
నాకలాంటి ఉద్దేశం లేదు: మంచు లక్ష్మి
సినీనటి మంచు లక్ష్మీ తన రాజకీయ రంగప్రవేశంపై వస్తున్న వార్తలపై స్పందించారు. తాను రాజకీయాల్లోకి రానని, సమాజ సేవే ముఖ్యమని ఆమె తేల్చి చెప్పింది. గత కొద్దిరోజులుగా మంచు లక్ష్మి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తుందంటూ వార్తలు హల్‌చల్ చేసిన విషయం తెలిసిందే. అయితే తనకు పాలిటిక్స్‌లోకి వచ్చే ఉద్దేశమే లేదని మంచు లక్ష్మి తెలిపింది.
కాగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో దోషులకు మరణశిక్ష విధించడంపై మంచులక్ష్మి విభేదించారు. ఉరిశిక్ష కరెక్ట్ కాదని, వాళ్లకు అమ్మాయిల విలువేంటో అర్థయం అయ్యాలా చెప్పాలని అన్నారు. వాళ్లు కూడా మనుషులే అని, వారికి తప్పు తెలుసుకునే అవకాశం ఇవ్వాలని అన్నారు. స్త్రీ విలువను బాల్యం నుంచే నేర్పించాలని మంచు లక్ష్మి పేర్కొన్నారు.