ఎన్నికల ప్రచారంలో వాడీవేడి కొటేషన్లు
‘‘నాకు ఏం మాట్లాడినా పంచ్ ఉండాలంతే.. పంచ్ లేకుంటే కుదరదంతే’ అని ’ఆర్య’ సినిమాలో సునీల్ చేసిన హడావుడి బాగా పేలింది. ఇప్పుడు ప్రచారంలో పంచ్ డైలాగ్‌లు లేకుంటే పస ఉండదని భావిస్తున్న పార్టీల అభ్యర్థ్ధులు మంచి మంచి కొటేషన్లతో పంచ్‌లు విసురుతున్నారు. సోషల్ మీడీయాలో వాటిని వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నారు.
సాక్షి, సిద్దిపేట :ఈ నెల 30న అందరి వేళ్లకు ఇంక్.. రాష్ట్రమంతా పింక్ అంటూ, అప్పుడు ఎట్లుండే తెలంగాణ..ఇప్పుడు ఎట్లయ్యింది తెలంగాణ అని బీఆర్‌ఎస్ అభ్యర్థుల కొటేషన్లు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తెలంగాణ ఏర్పాటు కాకముందు 2014లో ఎలా ఉండే.. 2023లో ఎలా ఉందని బీఆర్‌ఎస్ అభ్యర్థులు డైలాగ్ కొటేషన్‌తో ప్రశ్నిస్తున్నారు. వీటితోపాటు కాంగ్రెస్, బీజేపీ కొటేషన్లు కూడా సోషల్ మీడియాలో ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
ఆకట్టుకున్న కొటేషన్లు కొన్ని..
- అన్నా... జిల్లాజిల్లాకూ ఐటీ టవర్.. మా గుండెల్లో ఉంటాడు కేటీఆర్ ఫరెవర్
- మా అన్నను ప్రేమిస్తారు మహబూబ్‌నగర్ క్రౌడ్.. డెవలప్‌మెంట్ ఆగొద్దంటే రావాలి మా అన్న శ్రీనివాస్ గౌడ్
- మర్చిపోతామా సాయన్న చేసిన సాయమూ.. కంటోన్మెంట్‌లో లాస్యమ్మ గెలుపు ఖాయమూ..
- బాల్కొండలో ఎగురబోతుంది గులాబీ జెండా... ప్రశాంత్ అన్న మన అందరికీ అండా దండా..
- ఎవరికి పడితే వాడికి కొట్టం జిందాబాద్... మా గోవర్న రూరల్ నిజాంబాద్
- కాంగ్రెస్ బీజేపీ అందరు పక్కకు జరగాలి... మెదక్‌లో భారీ మెజారిటీ రాబోతుంది మా పద్మక్క
- కాంగ్రెస్ మారుస్తుంది తెలంగాణ భవిష్యత్ ఇప్పుడు ఇస్తుంది 200 యూనిట్‌ల ఫ్రీ విద్యుత్
- బాగుండాలి ఐదేళ్ల జీవితం.... రావాలి ఐదు వేళ్ల హస్తం
- కాంగ్రెస్ మనకు అండ దండ... ఇస్తుంది రూ. 500కే గ్యాస్ బండ
- కాంగ్రెస్ వస్తే ఎన్నో ఉపయోగాలు.... యువతకు దొరుకుతాయి లక్షల్లో ఉద్యోగాలు
- తెలంగాణలో కమలం జెండా ఎగరాలి.. బీజేపీ గెలవాలి... బీసీ సీఎం కావాలి
- బద్దలు కొడదాం దొరల గడీ సాలు దొర... సెలవు దొర.
Comments
Please login to add a commentAdd a comment