ఆరోపణలు చేస్తే పరువు నష్టం దావా వేస్తా: కొత్తపల్లి గీత
Published Mon, Apr 21 2014 6:10 PM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM
విశాఖ: ప్రత్యర్థులు ఎవరైనా ఆరోపణలు చేస్తే వారిపై పరువునష్టం దావా వేస్తానని అరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ అభ్యర్థి కొత్తపల్లి గీత హెచ్చరించారు. నామినేషన్ స్క్రూటినీ సందర్భంగా అడ్డతీగల ఎమ్మార్వో ఎస్టీనని ధృవీకరించారని కొత్తపల్లి గీత తెలిపారు. ఎమ్మార్వో ధృవీకరించినా తనపై ఆరోపణలు చేస్తే తాను చట్టపరమైన చర్యలు తీసుకుంటానన్నారు.
నేను ఎస్టీ వాల్మీకి కులస్తురాలినని, 2002లోనే ఎస్టీనని హైకోర్టు తీర్పు ఇచ్చిందనే విషయాన్ని కొత్తపల్లి గీత స్పష్టం చేశారు. రాజకీయంగా లబ్ది పొందడానికి తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని ఆమె అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అరకు అభ్యర్థి కొత్తపల్లి గీత ఎస్టీ కాదని ప్రత్యర్ధులు తప్పుడు ఆరోపణలు చేయడంపై ధీటుగా స్పందించారు.
Advertisement
Advertisement