
యునైటెడ్ బ్యాంక్ పై కోర్టుకెళతా: మాల్యా
హైదరాబాద్: యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తనను ఎగవేతదారుడిగా ప్రకటించడంపై కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ అధినేత, లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా అసంతృప్తి వ్యక్తం చేశారు. డిఫాల్టర్ ట్యాగ్ ను అంగీకరించబోనని, ఆ బ్యాంకుపై న్యాయపరమైన చర్య తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. న్యాయవ్యవస్థపై తనకు నమ్మకం ఉందని పేర్కొన్నారు.
విజయమాల్యాను యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సోమవారం డిఫాల్టర్గా ప్రకటించింది. బ్యాంకుల నుంచి రుణాలు పొంది నిబంధనలకు విరుద్దంగా ఇతర అవసరాలకు కేటాయించడం, తిరిగి చెల్లించకపోవడం లాంటి చర్యలకు ఆయన పాల్పడ్డారని ఆరోపించింది.