కృష్ణాజిల్లా కంకిపాడు మండలం ఈడుపుగల్లు చైతన్య కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఎంసెట్ మెడికల్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థిని చంద్రకా నాగమణి శనివారం మధ్యాహ్నం కళాశాల క్లాస్ రూమ్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అనంతపురం జిల్లాకు చెందిన నాగమణి చైతన్య కాలేజీలోని వసతి గృహంలో ఉంటూ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటోంది.