Anand Mahindra Angry With Instagram Page Over Fake Quotation: మీడియా, సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీలు, వ్యాపారదిగ్గజాలు, నేతలకు సంబంధించిన ప్రతీ అప్‌డేట్ ఈమధ్యకాలంలో జనాలకు చేరుతోంది. అయితే ఈ క్రమంలోనే అసత్య ప్రచారాలు, ఫేక్ పోస్టులు సైతం వైరల్ అవుతుండడం విశేషం.
ఈ మధ్య వరుసగా ఇంటర్నెట్‌లో ప్రముఖ వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రకు సంబంధించిన ఫేక్ కథనాలు వరుసగా చక్కర్లు కొడుతున్నాయి. ఈ తరుణంలో స్వయంగా ఆయనే రియాక్ట్ అవుతున్నారు. అయితే తాను అనని మాట అన్నట్లుగా ప్రచారం చేస్తున్న వాళ్లపై ‘ఎక్కడి నుంచి వచ్చారంటూ’ అగ్గిమీద గుగ్గిలం అయ్యారాయన.
As a colleague told me: ‘It looks like it’s hunting season on you with miscreants on the internet.’ Another completely fabricated quote falsely attributed to me. I’ll be taking legal action. Meanwhile, I’m going to post the 2 memes to the right, below, whenever I spot more fakes! pic.twitter.com/9DPM5k0Kde
— anand mahindra (@anandmahindra) November 21, 2021
గత కొన్నిరోజులుగా ‘‘సగటు భారతీయుడు జీవితం అతని చేతుల్లోనే లేదంటూ’’ మహీంద్ర పేరిట ఒక కొటేషన్ వైరల్ అయ్యింది. అయితే అది సగటు భారతీయుల్ని కించపరిచినట్లుగా ఉండడమే ప్రధాన అభ్యంతరం. ఈ ఫేక్ కోట్ తన కొలీగ్ ద్వారా విషయం తన దృష్టికి వచ్చిందంటూ పేర్కొన్న మహీంద్ర.. అందుకు సంబంధించిన ఫొటోల్ని ట్విటర్‌లో షేర్ చేశారు. అంతేకాదు తాను అనని మాటల్ని అన్నట్లుగా వైరల్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ పేజీ మీద లీగల్ యాక్షన్ తీసుకోనున్నట్లు ప్రకటించారు.
పనిలో పనిగా తన చాతుర్యం ప్రదర్శిస్తూ.. ‘జాలీ ఎల్‌ఎల్‌బీ’లోని నటుడు అర్షద్ వార్సీ ఫేమస్ డైలాగ్ మీమ్.. ‘కౌన్ యే లోగ్?.. కహా సే ఆతే హైన్?’ అంటూ ఫేక్ రాయుళ్లపై పంచ్ కూడా విసిరారు. ఇలాంటి ఫేక్ కొటేషన్లు తన పేరుతో చాలానే ప్రచారం అవుతున్నాయని చెప్తున్నారాయన.
క్లిక్ చేయండి: అంతా అబద్ధం.. ఒక్క రూపాయి పెట్టలేదు!: ఆనంద్ మహీంద్రా
Comments
Please login to add a commentAdd a comment