రతన్ టాటా పేరిట మోసం.. వైరల్ అవుతున్న పోస్ట్ | Ratan Tata Fake Post for Investment Recommendations | Sakshi
Sakshi News home page

రతన్ టాటా పేరిట మోసం.. వైరల్ అవుతున్న పోస్ట్

Published Thu, Dec 7 2023 4:04 PM | Last Updated on Thu, Dec 7 2023 4:20 PM

Ratan Tata Fake Post for Investment Recommendations - Sakshi

గత కొన్ని రోజులుగా 'డీప్ ఫేక్' (Deep Fake) అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. సినీ తారల దగ్గర నుంచి రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలు సైతం ఈ డీప్ ఫేక్ ప్రభావానికి గురవుతున్నారు. రష్మిక మందన్న, ప్రియాంక చోప్రా సంఘటనకు మరువక ముందే.. దేశీయ వ్యాపార దిగ్గజం 'రతన్ టాటా' (Ratan Tata) పేరిట ఓ డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయిన ఒక పోస్ట్‌లో, సోన అగర్వాల్ పేరుతో టాటా మేనేజర్‌గా చెప్పుకుంటూ.. దేశ ప్రజలకు ఇదే నా సిఫార్సు. 100 శాతం గ్యారెంటీతో పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి అవకాశం, దీని కోసం ఈ ఛానెల్‌లోకి వెళ్లండి అంటూ.. రతన్ టాటా చెప్పినట్లు ఓ పోస్ట్ షేర్ చేశారు. 

ఈ వీడియోపై రతన్ టాటా స్పందిస్తూ.. అదంతా ఫేక్ అని సోషల్ మీడియాలో వెల్లడించారు. ఇలాంటి వాటి భారిన పడకుండా ఉండాలంటే ప్రజలు కూడా తప్పకుండా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇదీ చదవండి: యూకే వెళ్లాలనుకునే విద్యార్థులకు కొత్త రూల్స్ - రిషి సునాక్ సంచలన ట్వీట్..

రోజు రోజుకి పెరుగుతున్న డీప్ ఫేక్ సమస్యను కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ సమస్యను పూర్తిగా అరికట్టడానికి కేంద్ర మంత్రి 'రాజీవ్ చంద్రశేఖర్' కూడా సోషల్ మీడియా ప్రతినిధులతో సమావేశమై చర్చించారు. రానున్న రోజుల్లో ఇలాంటి సమస్యలు తగ్గే అవకాశం ఉందని భావించవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement