ఖమ్మం జిల్లా కేంద్రంలోని కృష్ణవేణి జూనియర్ కళాశాల హాస్టల్లో ఉప్పల సంధ్యారాణి(16) అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్ గదిలో ఎవరూ లేని సమయం చూసి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.
సంధ్యారాణి స్వగ్రామం ఖమ్మం జిల్లా కల్లూరు మండలం మిట్టపల్లి గ్రామం. విషయం తెలుసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు ఖమ్మం బయలుదేరారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.