
లెక్చరర్స్ కాలనీలో చైన్‌స్నాచింగ్
హైదరాబాద్‌సిటీ: హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని లెక్చరర్స్ కాలనీలో చైన్‌స్నాచింగ్ జరిగింది. బోనాలపండగ సందర్భంగా బంధువుల ఇంటికి వచ్చిన సంధ్యా రాణి అనే మహిళ నడుచుకుంటూ వెళ్తుండగా మెడలో ఉన్న 3 తులాల మంగళ సూత్రాన్ని, మరో తులం బంగారు గొలుసును ఇద్దరు దొంగలు లాక్కెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.