎం గృహప్రవేశం
ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 24న కొత్త క్యాంపు ఆఫీసులోకి గృహ ప్రవేశం చేయ నున్నారు. తెల్లవారుజామున నిర్ణీత సుముహూర్తంలో కొత్త నివాసంలో అడుగుపెట్టనున్నారు. బేగంపేటలో ఉన్న సీఎం క్యాంపు కార్యాలయం వెనుక ఆధు నిక హంగులతో కొత్త క్యాంపు కార్యాల యం నిర్మించటం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement