fake post
-
టీడీపీ వికృత పోస్టులు..
-
టీడీపీ కుట్ర బట్టబయలు.. షర్మిలపై అసభ్యకర పోస్టులు..
కడప అర్బన్: అసభ్య దూషణలతో ఫేక్ పోస్టులు పెడుతూ దీన్ని వైఎస్సార్ సోషల్ మీడియాకు ఆపాదించేందుకు యత్నించిన టీడీపీ కుట్రలు బహిర్గతమయ్యాయి. విశాఖకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి, టీడీపీ సానుభూతిపరుడైన పినపాల ఉదయ్ భూషణ్ ఫేస్బుక్లో జుగుప్సాకరంగా వైఎస్ షర్మిల, నర్రెడ్డి సునీతపై పోస్టింగ్‌లు పెడుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఐపీ అడ్రస్ ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు. బుధవారం కడపలో అదనపు ఎస్పీ (అడ్మిన్) లోసారి సుధాకర్ మీడియాకు ఈ వివరాలను వెల్లడించారు. సాక్ష్యాధారాలతో దొరికిపోయినప్పటికీ తన భర్తను పోలీసులు అన్యాయంగా అరెస్టు చేశారంటూ నిందితుడు ఉదయ్ భార్య ఏకంగా విశాఖలోని టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించి ఆరోపణలు చేయడం ఆ పార్టీతో వారి అనుబంధాన్ని రుజువు చేస్తోంది. ఒకవైపు షర్మిలతో తాను రూపొందించిన స్క్రిప్టు చదివిస్తూ కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేయిస్తున్న చంద్రబాబు మరోవైపు తన శిష్య గణం ద్వారా ఆమె వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ పోస్టింగ్‌లకు పురిగొల్పుతున్నట్లు స్పష్టమవుతోందని పరిశీలకులు పేర్కొంటున్నారు. ఎవరినైనా సరే తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుని అవసరం తీరాక బురద చల్లడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని వ్యాఖ్యానిస్తున్నారు. ఫేక్ అకౌంట్ సృష్టించి.. విశాఖపట్నంలోని మహారాణిపేట సామ్రాట్ ఎన్‌క్లేవ్‌లో నివసిస్తున్న నిందితుడు పినపాల ఉదయ్ ఈ ఏడాది జనవరి 13వతేదీన పులివెందులకు చెందిన వర్రా రవీంద్రారెడ్డి పేరుతో ఫేస్బుక్లో ఫేక్ అకౌంట్ సృష్టించాడు. వైఎస్ఆర్ సోషల్ మీడియా సభ్యుడైన రవీంద్రారెడ్డి ఫోటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టి సదరు ఫేక్ ఫేస్బుక్ అకౌంట్ నుంచి షర్మిల, సునీతపై అసభ్యకర పదజాలంతో పోస్టులు పెడుతున్నాడు. తన పేరు, ఫోటోను వినియోగించి దుష్ప్రచారానికి పాల్పడటంపై రవీంద్రారెడ్డి ఫిర్యాదు మేరకు పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్లో ఈనెల 3న క్రైం.నెం. 45/2024 కేసు నమోదైంది. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ అదనపు ఎస్పీ (అడ్మిన్) లోసారి సుధాకర్ పర్యవేక్షణలో పులివెందుల డీఎస్పీ కేఎస్ వినోద్‌కుమార్ ఆధ్వర్యంలో సీఐ సి.శంకర్‌రెడ్డి, సైబర్ క్రైం సీఐలు శ్రీధర్‌నాయుడు, మధుమల్లేశ్వర్రెడ్డిలను రెండు బృందాలుగా విభజించి దర్యాప్తు ప్రారంభించారు. ఫేస్బుక్ డేటా బేస్ ఆధారంగా నిందితుడు ఉపయోగించిన ఐపీ అడ్రస్‌ను ట్రాక్ చేసి విశాఖకు చెందిన పినపాల ఉదయ్ భూషణ్‌గా గుర్తించారు. టీడీపీకి వీరాభిమాని అయిన నిందితుడు పార్టీ తరఫున పలు వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియా గ్రూపుల్లో అసభ్యకరమైన మెస్సేజ్‌లు, పోస్టులు పెడుతున్నట్లు నిర్ధారించారు. సైబర్ క్రైమ్ పోలీసులు అత్యాధునిక టెక్నాలజీ ద్వారా నిందితుడు ఉన్న ప్రదేశాన్ని గుర్తించి అతడి నివాసం వద్ద ఈనెల 13న అరెస్ట్ చేశారు. నేరానికి ఉపయోగించిన యాపిల్ ఐఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసును త్వరితగతిన ఛేదించిన పులివెందుల డీఎస్పీ వినోద్‌కుమార్, అర్బన్ సీఐ శంకర్‌రెడ్డి, సైబర్ క్రైం సీఐలు శ్రీధర్‌నాయుడు, మధుమల్లేశ్వర్‌రెడ్డి, ఎస్ఐ జీవన్‌రెడ్డి, పులివెందుల ఎస్ఐ అరుణ్‌రెడ్డి తదితర సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. ఈ వ్యవహారంలో ఇతర కుట్రదారులెవరన్నది తేల్చేందుకు క్షుణ్నంగా దర్యాప్తు చేపట్టారు. -
రతన్ టాటా పేరిట మోసం.. వైరల్ అవుతున్న పోస్ట్
గత కొన్ని రోజులుగా 'డీప్ ఫేక్' (Deep Fake) అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. సినీ తారల దగ్గర నుంచి రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలు సైతం ఈ డీప్ ఫేక్ ప్రభావానికి గురవుతున్నారు. రష్మిక మందన్న, ప్రియాంక చోప్రా సంఘటనకు మరువక ముందే.. దేశీయ వ్యాపార దిగ్గజం 'రతన్ టాటా' (Ratan Tata) పేరిట ఓ డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయిన ఒక పోస్ట్‌లో, సోన అగర్వాల్ పేరుతో టాటా మేనేజర్‌గా చెప్పుకుంటూ.. దేశ ప్రజలకు ఇదే నా సిఫార్సు. 100 శాతం గ్యారెంటీతో పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి అవకాశం, దీని కోసం ఈ ఛానెల్లోకి వెళ్లండి అంటూ.. రతన్ టాటా చెప్పినట్లు ఓ పోస్ట్ షేర్ చేశారు. ఈ వీడియోపై రతన్ టాటా స్పందిస్తూ.. అదంతా ఫేక్ అని సోషల్ మీడియాలో వెల్లడించారు. ఇలాంటి వాటి భారిన పడకుండా ఉండాలంటే ప్రజలు కూడా తప్పకుండా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదీ చదవండి: యూకే వెళ్లాలనుకునే విద్యార్థులకు కొత్త రూల్స్ - రిషి సునాక్ సంచలన ట్వీట్.. రోజు రోజుకి పెరుగుతున్న డీప్ ఫేక్ సమస్యను కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ సమస్యను పూర్తిగా అరికట్టడానికి కేంద్ర మంత్రి 'రాజీవ్ చంద్రశేఖర్' కూడా సోషల్ మీడియా ప్రతినిధులతో సమావేశమై చర్చించారు. రానున్న రోజుల్లో ఇలాంటి సమస్యలు తగ్గే అవకాశం ఉందని భావించవచ్చు. -
సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై కఠిన చర్యలు
సాక్షి, అమరావతి: సైబర్ నేరాలు, సోషల్ మీడియాలో దుష్ప్రచారాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐడీ ఎస్పీ (సైబర్ నేరాలు) హర్షవర్థన్ రాజు హెచ్చరించారు. సైబర్ నేరాలకు పాల్పడిన వారు, సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు, నకిలీ వార్తలు, కించపరిచే వీడియోలు, వ్యాఖ్యలకు బాధ్యులు రాష్ట్రంలో, దేశంలో, విదేశాల్లోనూ ఎక్కడ ఉన్నా వారి ఆటకట్టిస్తామని చెప్పారు. ఈ నేరగాళ్లను పట్టుకొనేందుకు సీఐడీ విభాగం పరస్పర న్యాయ సహాయ ఒప్పందం ద్వారా ఇంటర్ పోల్, ఇతర దేశాలతో కలసి పనిచేస్తోందని చెప్పారు. ఆయన శుక్రవారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజలకు సైబర్ భద్రత కల్పించేందుకు సీఐడీ విభాగం పూర్తిస్థాయిలో సిద్ధమైందన్నారు. ఆన్లైన్ ద్వారా వేధింపులు, ఆర్థిక మోసాలు, జూదం/బెట్టింగులు, సైబర్ బెదిరింపులు, ఉద్యోగ మోసాలు, వైవాహిక మోసాలు, రాన్సమ్వేర్, క్రిప్టో కరెన్సీ, ఆన్లైన్ రుణ మోసాలు మొదలైన అన్ని సైబర్ నేరాలను నిరోధించేందుకు సీఐడీ పూర్తిస్థాయి కార్యాచరణ చేపట్టిందని తెలిపారు. వ్యక్తులు, సంస్థలు లక్ష్యంగా ఫేక్ పోస్టులు, వార్తలు, ట్రోలింగ్లు, మార్ఫింగ్ వీడియోలు వంటివి పోస్టు చేసిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. సైబర్ నేరాలు, సోషల్ మీడియా దుష్ప్రచారాన్ని నిరోధించేందుకు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ (సీపీపీఎస్) ప్రత్యేక ఫ్రేమ్‌వర్క్‌ను, డిజిటల్ ఫోరెన్సిక్, సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్‌లను ఏర్పాటు చేసిందన్నారు. ప్రత్యేకంగా 60 మంది సైబర్ వలంటీర్లను కూడా నియోగించామన్నారు. నకిలీ వార్తలు, దుష్ప్రచార పోస్టులను తొలగించేందుకు ప్రత్యేకంగా హెల్ప్‌లైన్ నంబర్ 9071666667ను అందుబాటులోకి తెచ్చామన్నారు. సైబర్ నేరాలు, దుష్ప్రచారాలపై రెండేళ్లలో ఏకంగా 23 వేల కేసులు నమోదు చేశామని, రూ.30 లక్షల వరకు బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశామని, 3 వేల మందిని మ్యాపింగ్ చేశామని తెలిపారు. ఇటువంటి నేరాలను అరికట్టడంపై గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా పోలీసు విభాగం ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. సైబర్ నేరాలపై మరింత అవగాహన కల్పించేందుకు విశాఖపట్నంలో అక్టోబరు 7, 8 తేదీల్లో సైబర్ హ్యాకథాన్ నిర్వహిస్తున్నట్లు హర్షవర్థన్ రాజు చెప్పారు. సైబర్ నేరాలు, సోషల్ మీడియా దుష్ప్రచారంపై ఫిర్యాదుకు ఏర్పాటు చేసిన వ్యవస్థలు ♦ ఆన్లైన్ ఆర్థిక మోసాలపై ఫిర్యాదుకు టోల్‌ఫ్రీ నంబర్: 1930 ♦ సైబర్ మోసాలను ఆన్లైన్లో నివేదించడానికి: cybercrime.gov.in ♦ సైబర్ నేరాలపై ఇ–మెయిల్ ద్వారా ఫిర్యాదుకు: cybercrimes& cid@ap.gov.in ♦ ఆన్లైన్ మోసాలపై ఫిర్యాదుల కోసం సీఐడీ వెబ్సైట్: cid.appolice.gov.in ♦ ఫేస్బుక్ ఖాతా ద్వారా ఫిర్యాదు చేసేందుకు: itcore&cid@ap.gov.in ♦ ట్విట్టర్ ఖాతా ద్వారా ఫిర్యాదు చేసేందుకు:@apcidcyber ♦ యూట్యూబ్ చానెల్ ద్వారా ఫిర్యాదు చేసేందుకు: APCID4S4U -
విద్వేషాలు రెచ్చగొట్టేలా అంకబాబు దుష్ప్రచారం: సీఐడీ కీలక వ్యాఖ్యలు
సాక్షి,అమరావతి/నగరంపాలెం(గుంటూరువెస్ట్): ముఖ్యమంత్రి కార్యాలయ ప్రతిష్టకు ఉద్దేశపూర్వకంగా భంగం కలిగిస్తూ, సమాజంలో విద్వేషాలు రగిలించేలా తప్పుడు ప్రచారం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందునే కొల్లు అంకబాబును అరెస్టు చేశామని సీఐడీ విభాగం తెలిపింది. తాము ఇచ్చిన 41ఏ సీఆర్పీసీ నోటీసులను తీసుకునేందుకు తిరస్కరించడంతో పాటు తన మొబైల్ ఫోన్లోని ఆధారాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించడంతో ఆయన్ను అరెస్టు చేయాల్సి వచ్చిందని శుక్రవారం సీఐడీ ఓ ప్రకటనలో వెల్లడించింది. గతంలో ఈనాడు, ఉదయం పత్రికలు, హెచ్ఎంటీవీలలో జర్నలిస్టుగా చేసిన అంకబాబు ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నారని చెప్పింది. ‘సీఎంవోలోని ఓ కీలక అధికారి భార్య దుబాయి నుంచి అక్రమంగా బంగారం తీసుకువస్తూ గన్నవరం విమానాశ్రయంలో పట్టుబడినట్టు, ఆమెతో పాటు ఎయిర్ ఇండియా సిబ్బందిని కస్టమ్స్ అధికారులు విచారిస్తున్నట్లు’ ఓ అవాస్తవ పోస్టును అంకబాబు ఈనెల 9న సోషల్ మీడియాలో పోస్టు చేశారని సీఐడీ అధికారులు తెలిపారు. వాస్తవానికి విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు జప్తు చేసిన బంగారంతో సీఎంవో అధికారులకు ఎలాంటి సంబంధంలేదని తెలిపింది. అంకబాబు ఉద్దేశపూర్వకంగానే సీఎంవో ప్రతిష్ట దెబ్బతీసేందుకు, సమాజంలో వర్గవిద్వేషాలు సృష్టించేందుకే ఈ విధంగా తప్పుడు ప్రచారం చేసినట్టు తమ దర్యాప్తులో వెల్లడైందని సీఐడీ విభాగం వివరించింది. అంతేకాకుండా ఈ దుష్ప్రచార పోస్టులను వైరల్ చేయడంలో ఆయన సూపర్ స్ప్రెడర్గా వ్యవహరించినట్లు సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది. ఈ ఫేక్ పోస్టులపై సీఐడీ అధికారులు పలువురిని విచారించినపుడు ఈ విషయం వెలుగుచూసింది. వారందరి మొబైల్ఫోన్లకు కూడా ఆ ఫేక్ పోస్టు అంకబాబు మొబైల్ ఫోన్ నుంచే వచి్చనట్లు నిర్ధారణ అయ్యింది. వివిధ వాట్సాప్ గ్రూపులు, ఇతర సోషల్ మీడియా మాధ్యమాల్లో కూడా సీఎంవోపై దుష్ప్రచారం వెనుక అంకబాబే కీలకపాత్ర పోషించారని సీఐడీ విభాగం ఆధారాలు సేకరించింది. వీటి ఆధారంగానే కొన్ని టెలివిజన్ చానళ్లలో కూడా ఈ దుష్ప్రచారాన్ని వ్యాప్తిలోకి తెచ్చారు. తద్వారా వివిధ మాధ్యమాల ద్వారా ఒకే సమయంలో పెద్దఎత్తున దుష్ప్రచారం చేసేలా అంకబాబు వ్యవహరించారన్నది స్పష్టమైంది. దాంతో ఆయన్ని విజయవాడలో గురువారం రాత్రి అదుపులోకి తీసుకుని అతని మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నామని, అందులోనుంచి పంపిన పోస్టుల వివరాలు సేకరించామని చెప్పింది. ఆర్థిక నేరాలకు సంబంధించి అంకబాబుపై గతంలో కృష్ణా, పశి్చమ గోదావరి, శ్రీకాకుళం, కర్నూలు జిల్లాల్లో 20 వరకు కేసులు నమోదయ్యాయని కూడా సీఐడీ విభాగం వెల్లడించింది. కొన్ని మనీ సర్క్యులేషన్ స్కీముల పేరిట కూడా ఆయన మోసాలకు పాల్పడ్డారని సీఐడీ గుర్తించింది. గుంటూరులో విచారణ అంకబాబును సీఐడీ గుంటూరు ప్రాంతీయ కార్యాలయానికి తరలించి, శుక్రవారం సుదీర్ఘంగా విచారించారు. ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అంకబాబుని వైద్య పరీక్షలు నిమిత్తం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. ప్రాథమిక వైద్య పరీక్షలు తదుపరి ఎక్సైజ్ కోర్టులో హాజరు పరచగా, బెయిల్ మంజూరు చేశారు. అంకబాబుని అరెస్ట్ చేయడంతో టీడీపీ నాయకులు సీఐడీ ప్రాంతీయ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అంకబాబు అరెస్టు సరికాదు: చంద్రబాబు సాక్షి, అమరావతి: సీనియర్ జర్నలిస్ట్ అంకబాబు అరెస్ట్ సరికాదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు హైదరాబాద్ నుంచి శుక్రవారం డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డికి లేఖ రాశారు. విజయవాడలో అంకబాబు అరెస్టు అక్రమమని, వెంటనే విడుదల చేయాలని కోరారు. వాట్సాప్ పోస్ట్ పేరుతో అరెస్టు చేయడం దారుణమన్నారు. సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరించారని విమర్శించారు. టీడీపీ నాయకులు, క్రియాశీల కార్యకర్తలతో మొదలైన అక్రమ అరెస్టులు.. ఇప్పుడు ప్రశ్నించే గొంతుకలు, రాజధాని ఉద్యమకారుల వరకు వచ్చాయని తెలిపారు. -
ఫేక్ పోస్టులపై సీఐడీ విచారణ
సాక్షి, అమరావతి : ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో ఒక ఉన్నతాధికారిపై దుష్ప్రచారానికి పాల్పడుతున్న గుంటూరు జిల్లాకు చెందిన కొల్లు అంకబాబును గురువారం సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పన్ను ఎగవేతకు పాల్పడుతూ ఓ మహిళ విదేశాల నుంచి బంగారాన్ని అక్రమంగా తీసుకువస్తుండగా, కేంద్ర డీఆర్ఐ అధికారులు ఇటీవల గన్నవరం విమానాశ్రయంలో గుర్తించారు. దీనితో ఏమాత్రం సంబంధంలేని ఒక ఉన్నతాధికారికి ఈ ఉదంతాన్ని ఆపాదిస్తూ కొల్లు అంకబాబు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. దీనిపై ఫిర్యాదు అందడంతో సీఐడీ సైబర్ క్రైమ్ విభాగం అధికారులు కేసు నమోదు చేశారు. ఆ పోస్టులు పెట్టిన అంకబాబును అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. -
Fact Check:: హిజాబ్ దుమారం: నజ్మా చాలా హాట్ గురూ అంటూ..
Fact Check On JDS Leader Photos Viral Amid Hijab Issue: న్యాయస్థానాలకు చేరిన హిజాబ్ వ్యవహారంపై విచారణ నడుస్తోంది. మరోవైపు కర్ణాటకలో ఈ అంశంపై వేడి చల్లారేలా కనిపించడం లేదు. సినీ ప్రముఖుల దగ్గరి నుంచి మేధావుల దాకా ప్రతీ ఒక్కరూ ఈ అంశంపైనే చర్చిస్తుండడం చూస్తున్నాం. ఈ క్రమంలో రాజకీయ విమర్శలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. జేడీఎస్ సభ్యురాలు నజ్మా నజీర్ చిక్కనెరలేకు సంబంధించిన ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతూ.. దుమారం రేపుతున్నాయి. హిజాబ్ అభ్యంతరాల వ్యవహారంపై పోరాడుతున్న వాళ్లలో జనతా దళ్ సెక్యులర్ పార్టీకి చెందిన నజ్మా కూడా ఉన్నారు. అయితే ఆమె అసలు రూపం ఇదంటూ ఇంటర్నెట్లో కొన్ని ఫొటోలు వైరల్ అవుతున్నాయి. బుర్ఖా, హిజాబ్ ధరించడం తమ హక్కు అంటూ వాదిస్తున్న ఆమె.. అవి లేకుండానే తిరుగుతుందని, పైగా హాట్ హాట్ ఫొటోలను సైతం అప్లోడ్ చేస్తుందంటూ గౌరవ్ మిశ్రా అనే ట్విటర్ అకౌంట్ నుంచి కొన్ని ఫొటోలు కనిపించాయి. రియల్ హిజాబ్ వారియర్, ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచే ఈ ఫొటోలు తీశాం అంటూ గురురాజా అనే ట్విటర్ అకౌంట్ నుంచి సెటైరిక్ పోస్టుగా అవి వైరల్ అయ్యాయి. అలా నజ్మా నజీర్‌ను సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. Pic 1: Alleged Sherni In Burqa & Hijab Pic 2: She is not part of Tukde Tukde Gang Pic 3 & 4: Ofcourse she is not politically Motivated#HijabBan pic.twitter.com/5kcbfgDSyM — Gaurav Mishra 🇮🇳 (@IamGmishra) February 9, 2022 నజ్మా నజీర్ ఒక కాలేజీ స్టూడెంట్. 2018లో ఆమె తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుంది. కాలేజీ టైం నుంచే ఆమె పలు ఉద్యమాల్లో పాల్గొంటూ.. ఇప్పుడు జేడీఎస్ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. హిజాబ్ పేరిట వైరల్ అవుతున్న ఆమె ఫొటోలు అన్నీ మార్ఫింగ్ ఫొటోలని తేలింది ఇప్పుడు. రెడ్ కలర్ టాప్‌లో ఉన్న అమ్మాయి అసలు పేరు తన్యా జేనా. ఆమె ఇన్స్టాగ్రామ్ మోడల్. 2019లో ఆమె తన ఫొటోను అప్లోడ్ చేయగా.. ఆ ఫొటోను మార్ఫ్ చేసి.. నజ్మాను బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. Nazma nazeer 😂ಹಿಜಾಬ್ ಹೋರಾಟಗಾರ್ತಿಯ ನಿಜ ರೂಪ ,, ಇದನ್ನು ಎಡಿಟ್ ಎಂದು ಕಾಮೆಂಟ್ ಮಾಡುವವರೇ ಅವಳ Instagram ನಿಂದ ಇದನ್ನು ತೆಗೆಯಲಾಗಿದೆ 🙊🙉🙈🐵, pic.twitter.com/rBuWVI2gik — Gururaja M K (@AmansurajGuru) February 6, 2022 ఇక ఫేస్బుక్లో నజ్మా నజీర్ చిక్కనెరాలె పేరుతో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. కొంతమంది తప్పుడు ప్రచారంతో నా క్యారెక్టర్‌ను దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారు’ అంటూ కన్నడలో పోస్ట్ చేసింది. ఇదిలా ఉండగా.. హిజాబ్ అంశానికి సంబంధించి.. ఆరుగురు అమ్మాయిల ఫొటోలు, ఫోన్ నెంబర్లు ఇంటర్నెట్లో దర్శనమివ్వడంపై.. వాళ్ల పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. మరోవైపు ఈ అంశానికి సంబంధించి ఫేక్ ఫొటోలు, వీడియోలు సైతం వైరల్ అవుతుండడం.. కలవర పెడుతోంది. FactCheck..చివరగా.. నజ్మా నజీర్ తప్పుడు ఉద్దేశంతోనే ‘హిజాబ్’ ఎజెండాను ముందుకు నడిపిస్తోందని, ఈ విషయంలో ఆమె సరిగ్గా లేదన్నది సోషల్ మీడియా పోస్ట్‌ల సారాంశం. కానీ, వైరల్ పోస్ట్‌లు వాస్తవానికి మార్ఫింగ్ చేసిన చిత్రాలు. పైగా ఆమె ఒక కాలేజీ స్టూడెంట్, ఉద్యమాన్ని తప్పుదోవ పట్టిస్తోందన్న వాదనా అర్థరహితం అని ఆమె వాదిస్తున్నారు. అబద్ధం అబద్ధమే.. ఇస్లాంలో కొందరు అమ్మాయిలు బయటకు రాకపోవడం వల్ల సరిగా మాట్లాడలేకపోతున్నారు. కానీ, మౌనంగా భరించాల్సిన అవసరం లేదు. రాజ్యాంగం, హక్కులు.. వేటి గురించి అయినా మాట్లాడొచ్చు. గట్టిగా బదులు ఇచ్చేందుకు కన్నడ, ఆంగ్లం.. ఎలాంటి భాషైనా ఫర్వాలేదు. అబద్ధం ఎప్పుడూ అబద్ధమే. తనలాంటి వారెవరైనా ఇలాంటి వ్యవహారాలను భరించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారామె. నిజం ఎప్పుడూ నిజమే. తన క్యారెక్టర్‌ను దిగజార్చి తక్కువ చూపించేందుకు కొందరు ప్రయత్నించినా.. బాధ్యతగల మీడియా తన గౌరవాన్ని కాపాడిందని, అందుకు కృతజ్ఞతలు అని ఫేస్బుక్ ఒక పోస్ట్ చేశారు. -
రేయ్.. ఎవర్రా మీరు? ఎక్కడి నుంచి వచ్చార్రా?
Anand Mahindra Angry With Instagram Page Over Fake Quotation: మీడియా, సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీలు, వ్యాపారదిగ్గజాలు, నేతలకు సంబంధించిన ప్రతీ అప్డేట్ ఈమధ్యకాలంలో జనాలకు చేరుతోంది. అయితే ఈ క్రమంలోనే అసత్య ప్రచారాలు, ఫేక్ పోస్టులు సైతం వైరల్ అవుతుండడం విశేషం. ఈ మధ్య వరుసగా ఇంటర్నెట్లో ప్రముఖ వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రకు సంబంధించిన ఫేక్ కథనాలు వరుసగా చక్కర్లు కొడుతున్నాయి. ఈ తరుణంలో స్వయంగా ఆయనే రియాక్ట్ అవుతున్నారు. అయితే తాను అనని మాట అన్నట్లుగా ప్రచారం చేస్తున్న వాళ్లపై ‘ఎక్కడి నుంచి వచ్చారంటూ’ అగ్గిమీద గుగ్గిలం అయ్యారాయన. As a colleague told me: ‘It looks like it’s hunting season on you with miscreants on the internet.’ Another completely fabricated quote falsely attributed to me. I’ll be taking legal action. Meanwhile, I’m going to post the 2 memes to the right, below, whenever I spot more fakes! pic.twitter.com/9DPM5k0Kde — anand mahindra (@anandmahindra) November 21, 2021 గత కొన్నిరోజులుగా ‘‘సగటు భారతీయుడు జీవితం అతని చేతుల్లోనే లేదంటూ’’ మహీంద్ర పేరిట ఒక కొటేషన్ వైరల్ అయ్యింది. అయితే అది సగటు భారతీయుల్ని కించపరిచినట్లుగా ఉండడమే ప్రధాన అభ్యంతరం. ఈ ఫేక్ కోట్ తన కొలీగ్ ద్వారా విషయం తన దృష్టికి వచ్చిందంటూ పేర్కొన్న మహీంద్ర.. అందుకు సంబంధించిన ఫొటోల్ని ట్విటర్లో షేర్ చేశారు. అంతేకాదు తాను అనని మాటల్ని అన్నట్లుగా వైరల్ చేసిన ఇన్స్టాగ్రామ్ పేజీ మీద లీగల్ యాక్షన్ తీసుకోనున్నట్లు ప్రకటించారు. పనిలో పనిగా తన చాతుర్యం ప్రదర్శిస్తూ.. ‘జాలీ ఎల్ఎల్బీ’లోని నటుడు అర్షద్ వార్సీ ఫేమస్ డైలాగ్ మీమ్.. ‘కౌన్ యే లోగ్?.. కహా సే ఆతే హైన్?’ అంటూ ఫేక్ రాయుళ్లపై పంచ్ కూడా విసిరారు. ఇలాంటి ఫేక్ కొటేషన్లు తన పేరుతో చాలానే ప్రచారం అవుతున్నాయని చెప్తున్నారాయన. క్లిక్ చేయండి: అంతా అబద్ధం.. ఒక్క రూపాయి పెట్టలేదు!: ఆనంద్ మహీంద్రా -
అది నకిలీది.. అలా నేను అనలేదు: ఆనంద్ మహీంద్ర
ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడూ స్ఫూర్తిదాయకమైన, ఆసక్తికరమైన వీడియోలు షేర్ చేస్తూ ఉంటారు. ఆనంద మహీంద్రా షేర్ చేసే పోస్టులకు ఎంతో ప్రధాన్యం ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఒక పోస్టులో "మీ జీవితాన్ని మార్చే సలహా ఇది" అంటూ ఆనంద్ మహీంద్రా పేరుతో ఆ పోస్టు తెగ వైరల్ అవుతుంది. అందులో "మిడిల్ స్కూల్ విద్యలో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ తప్పనిసరి భోధించాలి కానీ, అలా ఎందుకు చేయడం లేదో నేను చెబుతాను అంటూ" ఉంది. అయితే, ఆ వార్త నకిలిదీ అని ఆనంద్ మహీంద్ర పేర్కొన్నారు.(చదవండి: మారుతి సుజుకి కస్టమర్లకు హెచ్చరిక!) ‘‘తెలియని విషయాలు, జ్ఞానాన్ని పంచుకోవడానికి సోషల్ మీడియా ఒక సాధనమని నేను ఎల్లప్పుడూ నమ్ముతాను. కానీ, మరోవైపు కొందరు తప్పుడు కోట్స్ ను నాకు ఆపాదిస్తున్నారు. ఇలాంటి విషయాల గురుంచి వీలైనప్పుడల్లా తెలియజేయడానికి నా వంతు కృషి నేను చేస్తున్నాను.." అని మహీంద్ర ఒక ట్వీట్ చేశారు. I’m flattered that some believe my statements are quotable & I’ve always believed in the power of social media to democratise information & share knowledge. But the downside is wrongly attributed quotes! I’ll do my best to call them out whenever possible… pic.twitter.com/2D3XrD4GpH — anand mahindra (@anandmahindra) September 2, 2021 -
Boycott Myntra.. ఎందుకో తెలుసా?
Boycott Myntra trending on Twitter: మనోభావాలు.. దెబ్బతినడానికి ప్రత్యేకించి కారణాలు అక్కర్లేని రోజులివి. అలాంటిది చిన్న కారణం దొరికినా.. వివాదాన్ని రేపి, రచ్చ చేసి గోల చేస్తున్నారు చాలామంది. ఈ తరుణంలో దుస్తుల ఈ-కామర్స్ సంస్థ మింత్రా విమర్శలు ఎదుర్కొంటోంది. బాయ్‌కాట్ మింత్రా పేరుతో సోషల్ మీడియాలో కుప్పలుగా పోస్ట్‌లు కనిపిస్తున్నాయి. దానికి కారణం.. ఓ పాత ఫేక్ పోస్ట్. లోగో మార్పుతో వివాదంలో నిలిచిన మింత్రా.. ఇప్పుడు మరో విమర్శను ఎదుర్కొంటోంది. మహాభారత దుశ్వాసన పర్వంలో కృష్ణుడు, ద్రౌపదికి వలువలు అందించే ఘట్టాన్ని తమ ప్రమోషన్‌కు వాడుకుందనేది మింత్రాపై వినిపిస్తున్న ఆరోపణ. ఈ కారణంతోనే హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మింత్రా వ్యవహరించిందని.. కాబట్టి తక్షణమే దానిని అన్-ఇన్స్టాల్ చేయాలని విమర్శలు వినిపిస్తున్నాయి. Shame On Myntra . Retweet And #BoycottMyntrahttps://t.co/kPROnzxLwh — Sadhvi Prachi (@Sadhvi_prachi) August 23, 2021 This is not an ad, it is a direct insult to Hinduism & Hindu’s everywhere. It’s time to send a message loud & clear: Anti-Hindu propaganda will no longer be met with passivity. It will be met with action. #BoycottMyntra pic.twitter.com/EThpeT0xrL — Kavita (@Sassy_Hindu) August 22, 2021 Guy's this has not been done by @myntra it is a post shared on 2016 which has popped now . I'm not supporting myntra but what wrong is wrong . An I'm not an anti-Hindu . I love my religion but we should not blindly tweet without knowing thefact do fact check once #BoycottMyntra pic.twitter.com/MIH2NDt5v4 — B Sanki (@sanjubhujlthapa) August 23, 2021 Abe yaar bc pagal hain kya log? #BoycottMyntra but why? 5 saal pehle ka incident hai ye and myntra has said they didn’t create this artwork neither did they endorse it. Bhai ek baar double check to kar liya karo!🤦🏻♂️ pic.twitter.com/Hl5osQcNT0 — Sanjay Beniwal (@noSanjayBeniwal) August 23, 2021 ఈ మేరకు ఉదయం నుంచి విపరీతమైన పోస్టులు ట్విటర్లో కనిపిస్తుండడంతో.. ట్రెండింగ్‌లోని వచ్చింది. అయితే ఈ పోస్ట్ కొత్తది కాదు. మింత్రా డిజైన్ చేసింది అంతకన్నా కాదు. 2016లోనే ఈ ఫేక్ పోస్ట్ వైరల్ అయ్యింది. ఆ టైంలోనే స్పందించిన మింత్రా.. అలాంటి ఆర్ట్ వర్క్‌ను తాము సృష్టించలేదని, ఎండోర్స్ కూడా చేయలేదని స్పష్టం చేసింది. ఇప్పుడు మళ్లీ హిందుత్వఅవుట్లౌడ్( @hindutvaoutloud) అనే ఇన్స్టాగ్రామ్ పేజీ నుంచి ఈ పోస్ట్ అప్లోడ్ అయ్యింది. కొందరు మింత్రాకు మద్దతుగా ఈ ఫేక్ ఓల్డ్ పోస్ట్‌పై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. View this post on Instagram A post shared by Outloud (@hindutvaoutloud) -
బండి సంజయ్‌తో చర్చకు ఎక్కడైనా సిద్ధమే..
సాక్షి, సిద్దిపేట: దుబ్బాకలో బీజేపీ నాయకుల గోబెల్స్ ప్రచారానికి అడ్డు అదుపు లేకుండా పోతుందని, ప్రజలను మభ్యపెట్టేలా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ప్రజాస్వామ్యానికి ఇది ఏమాత్రం మంచిది కాదన్నారు. ఆయన సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దుబ్బాకలో టీఆర్ఎస్ జెండా, గద్దె కూలగొట్టినట్లు, టీఆర్ఎస్ నాయకులపై ప్రజలు ఎదురు తిరిగినట్లు బీజేపీ నేతలు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. గతంలో ఎన్నికల సమయంలో కల్వకుర్తిలో జరిగిన సంఘటనను దుబ్బాకలో జరిగినట్లు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద దుబ్బాకకు ముఖ్యమంత్రి ఇచ్చిన నిధులు దుర్వినియోగం అయినట్లు సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామని తెలిపారు. సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వ్యక్తిని అరెస్టు చేసి పోలీసులు జైలుకు తరలించారని తెలిపారు. దుబ్బాక ప్రజలు ఈ విషయాలన్నీ గమనించాలని విజ్ఞప్తి చేశారు. రూ.3కోట్ల నిధులు స్వాహా అయినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని తలిపారు. చదవండి: 'అబద్ధాలతో అధికారంలోకి వస్తే ఎండమావే' దుబ్బాకలో టౌన్‌హాల్ నిర్మాణానికి ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల కాలేదని స్పష్టం చేశారు. రహదారుల టెండర్ ఫైనల్ కాకముందే డబ్బులు ఇచ్చినట్లు సోషల్ మీడియాలో తప్పుడు పోస్టింగ్‌లు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. బీజేపీ దివాలాకోరు రాజకీయాలకు ఇది పరాకాష్ట అని అన్నారు. బీడీ కార్మికులకు కేంద్రం ఏం సాయం చేస్తుందో చర్చకు ఎక్కడైనా సిద్ధమే అని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఆర్థిక మంత్రి హరీష్‌రావు సవాల్ విసిరారు. రూ.1600 కాదు, పదహారు పైసలు కూడా కేంద్రం ఇవ్వడంలేదుని తెలిపారు. రూ.1600 ఇస్తున్నట్లు రుజువు చేస్తే సిద్ధిపేట ఎమ్మెల్యే, మంత్రి పదవులకు రాజీనామా చేస్తానని అన్నారు. రుజువు చేయలేకపోతే కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ రాజీనామా చేయాలన్నారు. ప్రజల దృష్టి మరల్చేందుకే బీజేపీ కుటిల రాజకీయాలు చేస్తోందని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. హుజూర్నగర్ ఉపఎన్నికలో ఇదే విధంగా బీజేపీ నేతలు గోబెల్స్ ప్రచారం చేశారని, ఆ ఎన్నికల్లో చపాతీ మేకర్ గుర్తు ఉన్న అభ్యర్థి కన్నా తక్కువ ఓట్లు బీజేపీకి వచ్చాయని ఎద్దేవా చేశారు. దుబ్బాకలో అదే విధమైన గోబెల్స్ ప్రచారాలు చేస్తున్నారని, హుజూర్‌నగర్‌లో బీజేపీకి జరిగిన పరాభవమే దుబ్బాకలో జరుగుతుందన్నారు. బీజేపీ నాయకులకు నిజమైన చిత్త శుద్ధి ఉంటే కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులకు జాతీయ హోదా తీసుకురావాలన్నారు. ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేసి, రాష్ట్రానికి రావాల్సిన నిధులను, రాజ్యాంగ బద్దంగా, హక్కుగా రావాల్సిన పన్ను బకాయిలను రప్పించాలన్నారు. అంతే తప్ప అబద్ధపు, అసత్యపు ప్రచారాలను మానుకోవాలని హితవు పలికారు. దుబ్బాక ప్రజలను ముమ్మాటికీ మీ మాటను నమ్మరని, బీజేపీకి హుజూర్నగర్, నిజామాబాద్‌లో ఎదురైన ఫలితమే దుబ్బాకలో పునరావృతం కానుందని హరీశ్‌రావు తెలిపారు. -
వైరల్ ట్వీట్: బిగ్‌బీపై నెటిజన్ల ఫైర్
బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ నకిలీ ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నందుకు ఆయనపై నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం రాత్రి 9 గంటలకు ఇళ్లలో 9 నిమిషాల పాటు దీపాలు వెలగించాలంటూ దేశప్రజలకు పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బిగ్‌బీ ఆదివారం మొత్తం చీకటిగా ఉన్న ప్రపంచ పటంలో భారదేశం వెలుగుతూ ఉన్న ఓ ఫేక్ పోస్టును ట్విటర్లో షేర్ చేశారు. (సిగ్గుపడను.. చాలా వింతగా ఉంది) ‘ప్రపంచం అంధకారంలో ఉన్నప్పుడు భారతదేశం ప్రకాశిస్తుందని చెప్పడానికి ఇదే ఉదాహరణ’ అంటూ ట్వీట్ చేసిన అసలైన పోస్టును అమితాబ్ రీట్వీట్ చేశారు. ‘‘ప్రపంచం మనల్ని చూస్తోంది, అందులో మనం ఒకరం’’ అంటూ ట్వీట్ చేశారు. ఇక బిగ్‌బీ తీరుపై ‘‘నకిలీ పోస్టులను పంచుకోవడం ఆపండి సార్’ ‘ఇదంతా అబద్ధం బచ్చన్ సార్.. మీరు పడుకొండి ఇక’, ‘ఎదైనా విషయాన్ని పోస్టు చేసే ముందు ఓసారి చెక్ చేసుకోండి ప్లీజ్’’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేశారు. (మాస్క్‌లు ధరించకపోతే రూ.1000 జరిమానా) The World sees us .. we are ONE .. https://t.co/68k9NagfkI — Amitabh Bachchan (@SrBachchan) April 5, 2020 అయితే కరోనాపై అజాగ్రత్త వద్దంటూ అవగాహన కల్పించడంలో ముందున్న బిగ్‌బీ సమాచారం ఇచ్చేముందు జాగ్రత్త వహించాలని అభిమానులు కోరారు. అంతేగాక గతంలో కూడా కరోనాను ఎదుర్కొవటానికి ఆయుష్ మంత్రిత్వశాఖ తీసుకుంటున్న చర్యలకు మద్దతునిస్తూ.. హోమియోపతిలోని గోమూత్ర వైద్యం ద్వారా కరోనా వ్యాప్తిని అడ్డుకోవచ్చని సూచించి విమర్శల పాలయ్యారు. అంతేగాక చైనా షేర్ చేసిన ఓ వీడియోను బిగ్‌బీ షేర్ చేస్తూ.. ‘‘అంటువ్యాధుల నివారణలో ప్రపంచాన్ని భారతదేశం నడిపిస్తుందని ఆశిస్తున్నాను’’ అంటూ చేసిన ట్వీట్‌ను భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఖండించింది. -
చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది : శిరీష్
సోషల్ మీడియాలో కొందరు ఆకతాయిలు ఫేక్ పోస్టులు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అటువంటి వారిపై చర్యలు తీసుకోవడం కూడా కష్టతరంగా మారింది. తమపై జరుగుతున్న దుష్ప్రచారానికి సంబంధించి పలువురు సెలబ్రిటీలు పోలీసులను ఆశ్రయించిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ఓ ఫేక్ పోస్టుపై హీరో అల్లు శీరిష్ ట్విటర్ వేదికగా స్పందించారు. ఓ నెటిజన్ ట్వీట్‌కు రిప్లై ఇచ్చిన శిరీష్.. నకిలీ స్ర్కీన్షాట్లు పోస్ట్ చేసి.. తప్పుడు ప్రచారం చేయవద్దని కోరారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తోందని హెచ్చరించారు. అయితే శిరీష్ స్పందించిన వెంటనే.. సదరు నెటిజన్ ఆ పోస్ట్‌ను తొలగించాడు. నాలుగేళ్ల తర్వాత.. మరో ట్వీట్లో అల.. వైకుంఠపురములో మ్యూజిక్ నైట్‌కు తను హాజరవుతున్నట్టు చెప్పారు. దాదాపు నాలుగేళ్ల తర్వాత తన సోదరుడి చిత్రానికి సంబంధించిన ఈవెంట్‌కు హాజరవుతున్నట్టు తెలిపారు. 2016 సరైనోడు ఆడియో ఫంక్షన్‌కు హాజరయ్యానని గుర్తుచేశారు. ఈ కార్యక్రమానికి హాజరు అవుతుండటం చాలా సంతోషంగా ఉందన్నారు. కాగా, గౌరవం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు శిరీష్.. పలు చిత్రాల్లో మెప్పించారు. గతేడాది ఏబీసీడీ చిత్రంతో శిరీష్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పలు అవార్డు ఫంక్షన్లకు ఆయన హోస్ట్‌గా కూడా వ్యవహరించారు. Please dont post fake screenshots and create such negativity. I'll be compelled to take legal action for doing such mischief. — Allu Sirish (@AlluSirish) January 6, 2020 -
ప్రధాని నగ్న ఫోటోలు.. బీజేపీ అతి
సాక్షి, ముంబై : సోషల్ మీడియాలో పోస్టుల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. లేకపోతే నవ్వులపాలయ్యే అవకాశం పుష్కలంగా ఉంటుంది. సరిగ్గా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు అలాంటి పరిస్థితులనే ఎదుర్కుంటోంది. తాజాగా పాక్ ప్రధాని షాహిద్ కక్కాన్ అబ్బాసీ అమెరికా పర్యటనలో చేదు అనుభవం ఎదుర్కున్న వార్త ఒకటి విపరీతంగా చక్కర్లు కొట్టింది. న్యూయార్క్ జేఎఫ్‌కే ఎయిర్పోర్ట్ వద్ద భద్రతా సిబ్బంది ఆయన్ని క్షుణ్ణంగా పరిశీలించారని.. ఈ క్రమంలో ఆయన బట్టలూడదీసినట్లు కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బీజేపీకి చెందిన ఓ ఫేస్బుక్ పేజీ అబ్బాసీ ఫోటోలంటూ వాటిని వైరల్ చేస్తూ... ‘పందులు కులభూషణ్ భార్య మంగళసూత్రాన్ని తీయించాయి. అమెరికా అధికారులు పాక్ ప్రధాని గుడ్డలూదీయించారు’ అంటూ సందేశాన్ని ఉంచింది. ఆ గ్రూప్‌లో లక్షల్లో ఫాలోవర్లు ఉండటంతో ఆ ఫోటో వేల సంఖ్యలో షేర్ అయ్యింది. అదే తరహాలో మరికొన్ని గ్రూప్‌లు ‘భారత్‌తో పెట్టుకుంటే అంతే..’ అంటూ కామెంట్లతో ఆ ఫోటోలను షేర్ చేశాయి. కానీ, ఆ ఫోటోలు అబ్బాసీవి కాదన్న విషయం ఇప్పుడు తేలిపోయింది. ముంబైకి చెందిన ఓ వార్తాసంస్థ గూగుల్ ద్వారా ఆ ఫోటోలను నిర్ధారణ చేసేసింది. 2015లో డెయిలీ మెయిల్ ప్రచురించిన ఓ కథనంలోని ఫోటోలు అవి. భద్రతా సిబ్బందితో వాగ్వాదానికి దిగిన ఓ రష్యన్ ప్రయాణికుడు మొత్తం బట్టలిప్పదీసి నగ్నంగా నడిచాడు. ఆ ఘటనంతా సీసీ ఫుటేజీలో నమోదు కాగా.. అప్పటి ఫోటోలను ఇప్పుడు అబ్బాసీ ఫోటోలంటూ ఎవరో అప్ లోడ్ చేశారు. వాటిని పట్టుకున్న బీజేపీ.. సోషల్ మీడియాలో తెగ వైరల్ చేసేసింది. ఇక ఇప్పుడు ఈ వ్యవహారాన్నంతా బీజేపీ అతి అంటూ ట్రోల్ చేసి పడేస్తున్నారు. బీజేపీ వైరల్ చేసిన పోస్ట్ ఇదే... వార్త సంస్థ బయటపెట్టిన వీడియో తాలుకూ స్క్రీన్ షాట్ -
ఫేక్ పోస్టులు.. దిమ్మతిరిగే షాక్
సాక్షి, న్యూఢిల్లీ : పాకిస్థాన్ మరోసారి తన వంకర బుద్ధిని ప్రదర్శించింది. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని భారత్‌పై విషం చిమ్మేందుకు తీవ్రంగా యత్నించింది. ఈ ప్రయత్నంలో అడ్డంగా దొరికిపోయి బొక్కా బోర్లా పడింది. భారత్‌కు వ్యతిరేకంగా ఫేక్ పోస్టులు, మార్ఫింగ్ ఫోటోలు పెట్టడంతో పాకిస్థాన్ డిఫెన్స్ ఫోరమ్‌కు చెందిన ట్విట్టర్, ఫేస్బుక్ ఖాతాలు శనివారం స్తంభించిపోయాయి. ఇంతకీ విషయం ఏంటంటే... ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన కవాల్ ప్రీత్ కౌర్ అనే న్యాయ విద్యార్థిని ఈ జూన్‌లో ఓ పోస్టు చేసింది. భారతీయులుగా రాజ్యాంగాన్ని, లౌకిక వాదాన్ని గౌరవించాలని... ముస్లిం ప్రజలపై జరుగుతున్న దాడులను ఖండించాలంటూ ఫ్లకార్డు మీద రాసి జమా మసీద్ వద్ద ఫోటో దిగి షేర్ చేసింది. తనలా ప్రతీ ఒక్కరూ ఇలా ఫోటో దిగి ప్రొఫైల్ ఫోటో మార్చుకొండంటూ తెలియజేసింది. అయితే ఆ ఫోటోను మార్ఫింగ్ చేసిన పాక్ డిఫెన్స్ తన అధికారిక పేజీలో షేర్ చేసింది. ‘‘నేను ఇండియన్‌ను అయినా.. భారత్ అంటే అస్సలు ఇష్టం లేదు.. వలసవాదాలకు ఇది కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది’’ అంటూ ఫ్లకార్డులోని రాతలను పూర్తిగా మార్చేసింది. పైగా చివరకు భారతీయులు అర్థం చేసుకున్నారు అంటూ పాక్ రక్షణ శాఖ చివర్లో ఓ సందేశం కూడా ఇచ్చింది. జాదవ్ అంశంపై కూడా... ఇదిలా ఉంటే పాక్‌లో బందీగా ఉన్న భారత ఖైదీపై కూడా పాక్ డిఫెన్స్ ట్వీట్ చేసింది. పాక్ మావనతా ధృక్పథంతో జాదవ్ భార్యను కలిసేందుకు అంగీకరిస్తే.. భారత్ మాత్రం అందుకు విముఖత వ్యక్తం చేసిందంటూ పోస్టు చేసింది. అయితే పాక్ ఫారిన్ అధికారి డాక్టర్ మహ్మద్ ఫైజల్ మాత్రం ఇండియా ఆ ప్రతిపాదనకు అంగీకరించిందంటూ ఓ ట్వీట్ చేయటంతో ఇది కూడా అబద్ధపు పోస్టు అని తేలిపోయింది. ఇక ఆ ట్విట్టర్, ఫేస్బుక్ పేజీలతో ఎలాంటి సంబంధం లేదని పాక్ రక్షణ అధికారులు బుకాయిస్తున్నప్పటికీ... బ్లూ టిక్ మార్క్ ఉండటం.. పైగా పాక్ సైనిక అధికారులు అందులో సభ్యులుగా ఉండటం ద్వారా పాక్ నీచపు బుద్ధి బయటపడింది. @defencepk suspended by twitter for posting photoshopped pics of @kawalpreetdu pic.twitter.com/TDSxZFOCPb — Aveek Sen (@aveeksen) November 18, 2017 Indian Reply to Pakistan's Humanitarian offer for Commander Jadhav received & is being considered — Dr Mohammad Faisal (@ForeignOfficePk) November 18, 2017 -
ఫేక్ పోస్ట్ ఫలితం: బీజేపీ నేత అరెస్టు!
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు ఆజ్యం పోసేందుకు ఫేస్బుక్లో ఫేక్ వార్తలను పోస్ట్చేసిన వారి అరెస్ట్‌ల పర్వం కొనసాగుతోంది. తాజాగా ట్విట్టర్లో తప్పుడు వార్తను పోస్ట్చేసిన భారతీయ జనతా పార్టీ సమాచార, సాంకేతిక (ఐటీ) విభాగం కార్యదర్శి తరుణ్ సేన్ గుప్తాను బుధవారం బెంగాల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 24 పరగణాల జిల్లాలో ఓ మహిళపై నడివీధిలో కీచకపర్వం కొనసాగుతోందంటూ భోజ్‌పురి సినిమాలోని ఓ దశ్యాన్ని పోస్ట్ చేసిన 38 ఏళ్ల యువకుడిని మంగళవారం నాడు పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెల్సిందే. ఆ పోస్ట్‌ను ఫేస్బుక్లో తీవ్రంగా షేర్ చేసిన హర్యానా బీజేపీ నాయకుడు విజేత మాలిక్ కోసం కూడా పోలీసులు వెతుకుతున్నట్లు తెల్సింది. ఒకప్పుడు శాంతి, సౌభ్రాతత్వాలు విరాజిల్లిన బెంగాల్ నేడు అన్ని రంగాల్లో విఫలమైందని ఆరోపిస్తూ 2002 గుజరాత్ అల్లర్ల ఫొటోను షేర్ చేసిన బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మపై మంగళవారం నాడు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయిన విషయం తెల్సిందే. మొహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద చిత్రంవేసి రాష్ట్రంలో ప్రస్తుత ఉద్రిక్తతలకు కారణమైన యువకుడి తల్లిదండ్రులకు ఎంత దారుణంగా హింసించారో చూడండంటూ తప్పుడు ఫొటోను ఫేస్బుక్లో పోస్ట్చేసిన యువకుడిని కూడా మంగళవారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు. అల్లర్లకు కారణమైన యువకుడికి అసలు తల్లేలేదని తెల్సింది.