
సోషల్ మీడియాలో సెలబ్రిటీల మీద పుకార్లు వైరల్ కావడం సహజమే. చాలామంది వాటిని తేలికగా తీసుకుంటారు. కొందరు మాత్రం అసహనం వ్యక్తం చేస్తూ ఒక రేంజ్‌లోనే కౌంటర్లు ఇస్తుంటారు. ఈ క్రమంలో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్‌కి మార్ఫింగ్ ఫొటోలతో తనను బద్నాం చేయడం ఇబ్బంది పెట్టిందట. అందుకే న్యాయపరమైన చర్యలకు సిద్ధమయ్యారు ఆయన.
గోవాకు చెందిన ఓ కాసినోపై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ గరం అయ్యారు. అనుమతి లేకుండా తన ఫొటోలను వాడుకోవడంపై లీగల్ యాక్షన్‌కు సిద్ధమయ్యారు ఆయన. ఈ మేరకు మార్ఫింగ్ చేసిన తన ఫొటోలను ‘బిగ్ డాడీ’ క్యాసినో ప్రమోషన్ కోసం ఉపయోగించుకుంటోందని అసహనం వ్యక్తం చేశారాయన.
Requesting everyone to remain vigilant about misleading images on social media. pic.twitter.com/VCJfdyJome
— Sachin Tendulkar (@sachin_rt) February 24, 2022
‘‘నా ఇన్నేళ్ల కెరీర్‌లో గ్యాంబ్లింగ్‌గానీ, టొబాకోగానీ, ఆల్కాహాల్ ఉత్పత్తులనుగానీ.. నేరుగా గానీ, పరోక్షంగా గానీ తాను ఏనాడూ ఎండోర్స్ చేయలేదని, అలాంటిది తన ఫొటోలు ప్రజల్ని తప్పుదోవ పట్టించేదిగా ఉండడం తనని బాధించిందని చెప్తున్నారు 48 ఏళ్ల టెండూల్కర్.
‘నా లీగల్ టీం అవసరమైన చర్యలు తీసుకుంటోంది. కానీ, ప్రతి ఒక్కరికి ఈ సమాచారం అందించాలనే ఉద్దేశంతో ఈ పోస్ట్ చేస్తున్నా. తప్పుదోవ పట్టించే ఆ ఫొటోలను నమ్మకండి’ అంటూ ట్విటర్‌లో సచిన్ ఇవాళ ఒక ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment