Nirbhaya verdict
-
‘నిర్భయ’కు 11 ఏళ్లు... మహిళల భద్రతకు భరోసా ఏది?
అది దేశరాజధాని ఢిల్లీ.. 2012, డిసెంబరు 16.. రాత్రివేళ ఓ ప్రైవేట్ బస్సులో చోటుచేసుకున్న దారుణ అత్యాచార ఘటన భారతదేశాన్నే కాదు యావత్ ప్రపంచాన్నీ కుదిపేసింది. ఈ నేపధ్యంలో ఢిల్లీని అత్యాచారాల క్యాపిటల్‌గా అభివర్ణించారు. నాడు అత్యంత క్రూరంగా జరిగిన అత్యాచార ఘటన దేశంలోని ప్రతీఒక్కరినీ కంటతడి పెట్టించింది. డిసెంబరు నాటి వణికించే చలిలో పారామెడికల్ విద్యార్థిని నిర్భయ కామాంధుల చేతుల్లో చిగురుటాకులా వణికిపోయింది. ఈ నేపధ్యంలో బాధితురాలికి న్యాయం చేయాలంటూ దేశంలోని ప్రజలంతా రోడ్లపైకి వచ్చి ఆందోళనలకు దిగారు. ఈ దారుణ అత్యాచారం దరిమిలా దేశంలో మహిళల రక్షణ విషయంలో పెను మార్పులు వచ్చాయి. దేశవ్యాప్తంగా మహిళల భద్రత కోసం అనేక చర్యలు చేపట్టారు. నిర్భయ అత్యాచార ఘటన దర్యాప్తు అనంతరం జస్టిస్ జేఎస్ వర్మ కమిటీ సిఫార్సులు అమలయ్యాయి. దేశంలోని ప్రతీ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అత్యాచార బాధితుల కోసం వన్ స్టాప్ సెంటర్లు, హెల్ప్లైన్లు ప్రారంభించారు. నిర్భయ ఫండ్ విడుదల చేశారు. నిర్భయ స్క్వాడ్, నిర్భయ యాప్ అందుబాటులోకి వచ్చింది. ఎనిమిదేళ్ల పాటు నిర్భయ కేసు విచారణ కొనసాగగా దోషులైన ముఖేష్, పవన్, అక్షయ్, వినయ్‌లను 2020, మార్చి లో ఢిల్లీలోని తీహార్ జైలులో ఉరితీశారు. ఒక మైనర్‌కు విముక్తి లభించగా, మరో నిందితుడు రామ్ సింగ్ విచారణ సమయంలో జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు. నిర్భయ ఘటన, కేసు దర్యాప్తు, దోషులకు శిక్ష అమలు తర్వాత దేశంలో అత్యాచార ఘటనలు తగ్గుముఖం పట్టివుంటాయని అందరూ భావించివుంటారు. అయితే దీనికి భిన్నమైన పరిస్థితులు దేశంలో తాండవిస్తున్నాయి. ప్రముఖ జాతీయ ఏజెన్సీ ఎన్సీఆర్బీ.. నిర్భయ ఘటన అనంతరం గత 11 ఏళ్లలో దేశంలో చోటుచేసుకున్న అత్యాచార గణాంకాల వివరాలను విడుదల చేసింది. ఇవి మరింత ఆందోళన కలిగించేలా ఉన్నాయని పలువురు అంటున్నారు. సంవత్సరం అత్యాచారం కేసులు 2022 31,516 2021 31,677 2020 28,046 2019 32,032 2018 33,356 2017 32,559 2016 38,947 2015 34,651 2014 36,735 2013 33,707 2012 24,923 నిర్భయ లాంటి హృదయ విదారక అత్యాచార ఘటనల తర్వాత కూడా దేశంలో మహిళల భద్రత విషయంలో ఆశించినంత మార్పు రాలేదు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇటీవల విడుదల చేసిన 2022 సంవత్సరానికి సంబంధించిన నివేదిక ప్రకారం.. గత ఏడాది దేశంలో మొత్తం 31,516 అత్యాచార కేసులు నమోదయ్యాయి. అంటే ప్రతిరోజూ దాదాపు 87 మంది , ప్రతి గంటకు మూడు నుంచి నలుగులు బాలికలు లేదా మహిళలు అత్యాచారానికి గురవుతున్నారు. ఈ నివేదిక ప్రకారం అత్యాచార ఘటనల విషయంలో రాజస్థాన్ మొదటి స్థానంలో ఉంది. గత ఏడాదిలో అత్యధికంగా 5,399 అత్యాచార కేసులు ఇక్కడ నమోదయ్యాయి. ఢిల్లీలో 1212 అత్యాచార కేసులు నమోదయ్యాయి. ఇది కూడా చదవండి: కరడుగట్టిన నియంత ఏడ్చిన వేళ.. -
బ్రిజ్ భూషణ్ తరపున నిర్భయ లాయర్
న్యూఢిల్లీ: మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసులో.. బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్ తరపున వాదిస్తోంది ఎవరో తెలుసా? నిర్భయ కేసు ప్రాసిక్యూటర్ రాజీవ్ మోహన్ డిఫెన్స్ న్యాయవాదిగా వ్యవహరించనున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో నలుగురు నిందితులకు ఉరి శిక్ష పడేలా చేశారు ప్రాసిక్యూటర్ రాజీవ్ మోహన్. 2012లో జరిగిన ఆ సంఘటన ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. నలుగురు నిందితులకు ఎనిమిదేళ్ల తర్వాత 2020 మార్చిలో శిక్ష పడేంతవరకు అవిశ్రాంత పోరాటం చేసి న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగేలా చేశారు రాజీవ్. నాడు న్యాయాన్ని గెలిపించారు.. మరి నేడు..? నిర్భయ కేసులో అద్భుతంగా వాదనలు వినిపించి బాధితురాలికి న్యాయం జరగడంలో తనదైన పాత్ర పోషించిన రాజీవ్ ఇప్పుడు మాత్రం ఎంపీ బ్రిజ్ భూషణ్ తరపున కోర్టుకు వాదనలు వినిపించనున్నారు. నాడు నిర్భయ కేసులో నిందితులకు శిక్ష పడేలా చేసిన అయన ఇప్పుడు వేధింపులకు గురైన రెజ్లర్లకు వ్యతిరేకంగా తన క్లయింట్ తరపున డిఫెన్స్ చేస్తుండటంతో చర్చనీయాంశమైంది. భారత రెజ్లర్లను లైంగిక వేధింపులకు గురి చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ బెయిల్ పై ఈ నెల 20న ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు విచారణ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజీవ్ మోహన్ బ్రిజ్ భూషణ్ కు ఊరట కలిగిస్తారో లేదో చూడాలి మరి. ఇది కూడా చదవండి: యూట్యూబర్ ఎఫెక్ట్.. కేదార్నాథ్ ఆలయంలో మొబైల్ ఫోన్లు నిషేదం.. -
ఉరిశిక్షలను ఆపేయండి: ఐక్యరాజ్యసమితి
న్యూయార్క్: ఐక్యరాజ్యసమితి ఉరిశిక్షల విషయంలో కీలక వ్యాఖ్యలు చేసింది. దోషులకు ఉరిశిక్షలను ఆపేయాలని లేదంటే తాత్కాలికంగా అయినా ఆపాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గ్యుటెరెస్, ఐక్యరాజ్య సమితి ప్రతినిధి స్టిఫానే డుజారిక్ ఉరిశిక్షపై స్పందించారు. ఆంటోనియా గ్యుటెరెస్ మాట్లాడుతూ.. ప్రపంచంలోని దేశాలన్నీ మరణశిక్షను ఆపివేయాలి. లేదా కనీసం ఉరి శిక్షలపై తాత్కాలికంగా అయినా నిషేధాన్ని విధించాలి. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి నిర్ణయం తీసుకుందని విలేకరుల సమావేశంలో తెలిపారు. చదవండి: 'నిర్లక్ష్యం చేస్తే లక్షల్లో ప్రాణాలు పోతాయి' నిర్భయ దోషులను ఉరి తీసిన 24 గంటల తర్వాత ఐక్యరాజ్య సమితి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. నిర్భయను సామూహిక అత్యాచారం చేసి ఆమె చావుకు కారణమైన ముఖేష్ సింగ్ (32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), అక్షయ్ కుమార్ సింగ్ (31) లను శుక్రవారం ఉదయం 5.30 గంటలకు ఢిల్లీలోని తీహార్ జైలులో ఉరితీశారు. దేశంలో నలుగురిని ఒకేసారి ఉరితీయడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా విలయ తాండవం చేస్తున్న కరోనా వైరస్‌ను వీలైనంత వేగంగా కట్టడి చేయలేకపోతే రాబోయే రోజుల్లో మరణాల సంఖ్య లక్షల్లో ఉండే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెరాస్ హెచ్చరించారు. కరోనాను కార్చిచ్చుతో పోల్చారు.కార్చిచ్చులా వ్యాపిస్తున్న ఈ మహమ్మారికి అడ్డుకట్ట వేయకుండా నిర్లక్ష్యం వహిస్తే లక్షల్లో ప్రాణాలు కోల్పోతారని దేశాలను హెచ్చరించారు. ఐక్యరాజ్యసమితి 75 ఏళ్ల చరిత్రలో ఇలాంటి పరిస్థితి ఇంతకుముందెన్నడూ ఏర్పడలేదన్నారు. చదవండి: హీరోయిన్‌కు కరోనా.. ప్రియుడు బ్రేకప్! -
‘ఉరిశిక్షను ఆలస్యం చేసినవారు సిగ్గుపడాలి’
నిర్భయ హత్యాచారం, హత్య కేసులో నలుగురు దోషులైన ముఖేష్ సింగ్, అక్షయ్ ఠాకూర్, పవన్ గుప్తా, వినయ్ శర్మలను శుక్రవారం ఉరి తీసిన విషయం తెలిసిందే. తీహార్ జైలులో శుక్రవారం తెల్లవారుజామున 5:30 గంటలకు ఉరి తీశారు. ఏడు సంవత్సరాల నిరీక్షణ అనంతరం ఎట్టకేలకు నిర్భయకు న్యాయం జరిగింది. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సెలబ్రిటీలు ఈ విషయంపై సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ న్యాయమే గెలిచిందంటూ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. (నేనైతే ఫాంహౌజ్‌కు తీసుకువెళ్లి..: దోషుల లాయర్) తాజాగా టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్‌బాబు స్పందించారు. ‘‘చాలా కాలం వేచి ఉన్నాం. న్యాయం జరిగింది. నిర్భయ ఘటనపై ఇప్పుడు జరిగిన విషయం న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని మరింత పెంచింది. న్యాయం కోసం నిరంతర పోరాటం, కృషి చేసిన నిర్భయ తల్లిదండ్రులకు, న్యాయవాదులకు నా సెల్యూట్. న్యాయవ్యవస్థపై గౌరవం పెరిగింది. ఇలాంటి దురాగతాలకు సత్వర న్యాయం దక్కాలి, బలమైన చట్టాలుండాలి’’ అని ట్వీట్ చేశారు. అలాగే మరో ట్వీట్లో మహమ్మారి కరోనాను అరికట్టేందుకు ఈ నెల 22న (ఆదివారం) జనతా కర్ఫ్యూ పాటించాలని ఇచ్చిన పిలుపుకు అందరూ మద్ధతివ్వాలని కోరారు. (నిర్భయ కేసు: చివరి కోరికల్లేవ్ కానీ ఉరి తర్వాత!) Long awaited but Justice done!! #NirbhayaVerdict restores our faith in the judiciary. Saluting her parents and their advocates for their continuous unflinching efforts. Respect for our judicial system🙏🙏 still advocating for stricter laws and quicker verdicts in heinous crimes🙏 — Mahesh Babu (@urstrulyMahesh) March 20, 2020 నిర్భయ కేసు దోషులును ఉరి తీశారు. అన్న వార్తతో ఈ రోజు ప్రారంభమైంది. న్యాయం జరిగింది.- తమన్నా ఇలాంటి నమ్మశక్యంకాని వార్త. ఏడు సంవత్సరాల తరువాత, నిర్భయ కేసు దోషులను ఉరితీశారు. న్యాయం కోసం అవిశ్రాంతంగా పోరాడిన నిర్భయ తల్లికి, న్యాయవాదికి నా వందనం - రవి తేజ నిర్భయకు న్యాయం జరిగింది. దేశంలోనే కాకుండా ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ ఇది ఓ ఉదాహరణగా నిలవాలి. అఘాయిత్యాలకు ఒడిగట్టిన వారికి ఉరిశిక్ష విధించాలి. మహిళను గౌరవించండి. ఉరిశిక్షను ఇన్నేళ్లపాటు ఆలస్యం చేసిన వారు సిగ్గు పడాలి. జై హింద్ - రిషి కపూర్ ఎన్నో సంవత్సరాల పోరాటం తర్వాత నిర్భయ దోషులకు ఉరిశిక్ష పడింది. చాలా సంవ్సరాల తర్వాత ఈ రోజు నిర్భయ తల్లిదండ్రులు ప్రశాంతంగా నిద్రిస్తారు. తాప్సీ అలాగే ఈ ఘటనపై మరికొంత మంది తారలు కూడా స్పందించారు. శ్రద్ధాకపూర్, రితేష్ దేశ్‌ముఖ్, రవీనాటాండన్, ప్రీతి జింటా, మధుర్ భండార్కర్ తదితరులు వారి ట్విటర్స్ అకౌంట్స్ ద్వారా నిర్భయకు న్యాయం జరిగింది అంటూ ట్వీట్ చేశారు. (జైల్లో నిర్భయ దోషుల సంపాదనెంతో తెలుసా..!) Beginning the day with the incredible news that the #Nirbhayacase convicts are executed. Justice has been served. — Tamannaah Bhatia (@tamannaahspeaks) March 20, 2020 Such incredible news...After seven long years, Nirbhaya case convicts have finally been executed! I Salute the mother and the lawyer who fought tirelessly for so many years to get justice🙏#NirbhayaVerdict — Ravi Teja (@RaviTeja_offl) March 20, 2020 Nirbhaya Justice. “Jaisi karni waisi bharni” Let this set an example not only in India but world over. Punishment for rape is by death. You have to respect womanhood. Shame on the people who delayed the execution. Jai Hind! pic.twitter.com/ENyjTxwlMI — Rishi Kapoor (@chintskap) March 20, 2020 It’s done. Finally. I hope the parents can finally sleep slightly better tonight after YEARS. It’s been a long long battle for them. Asha Devi 🙏🏼 https://t.co/XidMPTzKm4 — taapsee pannu (@taapsee) March 20, 2020 -
'నిర్భయ దోషులకు 7రోజుల గడువు'
న్యూఢిల్లీ: నిర్భయ దోషుల ఉరి శిక్ష వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూనే ఉంది. నిర్భయ దోషుల ఉరిపై ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. నిర్భయ దోషులను వేరువేరుగా ఉరితీయొద్దన్న హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దోషులను వెంటనే ఉరితీసేలా ఆదేశాలివ్వాలని కేంద్ర హోంశాఖ సుప్రీంకోర్టును కోరింది. కాగా.. దోషుల ఉరిశిక్షపై స్టేను ఎత్తివేసి శిక్షించాలని కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేయడంతో పాటు.. డెత్ వారెంట్లపై స్టే విధించిన పాటియాలా హౌస్ కోర్టు తీర్పును పక్కన పెట్టేందుకు నిరాకరించింది. నిర్భయ కేసు: క్లైమాక్స్‌కు చేరిన ఉరిశిక్ష వ్యవహారం! శిక్ష అమలు జాప్యానికి చేసే ప్రయత్నాన్ని హైకోర్టు పరిగణనలోకి తీసుకుని.. వారం రోజుల్లోగా దోషులు తమ న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకోవాలని ఆదేశించింది. అయితే.. దోషులకు విడివిడిగా ఉరిశిక్ష అమలు చేయడం మాత్రం సాధ్యంకాదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. జైలు నిబంధనలు 834, 836 అంశాలను కోడ్ చేస్తూ ఆర్టికల్ 21ను ఉపయోగించి వీరు ఉరిశిక్ష అమలును జాప్యం చేస్తున్నారన్న విషయాన్ని కూడా హైకోర్టు వ్యక్త పరిచింది. అయితే న్యాయపరంగా వీరికి ఉన్న అవకాశాలను వారం రోజుల్లోగా వినియోగించుకోవాలని హైకోర్టు ఆదేశించింది. (ఇంకా సమయం ఇవ్వొద్దు!) ఈ రోజు నుంచి వారం రోజుల్లోగా.. దోషులకు ఉన్న న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే వినయ్, ముఖేష్‌కు సంబంధించిన న్యాయపరమైన అవకాశాలన్నీ ముగిసిపోయాయి. అక్షయ్‌కు సంబంధించిన క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉంది. పవన్ కు సంబంధించి క్యురేటివ్ పిటిషన్, అలాగే మెర్సీ పిటిషన్ ఫైల్ చేయాల్సివుంది. ఈ ఇద్దరు కూడా వారం రోజుల్లోగా వారికున్న న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకోవాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించడంతో వీరు వారం రోజుల్లోపు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. -
సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా
-
ముఖేశ్ పిటీషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు
ఢిల్లీ : సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషిగా ఉన్న ముఖేశ్ కుమార్ పిటీషన్‌ను సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం బుధవారం కొట్టివేసింది. ముఖేశ్ తన క్షమాబిక్ష పిటీషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించిన నేపథ్యంలో చివరి అవకాశంగా సుప్రీంకోర్టులో క్యురేటివ్ పిటీషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం తమ దగ్గరకు వచ్చిన క్యురేటివ్ పిటీషన్‌ను కొట్టివేస్తున్నట్లు జస్టిస్ ఆర్ భానుమతి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. దీంతో నిర్భయ నిందితులను ఫిబ్రవరి 1వ తేదిన ఉదయం 6గంటలకు ఉరి తీసేందుకు అన్ని మార్గాలు సుగమమైనట్లు తెలుస్తుంది. దీనికి సంబందించిన అన్ని అనుమతుల ప్రతులను రాష్ట్రపతికి ప్రభుత్వం పంపించిందని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ముఖేశ్ దరఖాస్తు చేసుకున్న క్షమాబిక్ష పిటీషన్‌ను జనవరి 17న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తిరస్కరించిన సంగతి తెలిసిందే. (జైల్లో లైంగికంగా వేధించారు) ముఖేశ్ పిటీషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేయడంపై నిర్భయ తల్లి ఆశాదేవి హర్షం వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని, న్యాయవ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని ఆమె పేర్కొన్నారు. ఉరి తేది దగ్గర పడుతున్న కొద్ది దోషులు ఎలా తప్పించుకోవాలో తెలియక పిటీషన్ల పేరుతో కాలాయాపన చేస్తున్నారని ఆరోపించారు. -
నాకలాంటి ఉద్దేశం లేదు: మంచు లక్ష్మి
సినీనటి మంచు లక్ష్మీ తన రాజకీయ రంగప్రవేశంపై వస్తున్న వార్తలపై స్పందించారు. తాను రాజకీయాల్లోకి రానని, సమాజ సేవే ముఖ్యమని ఆమె తేల్చి చెప్పింది. గత కొద్దిరోజులుగా మంచు లక్ష్మి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తుందంటూ వార్తలు హల్చల్ చేసిన విషయం తెలిసిందే. అయితే తనకు పాలిటిక్స్‌లోకి వచ్చే ఉద్దేశమే లేదని మంచు లక్ష్మి తెలిపింది. కాగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో దోషులకు మరణశిక్ష విధించడంపై మంచులక్ష్మి విభేదించారు. ఉరిశిక్ష కరెక్ట్ కాదని, వాళ్లకు అమ్మాయిల విలువేంటో అర్థయం అయ్యాలా చెప్పాలని అన్నారు. వాళ్లు కూడా మనుషులే అని, వారికి తప్పు తెలుసుకునే అవకాశం ఇవ్వాలని అన్నారు. స్త్రీ విలువను బాల్యం నుంచే నేర్పించాలని మంచు లక్ష్మి పేర్కొన్నారు. -
నిర్భయ తీర్పు: డిఫెన్స్ లాయర్ సంచలన వ్యాఖ్యలు
-
నిర్భయ తీర్పు: డిఫెన్స్ లాయర్ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: నిర్భయ కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం వెలువరించిన తుది తీర్పుపై నిందితుల తరఫు న్యాయవాది(డిఫెన్స్ లాయర్) ఏపీ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ తీర్పు.. జాతిపిత మహాత్మాగాంధీ ప్రబోధించిన అంహిస సిద్ధాంతానికి విరుద్ధమని, ముమ్మాటికీ మానవహక్కుల ఉల్లంఘనేనని గర్హించారు. నిర్భయ దోషులకు కింది కోర్టులు విధించిన ఉరిశిక్ష సరైందేనని జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల సుప్రీం ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. తీర్పు అనంతరం కోర్టు వెలుపల మీడియాతో మాట్లాడిన డిఫెన్స్ లాయర్ ఏపీ సింగ్.. తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు వెల్లడించారు. ‘సమాజానికి ఏదో సందేశం ఇవ్వాలన్న ఉద్దేశంతో కోర్టులు ఉరి శిక్షలు వేయడం సరికాదు. నిర్భయ కేసులో ఇవాళ కోర్టు ఇచ్చిన తీర్పుతో మానవహక్కులు హత్యకు గురయ్యాయి. మాకు న్యాయం దక్కలేదు. కాబట్టి తప్పకుండా రివ్యూ పిటిషన్ దాఖలుచేస్తాం. తీర్పు కాపీ అందిన తర్వాత ఆ మేరకు ముందుకు వెళతాం’ అని డిఫెన్స్ లాయర్ ఏపీ సింగ్ అన్నారు. ఆ నలుగురిని ఎప్పుడు ఉరి తీస్తారు? నిర్భయ కేసుకు సంబంధించి ప్రత్యేక కోర్టు, ఢిల్లీ హైకోర్టులు జారీచేసిన మరణశిక్షలను సవాలు చేస్తూ నిందితులు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం, విచారణల అనంతరం శుక్రవారం తుది తీర్పు వెలువడిన నేపథ్యంలో దోషులను ఎప్పుడు ఉరి తీస్తారనేది కీలకంగా మారింది. నేటి సుప్రీం ధర్మాసనం తీర్పు.. కింది కోర్టులు విధించిన శిక్షను సమర్థించాయే తప్ప, ఉరి అమలు తేదీలపై ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. నిర్భయ కేసు మొదట విచారించిన ప్రత్యేక న్యాయస్థానమే ఉరితీతపై నిర్ణయం తీసుకుంటుదని, తీర్పు కాపీలు అందిన వెంటనే సంబంధిత న్యాయమూర్తులు ఈ మేరకు ఒక ప్రకటన చేసే అవకాశం ఉంటుందని న్యాయవర్గాలు పేర్కొన్నాయి. వీలైనంత త్వరగా దోషులను ఉరితీయాలని నిర్భయ తల్లిదండ్రులు కోరుతున్న సంగతి తెలిసిందే. (చదవండి: నిర్భయ కాదు.. జ్యోతి అని పిలుద్దాం..) -
నిర్భయ తీర్పును స్వాగతించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
గతేడాది డిసెంబర్లో న్యూఢిల్లీ సామూహిక అత్యాచారం గురైన నిర్భయ కేసులో దోషులకు కోర్టు ఉరిశిక్ష విధించడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం స్వాగతించింది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు గట్టు రామచంద్రరావు శుక్రవారం ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. మానవ మృగాలుగా ప్రవర్తించిన దోషులకు ఇది సరైన శిక్ష అని ఆయన అభివర్ణించారు. దేశంలో మహిళలకు భరోసా కల్పించడంలో ప్రభుత్వాలు ఘోరం విఫలం అవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతేడాది డిసెంబర్లో దేశ రాజధాని న్యూఢిల్లీలో ఫార్మాసీ విద్యార్థినిపై ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం ఆమెపై అత్యంత కిరాతకంగా దాడి చేశారు. ఆమె న్యూఢిల్లీలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, మెరుగైన చికిత్స కోసం సింగపూర్ తరలించారు. అయితే నిర్భయ అక్కడ చికిత్స పొందుతూ డిసెంబర్ నెలాఖరున మరణించింది. ఆ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు మిన్నంటాయి. దీంతో ఆ ఆరుగురు నిందితులను కఠినంగా శిక్షించాల దేశంలోని పలు సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం సాకేత్ కోర్టు నలుగురు నిందితులకు ఉరిశిక్షను ఖరారు చేసింది. అయితే మరో ఇద్దరు నిందితుల్లో ఒకరు తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మరో నిందితుడు బాలనేరస్తుడు కావడంతో అతడికి ప్రత్యేక న్యాయస్థానం మూడేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. -
నిర్భయ తీర్పుపై నారాయణమూర్తి స్పందన