Boycott Myntra Trends On Twitter As Old Fake Ad Goes Viral - Sakshi
Sakshi News home page

ఫేక్‌ యాడ్‌ దుమారం.. మింత్రాను అన్‌ఇన్‌స్టాల్‌ చేయాలంటూ ట్విటర్‌ ట్రెండ్‌

Published Mon, Aug 23 2021 11:57 AM | Last Updated on Mon, Aug 23 2021 12:37 PM

Boycott Myntra Fact Check On Anti Hindu Old Fake Ad Again Viral - Sakshi

Boycott Myntra trending on Twitter: మనోభావాలు.. దెబ్బతినడానికి ప్రత్యేకించి కారణాలు అక్కర్లేని రోజులివి. అలాంటిది చిన్న కారణం దొరికినా.. వివాదాన్ని రేపి, రచ్చ చేసి గోల చేస్తున్నారు చాలామంది. ఈ తరుణంలో దుస్తుల ఈ-కామర్స్‌ సంస్థ మింత్రా విమర్శలు ఎదుర్కొంటోంది. బాయ్‌కాట్‌ మింత్రా పేరుతో సోషల్‌ మీడియాలో కుప్పలుగా పోస్ట్‌లు కనిపిస్తున్నాయి. దానికి కారణం.. ఓ పాత ఫేక్‌ పోస్ట్‌.

లోగో మార్పుతో వివాదంలో నిలిచిన మింత్రా.. ఇప్పుడు మరో విమర్శను ఎదుర్కొంటోంది. మహాభారత దుశ్వాసన పర్వంలో కృష్ణుడు, ద్రౌపదికి వలువలు అందించే ఘట్టాన్ని తమ ప్రమోషన్‌కు వాడుకుందనేది మింత్రాపై వినిపిస్తున్న ఆరోపణ. ఈ కారణంతోనే హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మింత్రా వ్యవహరించిందని.. కాబట్టి తక్షణమే దానిని అన్‌-ఇన్‌స్టాల్‌ చేయాలని విమర్శలు వినిపిస్తున్నాయి.

ఈ మేరకు ఉదయం నుంచి విపరీతమైన పోస్టులు ట్విటర్‌లో కనిపిస్తుండడంతో.. ట్రెండింగ్‌లోని వచ్చింది.  అయితే ఈ పోస్ట్‌ కొత్తది కాదు. మింత్రా డిజైన్‌ చేసింది అంతకన్నా కాదు. 

2016లోనే ఈ ఫేక్‌ పోస్ట్‌ వైరల్‌ అయ్యింది. ఆ టైంలోనే స్పందించిన మింత్రా.. అలాంటి ఆర్ట్‌ వర్క్‌ను తాము సృష్టించలేదని, ఎండోర్స్‌ కూడా చేయలేదని స్పష్టం చేసింది. ఇప్పుడు మళ్లీ హిందుత్వఅవుట్‌లౌడ్‌( @hindutvaoutloud) అనే ఇన్‌స్టాగ్రామ్‌ పేజీ నుంచి ఈ పోస్ట్‌ అప్‌లోడ్‌ అయ్యింది. కొందరు మింత్రాకు మద్దతుగా ఈ ఫేక్‌ ఓల్డ్‌ పోస్ట్‌పై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement