Fact Check On JDS Leader Photos Viral Amid Hijab Issue: న్యాయస్థానాలకు చేరిన హిజాబ్ వ్యవహారంపై విచారణ నడుస్తోంది. మరోవైపు కర్ణాటకలో ఈ అంశంపై వేడి చల్లారేలా కనిపించడం లేదు. సినీ ప్రముఖుల దగ్గరి నుంచి మేధావుల దాకా ప్రతీ ఒక్కరూ ఈ అంశంపైనే చర్చిస్తుండడం చూస్తున్నాం. ఈ క్రమంలో రాజకీయ విమర్శలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. జేడీఎస్ సభ్యురాలు నజ్మా నజీర్ చిక్కనెరలేకు సంబంధించిన ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతూ.. దుమారం రేపుతున్నాయి.
హిజాబ్ అభ్యంతరాల వ్యవహారంపై పోరాడుతున్న వాళ్లలో జనతా దళ్ సెక్యులర్ పార్టీకి చెందిన నజ్మా కూడా ఉన్నారు. అయితే ఆమె అసలు రూపం ఇదంటూ ఇంటర్నెట్లో కొన్ని ఫొటోలు వైరల్ అవుతున్నాయి. బుర్ఖా, హిజాబ్ ధరించడం తమ హక్కు అంటూ వాదిస్తున్న ఆమె.. అవి లేకుండానే తిరుగుతుందని, పైగా హాట్ హాట్ ఫొటోలను సైతం అప్లోడ్ చేస్తుందంటూ గౌరవ్ మిశ్రా అనే ట్విటర్ అకౌంట్ నుంచి కొన్ని ఫొటోలు కనిపించాయి. రియల్ హిజాబ్ వారియర్, ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచే ఈ ఫొటోలు తీశాం అంటూ గురురాజా అనే ట్విటర్ అకౌంట్ నుంచి సెటైరిక్ పోస్టుగా అవి వైరల్ అయ్యాయి. అలా నజ్మా నజీర్‌ను సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు.
Pic 1: Alleged Sherni In Burqa & Hijab
— Gaurav Mishra 🇮🇳 (@IamGmishra) February 9, 2022
Pic 2: She is not part of Tukde Tukde Gang
Pic 3 & 4: Ofcourse she is not politically Motivated#HijabBan pic.twitter.com/5kcbfgDSyM
నజ్మా నజీర్ ఒక కాలేజీ స్టూడెంట్. 2018లో ఆమె తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుంది. కాలేజీ టైం నుంచే ఆమె పలు ఉద్యమాల్లో పాల్గొంటూ.. ఇప్పుడు జేడీఎస్ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. హిజాబ్ పేరిట వైరల్ అవుతున్న ఆమె ఫొటోలు అన్నీ మార్ఫింగ్ ఫొటోలని తేలింది ఇప్పుడు. రెడ్ కలర్ టాప్‌లో ఉన్న అమ్మాయి అసలు పేరు తన్యా జేనా. ఆమె ఇన్స్టాగ్రామ్ మోడల్. 2019లో ఆమె తన ఫొటోను అప్లోడ్ చేయగా.. ఆ ఫొటోను మార్ఫ్ చేసి.. నజ్మాను బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
Nazma nazeer 😂ಹಿಜಾಬ್ ಹೋರಾಟಗಾರ್ತಿಯ ನಿಜ ರೂಪ ,, ಇದನ್ನು ಎಡಿಟ್ ಎಂದು ಕಾಮೆಂಟ್ ಮಾಡುವವರೇ ಅವಳ Instagram ನಿಂದ ಇದನ್ನು ತೆಗೆಯಲಾಗಿದೆ 🙊🙉🙈🐵, pic.twitter.com/rBuWVI2gik
— Gururaja M K (@AmansurajGuru) February 6, 2022
ఇక ఫేస్బుక్లో నజ్మా నజీర్ చిక్కనెరాలె పేరుతో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. కొంతమంది తప్పుడు ప్రచారంతో నా క్యారెక్టర్‌ను దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారు’ అంటూ కన్నడలో పోస్ట్ చేసింది. ఇదిలా ఉండగా.. హిజాబ్ అంశానికి సంబంధించి.. ఆరుగురు అమ్మాయిల ఫొటోలు, ఫోన్ నెంబర్లు ఇంటర్నెట్లో దర్శనమివ్వడంపై.. వాళ్ల పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. మరోవైపు ఈ అంశానికి సంబంధించి ఫేక్ ఫొటోలు, వీడియోలు సైతం వైరల్ అవుతుండడం.. కలవర పెడుతోంది.
FactCheck..చివరగా.. నజ్మా నజీర్ తప్పుడు ఉద్దేశంతోనే ‘హిజాబ్’ ఎజెండాను ముందుకు నడిపిస్తోందని, ఈ విషయంలో ఆమె సరిగ్గా లేదన్నది సోషల్ మీడియా పోస్ట్‌ల సారాంశం. కానీ, వైరల్ పోస్ట్‌లు వాస్తవానికి మార్ఫింగ్ చేసిన చిత్రాలు. పైగా ఆమె ఒక కాలేజీ స్టూడెంట్, ఉద్యమాన్ని తప్పుదోవ పట్టిస్తోందన్న వాదనా అర్థరహితం అని ఆమె వాదిస్తున్నారు.
అబద్ధం అబద్ధమే..
ఇస్లాంలో కొందరు అమ్మాయిలు బయటకు రాకపోవడం వల్ల సరిగా మాట్లాడలేకపోతున్నారు. కానీ, మౌనంగా భరించాల్సిన అవసరం లేదు. రాజ్యాంగం, హక్కులు.. వేటి గురించి అయినా మాట్లాడొచ్చు. గట్టిగా బదులు ఇచ్చేందుకు కన్నడ, ఆంగ్లం.. ఎలాంటి భాషైనా ఫర్వాలేదు. అబద్ధం ఎప్పుడూ అబద్ధమే. తనలాంటి వారెవరైనా ఇలాంటి వ్యవహారాలను భరించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారామె. నిజం ఎప్పుడూ నిజమే. తన క్యారెక్టర్‌ను దిగజార్చి తక్కువ చూపించేందుకు కొందరు ప్రయత్నించినా.. బాధ్యతగల మీడియా తన గౌరవాన్ని కాపాడిందని, అందుకు కృతజ్ఞతలు అని ఫేస్బుక్ ఒక పోస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment