ఫేక్‌ పోస్టులపై సీఐడీ విచారణ | CID investigation on fake posts Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఫేక్‌ పోస్టులపై సీఐడీ విచారణ

Published Fri, Sep 23 2022 6:30 AM | Last Updated on Fri, Sep 23 2022 7:00 AM

CID investigation on fake posts Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి :  ఉద్దేశపూర్వకంగా సోషల్‌ మీడియాలో ఒక ఉన్నతాధికారిపై దుష్ప్రచారానికి పాల్పడుతున్న గుంటూరు జిల్లాకు చెందిన కొల్లు అంకబాబును గురువారం సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పన్ను ఎగవేతకు పాల్పడుతూ ఓ మహిళ విదేశాల నుంచి బంగారాన్ని అక్రమంగా తీసుకువస్తుండగా, కేంద్ర డీఆర్‌ఐ అధికారులు ఇటీవల గన్నవరం విమానాశ్రయంలో గుర్తించారు.

దీనితో ఏమాత్రం సంబంధంలేని ఒక ఉన్నతాధికారికి ఈ ఉదంతాన్ని ఆపాదిస్తూ కొల్లు అంకబాబు సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. దీనిపై ఫిర్యాదు అందడంతో సీఐడీ సైబర్‌ క్రైమ్‌ విభాగం అధికారులు కేసు నమోదు చేశారు. ఆ పోస్టులు పెట్టిన అంకబాబును అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement