కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ అధినేత, లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.
ముంబయి : కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ అధినేత, లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఉద్దేశపూర్వకంగానే మాల్యా బకాయిలు ఎగవేస్తున్నారని ఆ బ్యాక్ వ్యాఖ్యానించింది. కాగా బ్యాంకుల నుంచి రుణాలు పొంది నిబంధనలకు విరుద్దంగా ఇతర అవసరాలకు కేటాయించడం, తిరిగి చెల్లించకపోవడం లాంటి చర్యలు ఉద్దేశ్యపూర్వక డిఫాల్టర్ల కిందకు వస్తారు. సదరు వ్యక్తికి మంజూరు చేసిన రుణాలను రీకాల్ చేసుకునే అధికారం బ్యాంకులకు లభిస్తుంది.
విల్‌ఫుల్ డిఫాల్టర్‌కు బ్యాంకుల రుణాలు పుట్టవు, వారు డైరెక్టర్‌గా ఉన్న కంపెనీలను కూడా బ్యాంకులు దూరంగా పెడతాయి. కోల్‌కత్తా కేంద్రంగా పని చేస్తోన్న యునైటెడ్ బ్యాంకు ఆఫ్ ఇండియా తొలిసారి విజయ మాల్యను డిఫాల్టర్‌గా ప్రకటించటం విశేషం. ఇప్పటికే మాల్యాను ఎందుకు ఎగవేతదారుడిగా ప్రకటించకూడదో వెల్లడించాలంటూ ఆయనకు నోటీసులు జారి చేసిన విషయం తెలిసిందే.