wilful defaulter
-
లోన్ల పేరుతో.. బ్యాంకులకు రోజుకు రూ.100 కోట్లు ఎగ్గొడుతున్నారు
దేశంలో కావాలనే బ్యాంకు రుణాలు ఎగవేస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్లు తెలుస్తోంది. వెరసి ప్రతి రోజు ఉద్దేశ పూర్వకంగా (Wilful Defaulter) ఎగవేతకు పాల్పడుతున్న సొమ్ము రూ.100 కోట్లుగా ఉంది. గత నాలుగేండ్లలో ఉద్దేశపూర్వక ఎగవేతదార్లు బ్యాంక్‌లకు చెల్లించాల్సిన మొత్తం రూ.1.2 లక్షల కోట్ల మేరకు పేరుకుందని బిజినెస్ స్టాండర్డ్ తెలిపింది. ఎగవేత దారులు ఏ రాష్ట్రంలో ఎక్కువ మంది ఉన్నారంటే విల్‌ఫుల్ డిఫాల్టర్లు బ్యాంక్‌లకు ఎగవేసిన మొత్తం..దేశంలోని అన్ని రాష్ట్రాలకంటే మహారాష్ట్రలో అధికంగా ఉంది. 2019 మార్చి నుంచి మహారాష్ట్రలోని ఉద్దేశపూర్వక ఎగవేతదార్ల బకాయి మొత్తం రూ.60,000 కోట్ల నుంచి రూ.1.30 లక్షల కోట్లకు చేరింది. ఈ తరహా రుణాల్లో 70 శాతం మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, గుజరాత్, తమిళనాడుల్లో పేరుకుపోయింది. గత నాలుగేండ్లలో ఢిల్లీలోనైనే ఉద్దేశపూర్వక ఎగవేత మొత్తం 200 శాతం పెరిగి రూ.60 వేల కోట్లకు చేరగా, మిగిలిన రాష్ట్రాల్లో ఈ పెరుగుదల 95 శాతం మేర ఉన్నది. ఎగవేత దారులంటే? ట్రాన్స్‌యూనియన్ సిబిల్ గణాంకాల ప్రకారం 2019 మార్చి నుంచి ఉద్దేశపూర్వక ఎగవేతదారులు బ్యాంక్‌లకు బకాయిపడిన సొమ్ము 50 శాతంపైగా పెరిగి, 2023 జూన్ నాటికి మొత్తం బకాయిలు రూ.3 లక్షల కోట్లకు చేరాయి. కట్టగలిగే సామర్ధ్యం ఉండి తీసుకున్న లోన్లను 6 నెలలు లోపు చెల్లించని వారిని ఉద్దేశ పూర్వకంగా ఎగవేత దారులకు ప్రకటించాలని ఇటీవల ఆర్బీఐ ప్రతిపాదన తెచ్చింది. ప్రభుత్వ బ్యాంకుల్లో అధికం మరోవైపు ఉద్దేశపూర్వక ఎగవేతదారుల (Wilful defaulters) జాబితాలో 1,921 ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్లు ఉండగా.. ఆ అకౌంట్ల నుంచి తీసుకున్న మొత్తం రుణాల విలువ రూ.79,271 కోట్లు, నేషనలైజ్డ్ బ్యాంక్స్ 11,935 అకౌంట్లు ఉండగా రుణాలు మొత్తం రూ. 193,596 కోట్లు, ప్రైవేట్ బ్యాంక్ అకౌంట్లు 2,332 ఉండగా.. రుణాలు రూ. 54,250 కోట్లు, 2,231 పంజాబ్ నేషనల్ బ్యాంక్ అకౌంట్లు ఉండగా ఆ రుణాల మొత్తం విలువ రూ.41,353 కోట్లు, యూనియన్ బ్యాంక్‌కు చెందిన 1,831 అకౌంట్లు ఉండగా వాటి మొత్తం విలువ రూ.35,623 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రూ.22,754 కోట్లు తీసుకోగా అకౌంట్లు 340 ఉన్నాయి. ఐడీబీఐకి చెందిన 340 బ్యాంక్ అకౌంట్లు ఉండగా 24,192 కోట్లు ఉన్నాయి. మార్చి 2023 సమయానికి 36,150 ఎన్పీఏ బ్యాంక్ అకౌంట్ల నుంచి రూ.9.24లక్షల కోట్లు వసూలు చేసింది. -
విల్‌ఫుల్ డిఫాల్టర్‌గా యశ్ బిర్లా సూర్య
ఉద్దేశపూర్వక రుణ వేగవేతదారుల జాబితాలో మరో పారిశ్రామికవేత్త చేరాడు. యశ్ బిర్లా గ్రూప్ ఛైర్మన్, యశోవర్ధన్ బిర్లాను యుకో బ్యాంక్ ఉద్దేశపూర్వక ఎగవేతదారుడుగా ప్రకటించింది. బిర్లా సూర్య కంపెనీ రూ.67.65 కోట్లు చెల్లించలేదంటూ బ్యాంకు ఆదివారం ఈ మేరకు బహిరంగ నోటీసులు జారీ చేసింది. అప్పు తీర్చే ఆర్థిక సామర్థ్యం ఉన్నప్పటికీ బకాయిలు చెల్లించని ఉద్దేశపూర్వక రుణఎగవేతదారుడుగా బిర్లా సూర్యను ముంబైలోని యుకో బ్యాంక్ కార్పొరేట్ శాఖ ప్రకటించింది. రుణ బకాయిలు చెల్లించనందున, యశ్ బిర్లాను గతంలో (జూన్ 3, 2013) ఎన్‌పిఎగా బ్యాంకు ప్రకటించింది. అప్పటినుండి బకాయి రూ .67.65 కోట్లకు చేరింది. దీనిపై అనేక నోటీసులు ఉన్నప్పటికీ, రుణగ్రహీత తమకు చెల్లించాల్సిన బకాయిలను తిరిగి చెల్లించలేదంటే యశ్ బిర్లా ఫోటోతో సహా విడదుల చేసిన నోటీసులో బ్యాంక్ పేర్కొంది. అలాగే యశ్ బిర్లా సంస్థ దాని డైరెక్టర్లు, ప్రమోటర్లు, హామీదారులను ఉద్దేశపూర్వక ఎగవేతదారులు (విల్‌ఫుల్ డిఫాల్టర్స్) గా బ్యాంక్ ప్రకటించింది. కోల్‌కతాకు చెందిన యుకో బ్యాంక్ మరో ఏడు కంపెనీల డైరెక్టర్లను ఉద్దేశపూర్వక ఎగవేతదారులుగా ప్రకటించింది. దీంతో మొత్తం బకాయి రూ.740 కోట్లుగా ఉంది. కాగా నిధుల మళ్లింపు, అవినితికిఆరోపణలకు సంబంధించి బిర్లా సంస్థలు బిర్లా కాట్సిన్, బిర్లా శోకాఎడ్యూటెక్, జెనిత్స్టీల్ కంపెనీలపై కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇప్పటికే (2018, సెప్టెంబరు) దర్యాప్తునకు ఆదేశించింది. యశోవర్ధన్ బిర్లాకు బిర్లా సూర్యతోపాటు డజనుకు పైగా ఇతర కంపెనీలు ఉన్నాయి. జెనిత్ స్టీల్, బిర్లా పవర్, బిర్లా లైఫ్ స్టైల్, శ్లోకా ఇన్ఫోటెక్ ప్రధానమైనవి. -
బ్యాంకులకు సర్వాధికారాలు
విల్‌ఫుల్ డిఫాల్టర్లపై న్యూఢిల్లీ: ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుల(విల్‌ఫుల్ డిఫాల్టర్లు)పై చర్యల విషయంలో బ్యాంకులకు సర్వాధికారాలు ఉన్నాయని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. సోమవారమిక్కడ ప్రభుత్వ రంగ బ్యాంకు(పీఎస్బీ)ల చీఫ్‌లతో త్రైమాసిక సమీక్ష సమావేశం సందర్భంగా ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. స్టీల్ సహా వివిధ రంగాల్లో బ్యాంకుల మొండిబకాయిలు(ఎన్పీఏలు) ఆమోదనీయస్థాయిని మించి పెరిగిపోవడంపట్ల జైట్లీ ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యలను బ్యాంకుల అధిపతులు, ఆర్బీఐ అధికారులతో చర్చించారు. వృద్ధిరేటు క్రమంగా జోరందుకుంటున్న నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా ఎన్పీఏల ఒత్తిడి నుంచి బ్యాంకులు బయటపడాల్సిన అవసరం ఉందన్నారు. పీఎస్బీల్లో స్థూల ఎన్పీఏలు ఈ ఏడాది జూన్ చివరి నాటికి 6.03 శాతానికి(మొత్తం రుణాల్లో) ఎగబాకడం తెలిసిందే. మార్చి చివరికి ఈ పరిమాణం 5.2 శాతంగా ఉంది. భేటీలో ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య సహా వివిధ బ్యాంకుల అధిపతులు పాల్గొన్నారు. వివిధ విభాగాలకు చెందిన కార్యదర్శులు కూడా తాము నేతృత్వం వహిస్తున్న రంగాలకు సంబంధించి ప్రాజెక్టులకు రుణ అవసరాలపై ప్రజెంటేషన్‌ను ఇచ్చారు. అదేవిధంగా ప్రభుత్వం చేపడుతున్న జనధన యోజన, ముద్ర యోజన, పెన్షన్లు ఇతరత్రా సామాజిక భద్రత పథకాల అమలు తీరుతెన్నులపై కూడా జైట్లీ ఈ సందర్భంగా సమీక్ష నిర్వహించారు. మరోపక్క, సెప్టెంబర్‌లో ఆర్బీఐ రెపో రేటు కోత తర్వాత బ్యాంకుల వడ్డీరేట్ల తగ్గింపు చర్యలపై కూడా ఆర్థిక మంత్రి చర్చించారు. జనధన యోజన స్కీమ్‌ను విజయవంతంగా అమలు చేసిన బ్యాంకులు, సంబంధిత శాఖలకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా ట్రోఫీలు, సర్టిఫికెట్లను అందజేశారు. ‘కొంత మంది డిఫాల్టర్లు చాలా బ్యాంకుల జాబితాలో ఉన్న విషయం ప్రధానంగా ఈ సమావేశంలో చర్చకు వచ్చింది. అటువంటి వారిపై చర్యలు తీసుకోవడంలో బ్యాంకులకు ఇప్పుడు పూర్తి అధికారాలు, స్వేచ్ఛ ఉన్నాయి’ అని జైట్లీ పేర్కొన్నారు. డిఫాల్ట్ కేసుల పరిష్కారానికి సంబంధించి ఆర్బీఐ బ్యాంకులకు అన్ని అధికారాలూ ఇచ్చిందని.. కొత్తగా ప్రవేశపెట్టిన దివాలా(బ్యాంక్రప్సీ) చట్టం కూడా బ్యాంకింగ్ కార్యకలాపాల మెరుగుదలకు తోడ్పాటునందిస్తుందన్నారు. తాజాగా కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ రూ.7,000 కోట్ల రుణ ఎగవేతకు సంబంధించి విజయ్ మాల్యాను ఎస్బీఐ విల్‌ఫుల్ డిఫాల్టర్‌గా ప్రకటించిన విషయంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక వ్యవస్థ మరింత పుంజుకుంటే... వివిధ పారిశ్రామిక రంగాల్లో ఇబ్బందులు తొలగి.. ఆర్థిక వ్యవస్థ మరింతగా పుంజుకుంటే బ్యాంకుల మొండిబకాయిల సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయని జైట్లీ పేర్కొన్నారు. పీఎస్బీలకు ‘ఇంధ్రధనుష్’ పథకంలో భాగంగా తొలివిడత ఇప్పటికే రూ.20 వేల కోట్ల మూలధనాన్ని కేంద్రం అందించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. జాతీయ రహదారుల రంగాన్ని గాడిలోపెట్టామని.. ఇటీవల ప్రకటించిన విద్యుత్ రంగ సంస్కరణల కారణంగా డిస్కమ్‌ల రుణ భారం వల్ల తలెత్తిన సమస్యలు కూడా దిగొస్తాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. వ్యవసాయం, హౌసింగ్, విద్య, టెక్స్టైల్స్ తదితర విభాగాలకు రుణ కల్పన అంశాన్ని కూడా భేటీలో ఆర్థిక మంత్రి చర్చించారు. దశలవారీగా గోల్డ్ బాండ్లు... గోల్డ్ బాండ్ల పథకాన్ని దశలవారీగా పునఃప్రారంభిస్తామని జైట్లీ చెప్పారు. తొలి విడత గోల్డ్ బాండ్ల జారీ ఈ నెల 20తో ముగిసిన సంగతి తెలిసిందే. స్టీల్ రంగంలో తీవ్ర సమస్యలు.. అంతర్జాతీయంగా మందగమనం కారణంగా ధరలు ఘోరంగా పడిపోయి స్టీల్, అల్యూమినియం రంగాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని జైట్లీ చెప్పారు. ఈ రంగాలను ఆదుకోవడానికి సంబంధించి ఇతరత్రా ఎటువంటి విధానపరమైన చర్యలు తీసుకోవాలన్నదానిపై బ్యాంకులు, రెవెన్యూ విభాగాలు చర్చించనున్నాయన్నారు. దీన్ని ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి పర్యవేక్షిస్తారని ఆర్థిక మంత్రి చెప్పారు. బ్యాంకుల ఎన్‌పీఏల్లో స్టీల్ రంగానికి చెందిన కంపెనీల నుంచే భారీగా ఉండటం గమనార్హం. కాగా, దేశీ ఉత్పత్తిదారులను ఆదుకోవడానికి ఉక్కుపై 20 శాతం రక్షణాత్మక దిగుమతి సుంకం విధింపుతోపాటు పలు చర్యలను ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. డిజిన్వెస్ట్‌మెంట్‌పై మార్కెట్ ప్రభావం స్టాక్ మార్కెట్లో పరిస్థితులు మెరుగుపడితేనే కొన్ని పీఎస్‌యూల్లో ముఖ్యంగా లోహ రంగాలకు చెందిన కంపెనీల్లో వాటాలను విక్రయించేందుకు(డిజిన్వెస్ట్‌మెంట్) వీలవుతుందని జైట్లీ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా మెటల్ స్టాక్స్ భారీగా పడిపోయిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఇటువంటి తరుణంలో వీటిలో వాటాల అమ్మకం సరైన నిర్ణయం కాదన్నారు. ఈ ఏడాది(2015-16) ప్రభుత్వం నిర్ణయించిన రూ.69,500 కోట్ల డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యం నెరవేరడం కష్టమేనన్న వాదనల నేపథ్యంలో జైట్లీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇప్పటికే ఎనిమిది నెలలు పూర్తవుతున్నప్పటికీ.. నాలుగు కంపెనీల్లో(పీఎఫ్సీ, ఆర్ఈసీ, డ్రెడ్జింగ్ కార్పొరేషన్, ఐఓసీ) డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ.12,600 కోట్లను మాత్రమే కేంద్రం సమీకరించగలిగింది. ఇప్పటికే కేబినెట్ ఆమోదం పొందిన 20 వరకూ కంపెనీలు వరుసలో ఉన్నాయి. -
మాల్యాను డిఫాల్టర్‌గా ప్రకటించిన యునైటెడ్ బ్యాంక్
ముంబయి : కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ అధినేత, లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఉద్దేశపూర్వకంగానే మాల్యా బకాయిలు ఎగవేస్తున్నారని ఆ బ్యాక్ వ్యాఖ్యానించింది. కాగా బ్యాంకుల నుంచి రుణాలు పొంది నిబంధనలకు విరుద్దంగా ఇతర అవసరాలకు కేటాయించడం, తిరిగి చెల్లించకపోవడం లాంటి చర్యలు ఉద్దేశ్యపూర్వక డిఫాల్టర్ల కిందకు వస్తారు. సదరు వ్యక్తికి మంజూరు చేసిన రుణాలను రీకాల్ చేసుకునే అధికారం బ్యాంకులకు లభిస్తుంది. విల్‌ఫుల్ డిఫాల్టర్‌కు బ్యాంకుల రుణాలు పుట్టవు, వారు డైరెక్టర్‌గా ఉన్న కంపెనీలను కూడా బ్యాంకులు దూరంగా పెడతాయి. కోల్కత్తా కేంద్రంగా పని చేస్తోన్న యునైటెడ్ బ్యాంకు ఆఫ్ ఇండియా తొలిసారి విజయ మాల్యను డిఫాల్టర్‌గా ప్రకటించటం విశేషం. ఇప్పటికే మాల్యాను ఎందుకు ఎగవేతదారుడిగా ప్రకటించకూడదో వెల్లడించాలంటూ ఆయనకు నోటీసులు జారి చేసిన విషయం తెలిసిందే.