రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యుఎఫ్‌ఐ) మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్‌కు ఢిల్లీ కోర్టు శుక్రవారం సమన్లు జారీ చేసింది. ఆరుగురు మహిళా రెజ్లర్లు బ్రిజ్ భూషణ్ సింగ్ తమను లైంగిక వేదించడంతో పాటు బెదిరింపు చర్యలకు పాల్పడినట్లు ఆరోపించారు. దీనిని పరిగణలోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు బ్రిజ్‌భూషణ్‌పై కేసు నమోదు చేశారు.
ఈ కేసులో చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకున్న ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు బ్రిజ్ భూషణ్ సింగ్‌కు సమన్లు జారీ చేసింది. జూలై 18న కోర్టుకు హాజరుకావాలని కోరింది. బ్రిజ్ భూషణ్ సహాయ కార్యదర్శి వినోద్ తోమర్‌కు కూడా కోర్టు సమన్లు జారీ చేసింది.
జూన్ 2న బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణల ఆధారంగా ఢిల్లీ పోలీసులు రెండు ఎఫ్‌ఐఆర్‌లతో పాటు 10 ఫిర్యాదులు నమోదు చేశారు. డబ్ల్యుఎఫ్‌ఐ చీఫ్‌పై వచ్చిన ఫిర్యాదుల్లో మహిళా రెజ్లర్లను అనుచితంగా తాకడం, వారి చాతీపై చేయి వేయడం, నడుము బాగాన్ని చేతితో తడమడం లాంటివి చేసేవాడంటూ పేర్కొన్నారు.
చదవండి: #ManchesterUnited: ఇంగ్లండ్ స్టార్‌కు కళ్లు చెదిరే మొత్తం.. అవి డబ్బులా ఇంకేమైనా!
#HappyBirthdayMSD: '30 లక్షలు సంపాదించి రాంచీలో ప్రశాంతంగా బతికేస్తా'
Comments
Please login to add a commentAdd a comment