న్యూఢిల్లీ: మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసులో.. బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్ తరపున వాదిస్తోంది ఎవరో తెలుసా? నిర్భయ కేసు ప్రాసిక్యూటర్ రాజీవ్ మోహన్ డిఫెన్స్ న్యాయవాదిగా వ్యవహరించనున్నారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో నలుగురు నిందితులకు ఉరి శిక్ష పడేలా చేశారు ప్రాసిక్యూటర్ రాజీవ్ మోహన్. 2012లో జరిగిన ఆ సంఘటన ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. నలుగురు నిందితులకు ఎనిమిదేళ్ల తర్వాత 2020 మార్చిలో శిక్ష పడేంతవరకు అవిశ్రాంత పోరాటం చేసి న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగేలా చేశారు రాజీవ్.
నాడు న్యాయాన్ని గెలిపించారు.. మరి నేడు..?
నిర్భయ కేసులో అద్భుతంగా వాదనలు వినిపించి బాధితురాలికి న్యాయం జరగడంలో తనదైన పాత్ర పోషించిన రాజీవ్ ఇప్పుడు మాత్రం ఎంపీ బ్రిజ్ భూషణ్ తరపున కోర్టుకు వాదనలు వినిపించనున్నారు. నాడు నిర్భయ కేసులో నిందితులకు శిక్ష పడేలా చేసిన అయన ఇప్పుడు వేధింపులకు గురైన రెజ్లర్లకు వ్యతిరేకంగా తన క్లయింట్ తరపున డిఫెన్స్ చేస్తుండటంతో చర్చనీయాంశమైంది.
భారత రెజ్లర్లను లైంగిక వేధింపులకు గురి చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ బెయిల్ పై ఈ నెల 20న ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు విచారణ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజీవ్ మోహన్ బ్రిజ్ భూషణ్ కు ఊరట కలిగిస్తారో లేదో చూడాలి మరి.
ఇది కూడా చదవండి: యూట్యూబర్ ఎఫెక్ట్.. కేదార్‌నాథ్ ఆలయంలో మొబైల్ ఫోన్లు నిషేదం..
Comments
Please login to add a commentAdd a comment