Quotation
-
మాట్లాడితే పంచ్ పడాలంతే..!
ఎన్నికల ప్రచారంలో వాడీవేడి కొటేషన్లు ‘‘నాకు ఏం మాట్లాడినా పంచ్ ఉండాలంతే.. పంచ్ లేకుంటే కుదరదంతే’ అని ’ఆర్య’ సినిమాలో సునీల్ చేసిన హడావుడి బాగా పేలింది. ఇప్పుడు ప్రచారంలో పంచ్ డైలాగ్‌లు లేకుంటే పస ఉండదని భావిస్తున్న పార్టీల అభ్యర్థ్ధులు మంచి మంచి కొటేషన్లతో పంచ్‌లు విసురుతున్నారు. సోషల్ మీడీయాలో వాటిని వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నారు. సాక్షి, సిద్దిపేట :ఈ నెల 30న అందరి వేళ్లకు ఇంక్.. రాష్ట్రమంతా పింక్ అంటూ, అప్పుడు ఎట్లుండే తెలంగాణ..ఇప్పుడు ఎట్లయ్యింది తెలంగాణ అని బీఆర్ఎస్ అభ్యర్థుల కొటేషన్లు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తెలంగాణ ఏర్పాటు కాకముందు 2014లో ఎలా ఉండే.. 2023లో ఎలా ఉందని బీఆర్ఎస్ అభ్యర్థులు డైలాగ్ కొటేషన్‌తో ప్రశ్నిస్తున్నారు. వీటితోపాటు కాంగ్రెస్, బీజేపీ కొటేషన్లు కూడా సోషల్ మీడియాలో ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఆకట్టుకున్న కొటేషన్లు కొన్ని.. అన్నా... జిల్లాజిల్లాకూ ఐటీ టవర్.. మా గుండెల్లో ఉంటాడు కేటీఆర్ ఫరెవర్ మా అన్నను ప్రేమిస్తారు మహబూబ్‌నగర్ క్రౌడ్.. డెవలప్మెంట్ ఆగొద్దంటే రావాలి మా అన్న శ్రీనివాస్ గౌడ్ మర్చిపోతామా సాయన్న చేసిన సాయమూ.. కంటోన్మెంట్లో లాస్యమ్మ గెలుపు ఖాయమూ.. బాల్కొండలో ఎగురబోతుంది గులాబీ జెండా... ప్రశాంత్ అన్న మన అందరికీ అండా దండా.. ఎవరికి పడితే వాడికి కొట్టం జిందాబాద్... మా గోవర్న రూరల్ నిజాంబాద్ కాంగ్రెస్ బీజేపీ అందరు పక్కకు జరగాలి... మెదక్‌లో భారీ మెజారిటీ రాబోతుంది మా పద్మక్క కాంగ్రెస్ మారుస్తుంది తెలంగాణ భవిష్యత్ ఇప్పుడు ఇస్తుంది 200 యూనిట్ల ఫ్రీ విద్యుత్ బాగుండాలి ఐదేళ్ల జీవితం.... రావాలి ఐదు వేళ్ల హస్తం కాంగ్రెస్ మనకు అండ దండ... ఇస్తుంది రూ. 500కే గ్యాస్ బండ కాంగ్రెస్ వస్తే ఎన్నో ఉపయోగాలు.... యువతకు దొరుకుతాయి లక్షల్లో ఉద్యోగాలు తెలంగాణలో కమలం జెండా ఎగరాలి.. బీజేపీ గెలవాలి... బీసీ సీఎం కావాలి బద్దలు కొడదాం దొరల గడీ సాలు దొర... సెలవు దొర. -
‘స్నేహంతో పని జరిగినప్పుడు, శత్రుత్వంతో పనెందుకు!
స్నేహితుల దినోత్సవం సందర్భంగా అంతర్జాలంలో అలనాటి సినిమా ‘దోస్తి’ (1964) తప్పనిసరిగా ప్రస్తావనకు వస్తుంది. సత్యన్‌బోస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ కొట్టింది. ‘బెస్ట్ ఫిల్మ్’ తో సహా ఆరు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్లు గెలుచుకుంది. ఒక యాక్సిడెంట్లో కాలు కోల్పోయిన రాము, కంటిచూపు లేని మోహన్ అనే ఇద్దరు కుర్రాళ్ల మధ్య స్నేహానికి అద్దం పట్టే చిత్రం ఇది. ఈ ఇద్దరు స్నేహితులకు పాట స్నేహితురాలు. అన్నదాత. ఎన్నో కష్టాలు, ప్రలోభాలు ఎదురైనా వారి స్నేహ ప్రపంచం చెక్కు చెదరదు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా చూడాల్సిన సినిమాలలో ఇదొకటి. అలాగే 'స్నేహంలో విభేదాలు ఉండవు’ అని అనుకోవడానికి లేదు. ఎన్నో కారణాల వల్ల ఫ్రెండ్షిప్ బ్రేక్‌డౌన్ కావచ్చు. మళ్లీ కలుసుకోవాలని, మునపటిలా హాయిగా మాట్లాడుకోవాలని ఉన్నా ఏవో ఇగోలు అడ్డుపడుతుంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని పాశ్చాత్య దేశాల్లో ‘ఇన్విజిబిలియా: థెరపీ విత్ ఫ్రెండ్స్’ అనే ట్రెండ్ మొదలైంది. అనగా ఒక సైకాలజిస్ట్ విడిపోయిన ఇద్దరు స్నేహితులను ఒక దగ్గర కూర్చోబెట్టుకొని ఒకటి లేదా రెండు మూడు రోజుల సెషన్లతో వారి స్నేహాన్ని తిరిగి పట్టాలకెక్కిస్తారు. ‘ఇదంతా ఎందుకు?’ అనుకునేవారు దూరం అయిన ఫ్రెండ్‌కు ‘సారీ రా’ అని మెసేజ్ పెట్టి చూడండి చాలు...‘సారీ’కి ఉండే పవర్ ఏమిటో మీకే తెలుస్తుంది! ఆ నలుగురు స్నేహితులు ఇంగ్లీష్ సింగర్, సాంగ్ రైటర్, మ్యూజిషియన్, పీస్ యాక్టివిస్ట్ జాన్ లెనన్ తన ‘ఇమేజిన్’ పాటలో ఏం అంటాడు? నీ తల మీద ఆకాశం తప్ప, స్వర్గనరకాలు, మతాలు, కులాలు, సరిహద్దు ద్వేషాలు లేని ఒక కొత్త ప్రపంచం, ఆస్తులు, అంతస్తుల తేడా లేని సరికొత్త సమాజాన్ని ఊహించుకో అంటాడు. ‘ఐయామ్ ఏ డ్రీమర్ బట్ ఐయామ్ నాట్ ది వోన్లీ వన్’ అని కూడా అంటాడు. ప్రపంచంలో ఎంతోమందిలాగే ఈ పాటతో ప్రభావితమైన వాళ్లలో బెంగళూరుకు చెందిన నలుగురు స్నేహితులు ఉన్నారు. మెలిషా, వినోద్ లోబో, నితిన్ కుమార్, విగ్నేష్‌లు ‘ఇమేజిన్’ సాంగ్ స్ఫూర్తితో ‘ఇమేజిన్ ట్రస్ట్’ ప్రారంభించారు. సేవా కార్యక్రమాలకు సంబంధించి తొలి దశలో భాగంగా ‘క్లాత్ బ్యాంక్’కు శ్రీకారం చుట్టారు. దాతల నుంచి సేకరించిన ఈ దుస్తులను పేదలు రూపాయి ఇచ్చి కొనవచ్చు. వన్స్‌మోర్ ఫ్రెండ్షిప్ డైలాగ్‌లు నిజమైన స్నేహితులు కన్నీటి చుక్కల్లాంటి వారు. మనసు బాధగా ఉన్నప్పుడు చప్పున బయటికి వస్తారు’ ‘స్నేహంతో పని జరిగినప్పుడు, శత్రుత్వంతో పని ఎందుకు!’ – వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై సినిమా నిజమైన స్నేహితుడు, స్నేహితుడి తప్పులను తన తప్పులుగా భావించి క్షమిస్తాడు. – ఏ రస్తే ప్యార్ కే స్నేహితుడు చనిపోవచ్చు. స్నేహం చనిపోదు. – ఎల్వోసీ కార్గిల్ స్నేహం అనేది ఎలా బతకాలో మాత్రమే కాదు ఎలా చావకూడదో నేర్పుతుంది. – ఏబీసీడి–ఎనీబడి కెన్ డ్యాన్స్ స్నేహితులు ఉన్న వారే అసలైన సంపన్నులు – రంగ్ దే బసంతీ స్నేహంలోని ఒక నియమం...నో సారీ...నో థ్యాంక్! – కుచ్ కుచ్ హోతా హై (చదవండి: ఔరా అమ్మకచెల్ల... భాంగ్రా స్టెప్పులు వేయడం ఇల్లా!) -
రేయ్.. ఎవర్రా మీరు? ఎక్కడి నుంచి వచ్చార్రా?
Anand Mahindra Angry With Instagram Page Over Fake Quotation: మీడియా, సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీలు, వ్యాపారదిగ్గజాలు, నేతలకు సంబంధించిన ప్రతీ అప్డేట్ ఈమధ్యకాలంలో జనాలకు చేరుతోంది. అయితే ఈ క్రమంలోనే అసత్య ప్రచారాలు, ఫేక్ పోస్టులు సైతం వైరల్ అవుతుండడం విశేషం. ఈ మధ్య వరుసగా ఇంటర్నెట్లో ప్రముఖ వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రకు సంబంధించిన ఫేక్ కథనాలు వరుసగా చక్కర్లు కొడుతున్నాయి. ఈ తరుణంలో స్వయంగా ఆయనే రియాక్ట్ అవుతున్నారు. అయితే తాను అనని మాట అన్నట్లుగా ప్రచారం చేస్తున్న వాళ్లపై ‘ఎక్కడి నుంచి వచ్చారంటూ’ అగ్గిమీద గుగ్గిలం అయ్యారాయన. As a colleague told me: ‘It looks like it’s hunting season on you with miscreants on the internet.’ Another completely fabricated quote falsely attributed to me. I’ll be taking legal action. Meanwhile, I’m going to post the 2 memes to the right, below, whenever I spot more fakes! pic.twitter.com/9DPM5k0Kde — anand mahindra (@anandmahindra) November 21, 2021 గత కొన్నిరోజులుగా ‘‘సగటు భారతీయుడు జీవితం అతని చేతుల్లోనే లేదంటూ’’ మహీంద్ర పేరిట ఒక కొటేషన్ వైరల్ అయ్యింది. అయితే అది సగటు భారతీయుల్ని కించపరిచినట్లుగా ఉండడమే ప్రధాన అభ్యంతరం. ఈ ఫేక్ కోట్ తన కొలీగ్ ద్వారా విషయం తన దృష్టికి వచ్చిందంటూ పేర్కొన్న మహీంద్ర.. అందుకు సంబంధించిన ఫొటోల్ని ట్విటర్లో షేర్ చేశారు. అంతేకాదు తాను అనని మాటల్ని అన్నట్లుగా వైరల్ చేసిన ఇన్స్టాగ్రామ్ పేజీ మీద లీగల్ యాక్షన్ తీసుకోనున్నట్లు ప్రకటించారు. పనిలో పనిగా తన చాతుర్యం ప్రదర్శిస్తూ.. ‘జాలీ ఎల్ఎల్బీ’లోని నటుడు అర్షద్ వార్సీ ఫేమస్ డైలాగ్ మీమ్.. ‘కౌన్ యే లోగ్?.. కహా సే ఆతే హైన్?’ అంటూ ఫేక్ రాయుళ్లపై పంచ్ కూడా విసిరారు. ఇలాంటి ఫేక్ కొటేషన్లు తన పేరుతో చాలానే ప్రచారం అవుతున్నాయని చెప్తున్నారాయన. క్లిక్ చేయండి: అంతా అబద్ధం.. ఒక్క రూపాయి పెట్టలేదు!: ఆనంద్ మహీంద్రా -
ఎదుటోడిని వేసుకోండి
సిగ్నల్ పడకముందే దాటేయాలని హోండా యాక్టివా స్పీడ్ పెంచింది అమృత. హఠాత్తుగా ఆ చౌరస్తాలో ఆమెకు రైట్ సైడ్ ఉన్న రోడ్ నుంచి ఓ టూ వీలర్ అడ్డురావడంతో సడెన్ బ్రేక్ వేసింది. ‘‘ట్రాఫిక్ రూల్స్ పాటించరు పాడు లేదు.. ఇంతకీ..’’ అని ఆమె ఇంకేదో అనబోయే లోపు.. ఆ అనేదేంటో ఆ టూ వీలర్ వ్యక్తికి అర్థమైనట్టే తన టీ షర్ట్ మీది వాక్యాలు చూపించాడు అమృతకు.. ‘‘ఇంట్లో చెప్పే వచ్చా’’ అని. ‘‘అబ్బా.. అవునా?’’ అనుకుంటూ తన టీషర్ట్ మీది వాక్యాలూ చూపించింది.. ‘‘ఫసక్’’ అని!ఆ వ్యక్తి హెల్మెట్ కవర్ వేసుకుంటూ వెహికిల్ రైజ్ చేసుకొని వెళ్లిపోయాడు. అమృతా దూసుకెళ్లింది డెస్టినేషన్ వైపు.హోటల్ పార్కింగ్‌లోకి వెళ్లబోతుంటే ఓ పాదాచారుడు అడ్డొచ్చాడు. ఆ స్లోప్‌లో మళ్లీ బ్రేక్ వేస్తూ చిరాగ్గా చూసింది అతనిని ‘‘ఎవడ్రా నువ్వు?’’ అన్నట్టు. ఆ యంగ్ మన్ పరమ పుర్సత్గా తన టీ షర్ట్ చూపించాడు ‘‘పక్కా లోకల్’’ అని రాసున్న అక్షరాలను!‘‘మిడిల్ క్లాస్ అబ్బాయి’’ అనుకుంటూ పార్కింగ్‌లోకి వెళ్లింది. రెస్టారెంట్లో.. ‘‘సారీ గైస్.. ట్రాఫిక్... ఆ రూల్స్‌ని బ్రేక్ చేసే వాళ్లతో లేట్ అయిపోయింది’’ అంటూ అప్పటికే తన కోసం వెయిట్ చేస్తున్న ఫ్రెండ్స్‌తో జాయిన్ అయింది అమృత.‘‘వాట్ హ్యాపెండ్?’’ అడిగాడు జయసూర్య.‘‘రెండుసార్లు డాష్ కొట్టబోయా’’ అంది అమృత మంచినీళ్ల గ్లాస్ తీసుకుంటూ!అమృత ముందుకొచ్చి నిలబడ్డాడు పాండు. ఏంటీ అన్నట్టు చూసింది ఆమె నీళ్లు తాగుతూ!టీ షర్ట్ చూపించాడు.. ‘‘లైట్’’ తీస్కో అని ఉంది దాని మీద. నోట్లో నీళ్లు పాండు మీద పడేలా నవ్వేసింది.‘‘యూ నో.. ఈ రోజు ట్రాఫిక్‌లో.. పార్కింగ్‌కి వెళ్తుంటే నా వెహికిల్‌కి అడ్డొచ్చిన వాళ్లూ ఇలాంటి టీ షర్ట్సే వేసుకున్నారు’’ అని చెప్పింది అమృత మంచి నీళ్ల గ్లాస్ టేబుల్ మీద పెడుతూ.‘‘అర్రే.. అంటే ట్రెండ్‌ను ఫాలో అవ్వడంలో మనమెప్పుడూ లేటే అన్నమాట’’ అంది గీతిక.ఆనంది టీషర్ట్ చూపించాడు శివ.. గీతికకు. ‘‘మూస్కో’’ అని ఉంది. వెంటనే తన టీషర్ట్ మీదున్న అక్షరాలను చూపించింది గీతిక.. ‘‘ఏడ్చావ్ లే..’’ అని.‘‘ఓకే. టాపిక్‌కి వద్దాం...’’ అంటూ జయసూర్య వైపు తిరిగి‘‘ రేయ్ జయ్.. చెప్పరా.. పార్టీ ఎక్కడ అరేంజ్ చేస్తున్నావో?’’ అడిగింది గీతిక.‘‘మా బాబాయ్ వాళ్ల ఫామ్ హౌజ్‌లో’’ చెప్పాడు. ‘‘ఎక్కడది?’’ అందరూ అడిగారు ముక్త కంఠంతో.‘‘తూప్రాన్’’ చెప్పాడు జయసూర్య. ‘‘రేయ్.. మొదటిసారి పెళ్లి చేసుకుంటున్నావ్. నీ ప్రీ మ్యారేజ్ పార్టీ అదిరిపోవాలి బ్రో..’’ అన్నాడు శివ సీరియస్‌గా. ‘‘మొదటిసారి ఏంట్రా.. మొదటిసారి’’ అంటూ వాడి వీపును దబేల్ మనిపించారంతా. ఆ సరదా సందడిలోనే తినడానికీ ఆర్డర్ ఇచ్చేసుకున్నారు.‘‘మరీ అంతగా డబ్బులు తగలేసుకోకురా! పెళ్లయ్యాక చాలా ఖర్చులుంటాయి’’ సలహా ఇచ్చింది అమృత.‘‘పేరెంట్స్ చూసుకుంటారు’’ టీషర్ట్ చూపించాడు జయసూర్య. ‘‘నిన్నూ...’’ అంటూ నవ్వుతూ జయ్ భుజమ్మీద ఒక్కటిచ్చింది.‘‘ఫారిన్ స్కాచ్ పెట్టాల్రా మామా’’ అన్నాడు పాండు. ‘‘అవున్రా పెట్టాల్రా’’ అంటూ ‘‘అబే.. శివా.., బంటీ మాట్లాడరేందిరా..’’ మిగతావాళ్లనూ రెట్టించాడు అభిరామ్. ‘‘అంతేగా.. అంతేగా’’ తన టీషర్ట్ చూపించాడు బంటీ!‘‘మీ టీషర్ట్స్ గోలేంట్రా’’ అంటూ సంహిత తల పట్టుకుంటూంటే ‘‘అరే చిచ్చా... ఈ ప్రీ మ్యారేజ్ పార్టీకి మన ఫ్రెండ్స్ అందరి మ్యానరిజమ్స్‌తో ఇట్లాంటి టీషర్ట్స్‌ను కస్టమైజ్ చేసుకుందామారా?’’.. అద్భుతమైన ఐడియా తట్టినట్టు ఎక్సయిటింగ్‌గా చెప్పాడు పాండు. ‘‘రంగుపడుద్ది’’ అనే టీషర్ట్ వేసుకున్న గౌతమ్, ‘‘పని చూస్కో’’అని మాటున్న టీషర్ట్ వేసుకున్న అభిరామ్, ‘‘నాకు బూతులు ఊరికే రావు’’ అనే రాతతో టీషర్ట్ వేసుకున్న శివ.. అందరూ పాండూ ముందుకొచ్చి నిలబడ్డారు.ఏం చెప్పాలో తెలియక ‘‘అబే హాదీ..’’ అంటూ సెల్లో మొహం పెట్టిన హార్దిక్‌ను తట్టాడు. తలపైకెత్తి ‘‘నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు రావు గారు’’ అన్న తన టీషర్ట్ అక్షరాలను చూపించాడు హార్దిక్. అందరూ పాండు వైపు చూశారు ‘‘అయిందా’’ అన్నట్టు. తలగోక్కున్నాడు పాండు. అప్పుడే హడావిడిగా వీళ్ల దగ్గరకు వచ్చాడు ఆదిత్య.. ‘‘మీటింగ్ ఎన్ని గంటలకో చెప్పి చావచ్చు గదరా’’ అంటూ. అప్పటికే వీళ్లు ఖాళీ చేసిన స్నాక్స్ ప్లేట్లను చూస్తూ... ‘‘ నాకేమన్నా చెప్పండ్రా.. ఆకలేస్తోంది’’ అన్నాడు ఆదిత్య. ‘‘మాది అయిపోయింది. కావల్సింది ఆర్డర్ ఇచ్చుకో’’ అన్నాడు అభిరామ్. సర్వర్ కోసం అటూఇటూ చూశాడు ఆదిత్య. ఎవరూ కనపడలేదు. వాడి ఆత్రం అర్థమైన అభిరామ్ ‘‘కౌంటర్ దగ్గరకెళ్లి ఆర్డర్ ఇయ్యిపోరా’’ అన్నాడు. వెళ్లడానికి ఆదిత్య ఇబ్బంది పడ్తూంటే.. శివను వెనక్కి తిప్పి అతని వీపు చూపించాడు అభిరామ్.. ‘‘వెళ్లి నా పేరు చెప్పు’’ అని ఉంది. ‘‘సరే.. నీ ఏడుపేదో ఏడ్చి రా.. పార్కింగ్ లాట్లో వెయిట్ చేస్తూంటాం’’ అంటూ లేచాడు జయసూర్య. తోపాటే అందరూ లేచారు. లిఫ్ట్ దగ్గర.. తన ఛాతి దగ్గర అదే పనిగా చూస్తున్న అబ్బాయికి.. తను వేసుకున్న టీషర్ట్ మీది అక్షరాలను చూపించింది అమ్మాయి.. ‘‘ఫేస్ పైనుంది బే’’ అని. ఆ అబ్బాయి తమాయించుకుని ఏమీ ఎరగనట్టు ఆమె పక్కన నిలబడ్డ అబ్బాయిని చూశాడు. అతను గుర్రుగా తన టీ షర్ట్ మీదున్న అక్షరాలను చూపించాడు ‘‘ఈ పిల్ల నాది బే’’. దాంతో తన టీ షర్ట్ మీదున్న అక్షరాలను చూసుకున్నాడు అబ్బాయి ‘‘దీనమ్మ జీవితం’’.ఇంతలోకే రెస్టారెంట్లో ఆదిత్య దగ్గరకు బిల్ తీసుకొని వచ్చాడు సర్వర్. తన టీషర్ట్‌ను సర్వర్కి చూపించాడు ఆదిత్య.. ‘‘దే పేడ్ నో’’ అని. లేదన్నట్టుగా తలూపాడు సర్వర్. అప్పుడే తన పక్క టేబుల్ అతను బిల్ పే చేసి వెళ్తుంటే అతని టీ షర్ట్ వెనక ఓ వాక్యం కనిపించింది ఆదిత్యకు ‘‘ఒక ఇంగ్లిష్ కవి ఏమన్నాడో తెలుసా?’’ అని.పై సన్నివేశాలన్నీ కల్పితమే. కాని ఆ సినిమా డైలాగ్స్‌తో ఉన్న టీషర్ట్స్ వాస్తవం. వీటి రూపకర్తలు ఇద్దరు సాఫ్టవేర్ ఇంజనీర్స్. మహీ ఇలీంద్ర, హరీష్ వాసిరెడ్డి. ప్రకాశం, ఖమ్మం జిల్లా వాసులు. హైదరాబాద్‌లో ఇద్దరికీ కామన్ ప్యాషన్ అయిన సినిమా ప్లాట్‌ఫామ్ మీద కలుసుకున్నారు. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ మొదలు కొన్ని షార్ట్ మూవీస్‌కీ పనిచేశారు. వెబ్సిరీస్కూ వర్క్ చేస్తున్నారు. లేటెస్ట్గా ఈ టీషర్ట్స్ థాట్‌తో ఈ కామర్స్‌లోనూ కాలు పెట్టారు. దేడ్ దిమాగ్ ఇంగ్లీష్‌లో ‘ఐ లవ్ న్యూయార్క్’ అని, ‘కొలంబియా బాయ్స్’ అని, ‘లవ్ అమెరికా’ అని ‘లండన్ డ్రీమ్స్’ అని రకరకాల స్లోగన్స్‌తో టీ షర్ట్స్ దొరుకుతాయి. కానీ తెలుగులో ఇలాంటివి లేదు. మన భాషలో పాపులర్ అయిన మాటలతో టీషర్ట్స్‌ను మార్కెట్లోకి తెస్తే ఎలా ఉంటుంది అనిపించింది ఆ ఇద్దరికీ. హిట్ కావాలంటే ఒకే ఫార్మూలా.. సినిమా! సో.. ఈ స్టార్టప్‌కి ‘దేడ్ దిమాగ్’ అని పేరుపెట్టి.. పంచ్లా పేలిన డైలాగ్స్‌ను టీ షర్ట్స్ మీద ప్రింట్ చేయించి మార్కెట్లో విడుదల చేశారు. టేకాఫ్ కొంచెం స్లో అయినా.. రెండు నెలల్లో స్పీడ్ అందుకుంది. క్రేజ్‌కి తగ్గ రేంజ్లో ఇప్పుడు రోజుకి కనీసం అయిదు వందల టీషర్ట్స్ సప్లయ్‌కి డిమాండ్ ఉంది.తెలుగు రాష్ట్రాల్లోనే కాదు చెన్నై, బెంగళూరు, ముంబై దాటి అమెరికా దాకా! ప్రీ మ్యారేజ్ పార్టీలు, బ్యాచ్‌లర్ పార్టీలు, సంగీత్, మెహందీ, పుట్టినరోజులు, బారసాలలు, కాలేజ్ పార్టీలు.. ప్రైవేట్ ఫంక్షన్స్.. అన్నిటికీ కస్టమైజ్ చేసుకున్న డైలాగ్స్‌తో ఈ టీషర్ట్స్ అమ్ముడు పోతున్నాయి. హోలీ లాంటి పండగలకూ.. థీమ్ పార్టీలకూ ఇలాంటి టీషర్ట్స్ కావాలనుకుంటున్నారు ట్రెండ్ ఫాలోవర్స్. కొంతమంది తమ కుటుంబ వేడుకల కోసం కుటుంబ సభ్యుల మ్యానరిజమ్స్‌తో ఈ టీషర్ట్స్‌ను తయారు చేసి ఇవ్వమని కోరుతున్నారట. అంతేకాదు కొన్ని పొలిటికల్ క్యాంపెయిన్స్కీ అడుగుతున్నారని చెప్పారు ఆ ప్రొడ్యూసర్స్. ‘‘ఈ టీ షర్ట్స్ ద్వారా మన భాష, కల్చర్‌ను ప్రమోట్ చేయడం మా లక్ష్యం. పాపులర్ కావడానికి ముందు సినిమా డైలాగ్స్‌ను వాడుకున్నాం కాని.. తర్వాత సామెతలు.. నుడికారాలు, పలుకుపడులు వంటివాటినీ ప్రింట్ చేస్తాం’’ అని చెప్తున్నారు మహీ, హరీష్‌లు. సరస్వతి రమ -
ప్రతీకారం కోసం ఆడకండి.. ద్రావిడ్ పోస్ట్ వైరల్
సాక్షి, స్పోర్ట్స్ : టీమిండియా దిగ్గజం రాహుల్ ద్రావిడ్‌కు ఉన్న క్రేజ్ చెప్పనక్కర్లేదు. ఆపద సమయాల్లో జట్టుకు పెద్ద దిక్కుగా.. వికెట్లు అడ్డుగా నిలిచి.. బౌలర్లకు ముచ్చెమటలు పోయిస్తూ.. ప్రత్యర్థి జట్టు సహనాన్ని ఘోరంగా దెబ్బతీయటం.. అదే సమయంలో పరుగుల ద్వారా మ్యాచ్ గెలుపులో ముఖ్యభూమిక పోషించటం ది వాల్ ప్రత్యేకత. అలాంటి ఆటగాడు చెప్పిన ఓ మాట డబ్ల్యుడబ్ల్యుఈ సూపర్ స్టార్, హాలీవుడ్ హీరో జాన్ సీనాను బాగా ఆకర్షించింది. ఆటగాడు ప్రతీకారం కోసం కాదు.. గౌరవ మర్యాదల కోసం ఆడాలి అన్న రాహుల్ ద్రావిడ్ కొటేషన్‌ను సీనా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. పైగా తన ఫోటోలకు వివరణ కోరవద్దంటూ అతగాడు పైన పేర్కొనటం విశేషం. ఇదే కాదు కపిల్, అమితాబ్‌లు కలిసి ఉన్న ఓ ఫోటోను కూడా సీనా పోస్టు చేయటం విశేషం. ప్రస్తుతం ఈ పోస్టులు వైరల్‌గా మారుతున్నాయి. అన్నట్లు గతంలో ఓసారి డ్రాఫ్ట్‌లో సీనా స్మాక్డౌన్కు వెళ్లగా.. బ్లూ సింబల్ చూపే క్రమంలో తన ట్విట్టర్లో బ్లీడ్బ్లూ పేరిట విరాట్ కోహ్లి ఫోటోను కూడా పోస్టు చేసిన సంగతి తెలిసిందే. A post shared by John Cena (@johncena) on Dec 10, 2017 at 1:50am PST A post shared by John Cena (@johncena) on Dec 13, 2017 at 7:41am PST A post shared by John Cena (@johncena) on Jul 19, 2016 at 9:17pm PDT ప్రస్తుతం ద్రావిడ్ అండర్ -19 క్రికెట్ జట్టు కోచ్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇక సీనా రెజ్లింగ్‌తోపాటు మరో రెండు హాలీవుడ్ చిత్రాలకు సిద్ధమవుతున్నాడు. -
జీవించు... నేర్చుకో... అందించు!
కొత్తతరానికి- వారి ఉరుకుల పరుగుల జీవితానికి ఈ ఏకవాక్య ప్రక్రియ బాగా ఉపయోగపడుతుందని అనుకున్నాను. కొత్తతరాన్నే కాదు- నా తరాన్నే కాదు- నా కంటే ముందు తరాన్ని కూడా మనసులో నిలుపుకుని- మూడు తరాల మధ్య ఏర్పడ్డ అఖాతాన్ని కొటేషన్ల వంతెనతో అధిగమించాలనుకున్నాను. ‘శరీరమాద్యం ఖలు ధర్మసాధనం’ అనే కొటేషన్ (సూక్తి) మా ఇంటి దూలం పక్కన చాక్‌పీసుతో రాసి ఉండటాన్ని నేను చదివాను. అప్పుడు నేను రెండో తరగతిలో ఉండి ఉండవచ్చు. రాసిన వారెవరో ఆ కొటేషన్ రచయిత పేరు రాయలేదు. నాకంటే ఆరేండ్లు పెద్దదైన మా అక్కయ్య రాసి ఉండవచ్చు. అడగడానికి మా అక్కయ్య లేదిప్పుడు. అడగాలని నాకపుడు తెలియదు. మరో నలభై ఏడు సంవత్సరాల తరువాత, నేను కొటేషన్స్‌ని అధ్యయనం చేస్తున్నప్పుడు, అది సంస్కృత మహాకవి కాళిదాసు కొటేషన్ అని తెలిసింది. భూమిలో పడ్డ విత్తనం తీరుగా- ఆ కొటేషన్ నా మనసులో పడ్డది అర్థమయీ కానట్టు- బోధపడీ పడనట్టు. దాని అర్థం ఏమిటో పూర్తిగా తెలుసుకోవాలనే జిజ్ఞాస నాలో ప్రారంభమైంది. దాని అర్థం గురించి నేనెవరినీ అడగలేదు. వయసు పెరుగుతున్నకొద్దీ, జీవితానుభవాలు కలుగుతున్నకొద్దీ ఆ కొటేషన్ రోజూ నాకేదో బోధిస్తున్నట్టుగానే ఉండేది. శరీరం- ఆరోగ్యం- తిండి- వ్యాయామం వంటి విషయాలే కాదు, శరీరానికీ, జీవితానికీ ఉండే సంబంధం ఎటువంటిదో, అటువంటి శరీరాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో, దానికోసం ఏమి చెయ్యాలో, ఏమి చెయ్యకూడదో నిత్యం నాకేదో ఎరుక పరుస్తున్నట్టుగా ఉండేది. ఆ కొటేషన్ చిన్నదేకాని, మొత్తం జీవితం పొడుగునా నన్ను చైతన్య పరుస్తూ వస్తూనేవుంది. అది మొదలు నాకు కనిపించిన ప్రతి కొటేషన్నీ చదువుతూ వచ్చేవాణ్ణి. నాకు సాహిత్యం పట్ల ఆసక్తి ఆ కొటేషన్తోనే ప్రారంభమైందని చెప్పాలి. అయితే అటువంటి కొటేషన్లు రాస్తానని కాని, రాయాలని కాని నేను ఏనాడూ అనుకోలేదు. టెలివిజన్ చానెళ్లు అందుబాటులోకి వచ్చిన తరువాత, కొత్త తరానికి సాహిత్య పఠనాసక్తి పోతోందని మనలో చాలామంది అనుకుంటుండటం నాకు తెలుసు. అయితే రచయితలుగా కొత్త తరాన్ని మనం మన పాఠకులుగా భావించుకుంటున్నామా- అని నేను అనుకుంటూ ఉండేవాడిని. జీవన విధానాల్లో వచ్చిన మార్పుల వల్ల ఇపుడు అందరూ విడివిడిగా బతకవలసి వస్తోంది. పూర్వం- మూడు తరాలు కలిసి ఒకే ఇంట్లో బతికేవారు. హాస్టల్ చదువులు- విదేశీ ఉద్యోగాల వల్ల ఇపుడు రెండు తరాలు కూడా కలిసి ఒకే ఇంట్లో బతకడం లేదు. అందువల్ల కోల్పోతున్న విలువైన అనుభూతులు ఎన్నో ఉన్నాయి. మూడు తరాల మనుషుల మధ్య అనుబంధాల స్థానంలో, వియోగవిషాదాలు గూడు కట్టుకుని ఉంటున్నాయి. కనపడని దుఃఖమేదో మనుషుల్ని ముంచెత్తుతోంది. ఈ తరపు మనుషులందరిలాగే నేను కూడా అటువంటి స్థితులకు లోను అవుతూ వస్తున్నాను. అయితే ఈ తెగిపోతున్న మానవసంబంధాల మధ్య, ఏదో ఒక అవగాహన వారధిని నిర్మించాలని నాకేదో తండ్లాటగా ఉండేది. తరం నుంచి తరానికి అందవలసిన జ్ఞానం అందడం లేదు. అటువంటి జ్ఞానాన్ని అందించడం ఎట్లాగా అని యోచించేవాణ్ణి. అట్లాంటి యోచనలోంచి వచ్చిందే, ఆధునిక కథని స్కిప్టు లేకుండా ఆశువుగా చెప్తూ ఉంటే కెమెరాతో రికార్డు చేసి డి.వి.డి.లుగా విడుదల చేయడం! (ఆ తరువాత కూడా) ఒక కథారచయితగా నేను, నా తరువాతి తరం మనసుకు పట్టేవిధంగా వుండే ప్రక్రియల గురించి మరింత ఆలోచిస్తూ ఉన్నాను. ‘జీవితం సరళమైందే కాని, మనమే దాన్ని సంక్లిష్టం చేస్తుంటాం’ అనే కన్ఫ్యూషియస్ కొటేషన్‌ని నేనేదో పత్రికలో చదివాను. కొత్తతరం కన్ఫ్యూషియస్ చెప్పినటువంటి కొటేషన్లలో ఏ ఒక్కటి చదవగలిగినా, నా ప్రయత్నం కొంత ఫలిస్తుందని నిర్ణయానికి వచ్చి, ప్రపంచ సాహిత్యంలోంచి కొటేషన్లను సేకరించాలనుకున్నాను. తెలుగులోకి సంకలనాలుగా వచ్చినంతమేరా కొటేషన్ల సంకలనాలు కొని తెచ్చుకుని చదవడం ఆరంభించాను. అది 2010 సంవత్సరం ప్రారంభపు రోజులు. నాక్కావాల్సిన కొటేషన్లను సేకరించే పనిలోకి అట్లా దిగాను కాని- నేను కొటేషన్లని రాయవలసి వస్తుందని నాకప్పటికి తెలియదు. కొటేషన్లను చదువుతున్నకొద్దీ, నాకు చాలావాటితో విభేదం మొదలైంది. చదువుతున్నకొద్దీ, వాటికి భిన్నంగా నేను ఆలోచించాల్సి వచ్చింది. కొన్ని కొటేషన్స్తోనే నాకు ఆమోదం కలిగింది. విభేదించిన ఎన్నో కొటేషన్స్‌ని నాదైన పద్ధతిలో తిరిగి వ్యాఖ్యానించుకోవడం సాగేది. అటువంటి స్థితిలో నేను కొంత ఆగి ఆలోచించుకోవాల్సి వచ్చింది. కొటేషన్‌ను ఒక రచనాప్రక్రియగా ఎందుకు స్వీకరించకూడదు? అని ప్రశ్నించుకున్నాను. నాదైన దృక్పథంతో తిరిగి నిర్వచించే వాక్యాన్ని కవితాత్మకంగానే కాదు- హిందుస్థానీ శాస్త్రీయ సంగీత శ్రోతగా, లయపూరితంగా కూడా చెప్పడం మంచిదనుకున్నాను. కొత్తతరానికి- వారి ఉరుకుల పరుగుల జీవితానికి ఈ ఏకవాక్య ప్రక్రియ బాగా ఉపయోగపడుతుందని అనుకున్నాను. కొత్తతరాన్నే కాదు- నా తరాన్నే కాదు- నా కంటే ముందు తరాన్ని కూడా మనసులో నిలుపుకుని- మూడు తరాల మధ్య ఏర్పడ్డ అఖాతాన్ని కొటేషన్ల వంతెనతో అధిగమించాలనుకున్నాను. ఇంతకుముందు కొటేషన్స్ చెప్పినవారు పనిగట్టుకుని చెప్పినవారు కాదు. తత్వశాస్త్రంలో భాగంగానో- రాజనీతిశాస్త్రాల్లో భాగంగానో- కథలోనో- నవలలోనో- నాటకంలోనో- కవిత్వంలోనో- పాత్రల పరంగానో- రచయిత వ్యాఖ్యానాలుగానో రాయబడ్డాయి తప్ప- కొటేషన్‌ను ఒక ప్రక్రియగా భావించి, దాన్నొక కళారూపంగా తీర్చిదిద్దుకుని, ఒక తాత్విక నేపథ్యంతో రాసినవారు కాదు. వారికా అవసరం పడలేదు. ఆధునిక జీవితం కలిగించిన ఆటంకాల వల్ల, నేను వాటిని అధిగమించడానికి కొటేషన్‌ని ఒక ప్రక్రియగా తీసుకోవలసి వచ్చింది. ఫ్యూడల్ యుగానికి సంబంధించి... చిట్టచివరి దశలోని ఒక తెలంగాణ గ్రామంలో పుట్టి పెరిగినవాణ్ణి(1959). వ్యవసాయ కుటుంబం, బందిఖానా వంటి బడి చదువుల్లో గట్టెక్కలేక వ్యవసాయంలోకి దిగి, చేసి-చెడి, విధిలేక గోదావరిఖని బొగ్గుగనుల్లోకి కార్మికుడిగా వలస- సాహిత్య పరిచయం- కథారచనలోకి దిగడం- మరోవైపున వందలాది మంది అధికారులతో- వేలకొద్దీ కార్మికులతో కలిసి బొగ్గుగనుల్లో కఠినమైన పనులు చేయాల్సిరావడం- వారి వారి మనస్తత్వాలు- సంఘాలు- రాజకీయాలు- రచయితలు- వారివారి ప్రవర్తనలు- సభలు- సమావేశాలు- రాష్ట్రం- దేశం తిరగడం- ఆ నాటి గోదావరిఖని, క్రిక్కిరిసిన ప్రపంచానికి ఒక మినీ నమూనా(1980-2007). 27 సంవత్సరాల ఉద్యోగజీవితం చాలనుకుని- పదమూడేండ్లు ముందుగానే అధికారిగా ఉద్యోగాన్ని వదిలేశాను. విస్తృత జీవితానుభవం ఉన్నా పరిమితంగానే కథలు రాసినవాణ్ణి. రాయవలసింది చాలా ఉండిపోయిన స్థితి. యాభై సంవత్సరాల వయసుకు చేరుకున్నాను. జననం నుంచి మరణం దాకా, మానవ జీవితంలో, ప్రతి మనిషీ అనుభవించవలసి వచ్చే ఆనంద- విషాదాలన్నింటినీ అనివార్యంగా మూటకట్టుకుని ఉన్న స్థితి... నేనెరిగిన మనుషుల మూలంగా- ముఖ్యంగా రచయితల మూలంగా- నాకు అనేక నిర్ధారణలు కలుగుతూ వచ్చాయి. ఫ్యూడల్- పెట్టుబడిదారి- సోషలిస్టు- ప్రజాస్వామ్య వ్యవస్థల, ఉత్థానపతనాలు విన్నవాణ్ణి- కొన్నింటిని చూసినవాణ్ణి. వందల, వేల సంవత్సరాల్లో జరిగిన ప్రపంచ పరిణామాల్ని చదువుకున్నవాణ్ణి. వేల సంవత్సరాలుగా మతాల- రాజకీయ సిద్ధాంతాల ఆవిర్భావ- పతనాలు, సామ్రాజ్యాలు కూలిపోవడం- దేశాలు స్వాతంత్య్రాన్ని పొందడం వంటి అనేక విషయాలు... నేను పేర్కొన్న విషయాల నేపథ్యమే కాకుండా అపుడు నేనున్న మానసిక స్థితి- మా బాపు మరణం(2009), మా బాబు దూరదేశంలో ఉండిపోవడం, మనుషులతో పడకపోవడం- కోపం- ఆగ్రహం కలగలిసి ఒంటరినై... ‘‘ఉదాత్తంగా బతకడమే, ఉత్తమ ప్రతీకారం’’ అన్నట్టుగా, నా బతుకేదో నేను బతకాలని నిర్ణయించుకున్న స్థితి కూడా, కొటేషన్స్ రాయడానికి నన్ను ముందుకు తోసిందని నేను అనుకుంటున్నాను. కథారచయిత తుమ్మేటి రఘోత్తమరెడ్డి తాజాగా ‘ఆధునిక తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి స్వతంత్ర కొటేషన్స్’ అంటూ ‘జీవించు... నేర్చుకో... అందించు!’ వెలువరించారు. ఇది ఆయన పూర్వ కొటేషన్స్ సంకలనాలను కూడా కలుపుకొని వెలువడిన సమగ్ర సంకలనం. సంపాదకులు: డాక్టర్ డి.చంద్రశేఖర రెడ్డి. ప్రచురణ: ఎమెస్కో. పేజీలు: 488; వెల: 250; ప్రతులకు: సాహితి ప్రచురణలు, విజయవాడ-2. ఫోన్: 0866-2436643 - తుమ్మేటి రఘోత్తమరెడ్డి 9000184107 -
బైక్ లాంగ్వేజ్
రోడ్డుమీద వెళ్తుంటే... ఎదురుగా ఉన్న బైక్ వెనకాల కొటేషన్ కంట్లో పడగానే... అయితే నవ్వు... లేదంటే ఆలోచన. కొటేషన్ కాస్త తేడాగా కనిపిస్తే... ఆ బైక్‌పై కుర్రాడిని కాస్త కోపంగా చూడ్డం... వీడు.. వీడి పైత్యం అన్నట్టు. నిజమే...‘ఇట్స్ మై డాడ్ రోడ్’ అనే కొటేషన్ చూస్తే ఎవరికైనా కోపం రాకుండా ఉంటుందా! ‘మామ్ టోల్డ్ టు డ్రైవ్ స్లో. బట్ మై గర్ల్‌ఫ్రెండ్ ఆస్క్ టు డ్రైవ్ ఫాస్ట్!’ ఇలా రాసుకున్న కుర్రాడ్ని చూసి అయ్యోపాపం పిల్లాడికి ఎంత కష్టం వచ్చిందన్నట్టు పెడతాం మొహం. ‘ఇఫ్ యు ఫాలో మి ఇట్స్ హెవెన్. ఇఫ్ యు ఓవర్టేక్ మి దెన్ ఇట్స్ హెల్’... చదవగానే ఎవరికైనా ఒళ్లు మండుతుంది. అంటే వీడి వెనకాలే తోకలా వెళ్లాలన్నమాట. ఏ... అతన్ని దాటి ముందుకెళితే నరకానికెళ్లిపోతామా..! కచ్చితంగా అతని వెనకున్నవారు కాస్త స్పీడుపెంచి వాడ్ని అద్దంలో నుంచి కొద్దిగా వెటకారంగా చూస్తూ ఓవర్టేక్ చేస్తారు. ఇంతకీ.. ఏమిటీ కొటేషన్లు, ఎందుకీ కవిత్వాలు అంటే... కుర్రకారు తమ కలాన్ని ఝులిపించడానికి బైక్‌లను వేదికలుగా మలుచుకునే పనిలో పడ్డారు. దాంతో రోడ్లపై కళ్లకు కమ్మని కవిత్వాలు, కవ్వించే కొత్త వాక్యాలు కనిపిస్తున్నాయి. మామ్ గిఫ్ట్... బైక్ నంబర్ ప్లేట్ కింద కనిపించే వాటిల్లో అధిక కొటేషన్లు... మామ్ గిఫ్ట్ లేదంటే డాడ్ గిఫ్ట్. ఇంకా అంటే ‘ఐ లవ్ ఇండియా’. కుర్రాళ్లు కొత్త ట్రెండ్లకు వెల్కమ్ చెబుతూ... కొటేషన్లు రాసుకుని స్టిక్కర్ షాపుల వుుందు క్యూ కడుతున్నారు. ‘ముఖ్యంగా కాలేజీ అబ్బాయిలు... బైక్ కొటేషన్లపై ఎక్కవ ఆసక్తి చూపిస్తున్నారు. కొందరయితే నెలకోసారి కొటేషన్లను మార్చేస్తున్నారు. అదేంటంటే...ఫ్రెండ్‌కి నచ్చలేదు, గర్ల్‌ఫ్రెండ్‌కి నచ్చలేదు అంటున్నారు. కొందరు ప్రత్యేకంగా దేశభక్తికి సంబంధించిన కొటేషన్లు, దైవభక్తికి సంబంధించిన కొటేషన్లు తీసుకొస్తారు’ అంటూ తన షాపు దగ్గరకొచ్చే అబ్బాయిల విషయాలు చెప్పారు బాలనగర్‌లోని న్యూస్టయిల్ స్టిక్కర్ షాపు యజమాని అఖిల్. అదో... సరదా మంచి వాక్యాలయితే ఎవరైనా ఎంజాయ్ చేస్తారు. కొంచెం ఇబ్బందికరంగా ఉండే కొటేషన్ల గురించి అబ్బాయిలను అడిగితే... అలాంటివి చదివి ఇంకా ఎంజాయ్ చేయొచ్చు కదా అంటారు. ‘హెల్ ఈజ్ ఫుల్... సో ఐయామ్ బ్యాక్’ ఎంత స్పెషల్‌గా ఉందండీ అంటాడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదివే రాహుల్. అదేం బాగుందిరా... నేను చెబుతాను విను... ‘యువర్ విలేజ్ కాల్డ్, దేర్ ఇడియట్ ఈజ్ మిస్సింగ్’ అంటాడు కార్తిక్. ఇలా కుర్రాళ్ల కవిత్వంపై ఇంటర్నెట్ ప్రభావం కూడా బాగానే ఉంటోంది. ‘బంపర్ స్టిక్కర్స్’ అనే సైట్లో బైక్‌లపై ఎలాంటి స్లోగన్స్ రాసుకోవాలో, కార్లపై ఎలాంటివి అతికించుకోవాలో వివరంగా ఉంటుంది. సిటీ ప్లస్ ఫొటోలు: జి.రాజేష్ -
స్టేట్మెంట్ సదానందం గారి పొంతన లేని చింతన!
ఉత్త(మ)పురుష ‘‘ఆడదానికి అందంతో పని. మగాడికి పనే అందం’’ ఇదీ స్టేట్మెంట్ సదానందం తాలూకు ఒక గొప్ప కొటేషన్. అలవోకగా, ఆశువుగా కొట్టొచ్చినట్టు కొటేషన్స్ ఇస్తుంటాడు కాబట్టి సదానందాన్ని అందరూ స్టేట్మెంట్ సదానందం అంటుంటారు. పైది ఆయన వెలువరించిన స్టేట్మెంట్లలో ఒక గొప్ప కొటేషన్. అయితే విచిత్రం ఏమిటంటే... సదానందం భార్య తాలూకు కాస్మటిక్స్ అన్నీ త్వరత్వరగా అయిపోతుండటం, అవి నిండుకోడానికి పట్టే వ్యవధి రోజురోజుకూ తరిగిపోతుండటంతో అబ్బురపడుతోంది సుమతి. ఒకరోజు ఆ మిస్టరీ విడిపోయింది. కారణం తన మిస్టరేనని తేలిపోయింది. అర్ధరాత్రుళ్లు లేచి ఆమె కాస్మటిక్స్‌ను రహస్యంగా రాసుకుని మళ్లీ పడుకునే పని పెట్టుకున్నాడు సదానందం. అదేంటంటే... ఆడవాళ్లను అంతగా ఆకర్షించే అంశం ఏముందో చూసే ‘పని’ పట్టుకున్నాను. అందుకే ఈ ‘పని’ అంటూ మేకప్ చేశాడా మొగుడు. అలాంటిదే మరో ఘటన. ‘‘లోకంలోని తెలివితక్కువ వాళ్ల మెదళ్ళలో ఏం పెట్టాలో తెలియలేదు బ్రహ్మకు. అందుకే వాళ్ల తలపై వెంట్రుకలు మొలిపించి, వాటి తాలూకు వేరు మెదళ్లలోని ఖాళీ స్థలాన్ని ఆక్రమించేలా చేశాడు. అదే తెలివిగల వాడి మెదడు పూర్తిగా చురుగ్గా ఉంటుంది కాబట్టి వాళ్ల తలపై వెంట్రుకలే నిలబడలేకుండా చేశాడు’’ అంటూ పెద్ద స్టేట్‌మెంటొకటి ఇచ్చాడు సదానందం. ఇలా అన్నవాడు తన మాటకు కట్టుబడి ఉండాలా, వద్దా? మళ్లీ తానే రాత్రంతా జట్టు మొలిపిస్తామంటూ గంటలకొద్దీ నడుస్తూ ఊదరగొట్టే టీవీ యాడ్స్ చూస్తూ, వాటిని రహస్యంగా తెప్పించుకుని, అర్ధరాత్రి లేచి వాటిని తలకుపట్టిస్తూ, తలగడకు పామేస్తూ ఉంటాడు. ‘‘నా భర్తది నాలుక కాదు... అదో విలువైన డబ్బు నాణెం’’ అంది సుమతి. ‘‘అబ్బ ఈ కొటేషన్‌తో నా భార్యవనిపించావు. స్టేట్మెంట్ సదానందం సతీమణా, మజాకా’’ అన్నాడా భర్త. ‘‘అవునండీ... నాణేనికీ రెండు పార్శ్వాలూ... మీ నాల్కకూ రెండు సైడ్లు. టాస్ విసిరినట్టుగా మాటను గాల్లోకి ఎగరేయడం మీ పని. అదే సైడు పడుతుందన్నది అచ్చం మీ ఆచరణ లాంటిది. ఎంతైనా మీరు ద గ్రేట్ కొటేషన్ కింగ్ అయిన స్టేట్మెంట్ సదానందం కదా’’ అంది సుమతి. - వై