ట్రంప్పై టెక్ లీగల్ వార్ షురూ! | Google, Apple, Microsoft, others file legal action against Donald Trump’s travel ban | Sakshi
Sakshi News home page

ట్రంప్పై టెక్ లీగల్ వార్ షురూ!

Published Mon, Feb 6 2017 5:11 PM | Last Updated on Sat, Aug 25 2018 7:50 PM

ట్రంప్పై టెక్ లీగల్ వార్ షురూ! - Sakshi

ట్రంప్పై టెక్ లీగల్ వార్ షురూ!

శాన్ఫ్రాన్సిస్కో :
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై  టెక్ దిగ్గజాల లీగల్ వార్ షురూ అయింది. ట్రంప్ ట్రావెల్ బ్యాన్కు వ్యతిరేకంగా మైక్రోసాఫ్ట్, యాపిల్, గూగుల్ వంటి 97 టెక్నాలజీ దిగ్గజాలు అమెరికా కోర్టులో మోషన్ రూపంలో ఫిర్యాదు దాఖలు చేశాయి. ట్రంప్ ఇమ్మిగ్రేషన్ ఆర్డర్ చట్టాలకు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉందని టెక్ దిగ్గజాలు ఈ ఫిర్యాదులో పేర్కొన్నాయి. అప్పీల్స్ కోర్టు తొమ్మిదవ సర్క్యూట్లో ఈ మోషన్ను టెక్ కంపెనీలు ఆదివారం దాఖలు చేశాయని సీఎన్ఎస్ మనీ రిపోర్టు చేసింది. ఇదే కోర్టులో ఆదివారం ట్రంప్కు ఎదురుదెబ్బ తగిలింది. ఇమ్మిగ్రేషన్, ఆర్థిక వృద్ధి ఒకదానికొకటి ముడిపడి ఉంటాయని లీగల్ బ్రీఫింగ్లో పేర్కొన్నాయి.. ట్రంప్ ఆదేశాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభను ఆకట్టుకోవడాన్ని దెబ్బతీస్తుందని టెక్ కంపెనీలు చెప్పాయి.
 
అయితే ట్రంప్ బ్యాన్పై టెక్ కంపెనీలు ఫైల్ చేసిన లీగల్ పిటిషన్ ఇదే మొదటిది కాదు. అంతకముందే అమెజాన్, ఎక్స్పీడియాలు వాషింగ్టన్ అటార్నీ జనరల్స్ దావాలో తమ మోషన్స్ పిటిషన్లను ఫైల్ చేశాయి. ఇమ్మిగ్రేషన్ ఆర్డర్లు తమ ఉద్యోగులు, బిజినెస్లపై ప్రభావం చూపుతాయని ఆ కంపెనీలు పేర్కొన్నాయి.  ట్రంప్ జారీచేసిన వివాదాస్పదమైన ఈ  ఆర్డర్పై టెక్ కంపెనీలు చాలా గుర్రుగా ఉన్నాయి. ట్రంప్ను న్యాయపరంగా విచారణకు ఎదుర్కోవాలని టెక్ దిగ్గజాలు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ట్రంప్ తాత్కాలిక ఈ ట్రావెల్ బ్యాన్ ఏడు ముస్లిం దేశాలపై ప్రభావం చూపనుంది. ఇరాన్, ఇరాక్, లిబియా, సోమాలియా, సుడాన్, సిరియా, యెమెన్ దేశాల పౌరులను తాత్కాలికంగా అమెరికాలోకి రాకుండా ఈ ట్రావెల్ బ్యాన్ను ట్రంప్ జారీచేశారు. దీనిపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి.

ట్రంప్ ట్రావెల్ బ్యాన్కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసిన టెక్ దిగ్గజాలు..
AdRoll
Aeris Communications
Airbnb
AltSchool, PBC
Ancestry.com
Appboy
Apple
AppNexus
Asana
Atlassian Corp
Autodesk
Automattic
Box
Brightcove
Brit + Co
CareZone
Castlight Health
Checkr
Chobani
Citrix Systems
Cloudera
Cloudflare
Copia Institute
DocuSign
DoorDash
Dropbox
Dynatrace
eBay
Engine Advocacy
Etsy
Facebook
Fastly
Flipboard
Foursquare Labs
Fuze
General Assembly
GitHub
Glassdoor
Google
GoPro
Harmonic
Hipmunk
Indiegogo
Intel
Jand, Inc. doing business as Warby Parker
Kargo Global
Kickstarter, PBC
Kind
Knotel
Levi Strauss & Co.
LinkedIn
Lithium Technologies
Lyft
Mapbox
Maplebear Inc. d/b/a Instacart
Marin Software
Medallia
A Medium Corporation
Meetup
Microsoft
Motivate International
Mozilla
Netflix
Netgear
NewsCred
Patreon
PayPal Holdings
Pinterest
Quora
Reddit
Rocket Fuel
SaaStr
Salesforce.com
Scopely
Shutterstock
Snap
Spokeo
Spotify USA
Square
Squarespace
Strava
Stripe
SurveyMonkey
TaskRabbit
Tech:NYC
Thumbtack
Turn
Twilio
Twitter
Turn
Uber Technologies
Via
Wikimedia Foundation
Workday
Y Combinator Management
Yelp
Zynga

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement