
సాక్షి, స్పోర్ట్స్ : టీమిండియా దిగ్గజం రాహుల్ ద్రావిడ్‌కు ఉన్న క్రేజ్ చెప్పనక్కర్లేదు. ఆపద సమయాల్లో జట్టుకు పెద్ద దిక్కుగా.. వికెట్లు అడ్డుగా నిలిచి.. బౌలర్లకు ముచ్చెమటలు పోయిస్తూ.. ప్రత్యర్థి జట్టు సహనాన్ని ఘోరంగా దెబ్బతీయటం.. అదే సమయంలో పరుగుల ద్వారా మ్యాచ్ గెలుపులో ముఖ్యభూమిక పోషించటం ది వాల్ ప్రత్యేకత. అలాంటి ఆటగాడు చెప్పిన ఓ మాట డబ్ల్యుడబ్ల్యుఈ సూపర్ స్టార్, హాలీవుడ్ హీరో జాన్ సీనాను బాగా ఆకర్షించింది.
ఆటగాడు ప్రతీకారం కోసం కాదు.. గౌరవ మర్యాదల కోసం ఆడాలి అన్న రాహుల్ ద్రావిడ్ కొటేషన్‌ను సీనా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. పైగా తన ఫోటోలకు వివరణ కోరవద్దంటూ అతగాడు పైన పేర్కొనటం విశేషం. ఇదే కాదు కపిల్, అమితాబ్‌లు కలిసి ఉన్న ఓ ఫోటోను కూడా సీనా పోస్టు చేయటం విశేషం. ప్రస్తుతం ఈ పోస్టులు వైరల్‌గా మారుతున్నాయి. అన్నట్లు గతంలో ఓసారి డ్రాఫ్ట్‌లో సీనా స్మాక్‌డౌన్‌కు వెళ్లగా.. బ్లూ సింబల్ చూపే క్రమంలో తన ట్విట్టర్‌లో బ్లీడ్‌బ్లూ పేరిట విరాట్ కోహ్లి ఫోటోను కూడా పోస్టు చేసిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ద్రావిడ్ అండర్ -19 క్రికెట్ జట్టు కోచ్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇక సీనా రెజ్లింగ్‌తోపాటు మరో రెండు హాలీవుడ్ చిత్రాలకు సిద్ధమవుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment