ఉక్కు మనిషి పటేల్‌కు సెల్యూట్
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీట్
సాక్షి, హైదరాబాద్: దివంగత ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ 140వ జయంతి సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. ‘భారత ఉక్కు మనిషి, ప్రభుత్వాధికారులకు మార్గదర్శకుడు అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు సెల్యూట్’ అంటూ జగన్ శనివారం ట్వీట్ చేశారు.