gosala
-
చైతన్య కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య
-
చైతన్య కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య
సాక్షి, విజయవాడ : కృష్ణాజిల్లా కంకిపాడు మండలం ఈడుపుగల్లు చైతన్య కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఎంసెట్ మెడికల్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థిని చంద్రకా నాగమణి శనివారం మధ్యాహ్నం కళాశాల క్లాస్ రూమ్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అనంతపురం జిల్లాకు చెందిన నాగమణి చైతన్య కాలేజీలోని వసతి గృహంలో ఉంటూ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటోంది. మరోవైపు పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అలాగే ఘటనా స్థలంలో సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చంద్రికా నాగమణి రాసిన సూసైడ్ లేఖలో కీలక సమాచారం ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అలాగే విద్యార్థిని తల్లిదండ్రులకు పోలీసులు ఆత్మహత్య సమాచారం అందించారు. ఆత్మహత్య ఘటనపై విచారణకు ఆదేశం విద్యార్థిని చంద్రికా నాగమణి ఆత్మహత్య ఘటనపై మంత్రి గంటా శ్రీనివాసరావు విచారణకు ఆదేశించారు. ఆమె మృతిపట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇటువంటి సంఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నా...విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర దిగ్ర్భాంతి కలిగించిందన్నారు. ఈ సంఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఇంటర్మీడియెట్ బోర్డు కమిషనర్‌కు మంత్రి ఆదేశాలు ఇచ్చారు. -
గోశాల షాపుల ‘గలీజు’
రూ. 15.72 లక్షలు గోల్మాల్ కమిటీ రద్దయినా నేటికీ దందా కొనసాగిస్తున్న సభ్యులు సభ్యులే బినామీల పేరుతో షాపుల కైవసం నెల అద్దె రూ 6500, కట్టేది రూ.1000 కాకినాడ రూరల్ : కాకినాడ జంతుహింస నివారణ సంఘంలో గో సంరక్షణ పేరుతో రూ. లక్షలకు లక్షలు దోచేశారు. గోవులపై వ్యాపారం చేస్తున్నారని, కమిటీని పూర్తిస్థాయిలో రద్దు చేసి, వారిపై విచారణ చేస్తే అసలు విషయం బయటకు వస్తుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేసిన విషయం నేడు నిజమైంది. శనివారం సాయంత్రం ఆర్డీవో ఎల్.రఘుబాబు అధ్యక్షతన షాపుల లీజుదారుల సమావేశంలో అనేక ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. షాపు యజమానులు చెప్పే వివరణలు విన్న అధికారులు షాకయ్యారు. తాము ఒక్కొక్క షాపునకు నెలకు రూ. 6,500 చొప్పున పది నెలలు అడ్వాన్సుగా రూ. ఒక్కొక్కరు రూ. 65,000, నెలకు రూ. 6,500 చొప్పున అద్దె చెల్లిస్తున్నామని స్పష్టం చేశారు. అధికారులు రికార్డులను పరిశీలించగా ఒక్కొక్క షాపునకు నెలకు కేవలం రూ. వెయ్యి వంతున మాత్రమే చెల్లించినట్టు నిర్ధారణ కావడంతో ఆశ్చర్యపోవడం అధికారుల వంతయ్యింది. దాదాపుగా లీజుల పేరుతో రూ. 15.72 లక్షలు గోల్మాల్ అయ్యిందని అధికారులు గుర్తించారు. లీజు పేరు రద్దయిన కమిటీ సభ్యులు షాపుల యజమానులపై దందాలు కొనసాగిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. గత కమిటీలో ఎవరైనా షాపు యజమానులను బెదిరించి లీజు రూపంలో డబ్బులు వసూలు చేస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆర్డీవో రఘుబాబు హెచ్చరించారు. ఇటీవల గోవులు మృత్యువాత సంఘటన నేపథ్యంలో కలెక్టర్ కార్తికేయమిశ్రా పాత కమిటీని రద్దు చేసి కొత్తగా కమిటీ చైర్మన్‌గా ఆర్డీవో ఎల్ రఘుబాబును నియమించిన సంగతి తెలిసిందే. గో సంరక్షణకు వీలుగా చర్యలు తీసుకునే భాగంగా ఆర్డీవో షాపులను లీజులకు తీసుకున్న లీజుల గో సంరక్షణకు నిధులు పేరుతో 12 షాపులతో ప్రత్యేక షాపింగ్ కాంప్లెక్‌ను నిర్మించారు. గో సంరక్షణ ఎలా ఉన్నా, దానిపై పెత్తనం చెలాయించే నాయకులకు మాత్రం ఈ కాంప్లెక్ బంగారు బాతుగా మారింది. నిబంధనలకు అనుగుణంగా కమిటీ సభ్యులే షాపులను వ్యాపారాలకు తీసుకొని, మళ్లీ బినామీల పేరుతో మరొకరు వ్యాపారం చేసుకునేందుకు ఇచ్చేశారు. వారి నుంచి పదిరెట్లు డబ్బులు వసూలు చేసి దోచేశారు. గోవుల మృత్యుఘోష సమయంలో ప్రజలు నుంచి కమిటీపై దుమారం వచ్చినా అధికారులు పెద్దగా స్పందించలేదు. తరువాత కలెక్టర్ మిశ్రా స్వయంగా జంతు హింస నివారణ సంఘాన్ని పరిశీలించి కమిటీ సభ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. దీంతో 13 మంది సభ్యులపై సర్పవరం పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. వారు చేసిన అరాచకాలు ఒక్కొక్కటి బయటకు రావడంతో అధికారులు ఆశ్చర్యపోతున్నారు. వీరి నుంచి షాపులు లీజు రూపంలో దోచేసిన సొమ్మును రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తామని ఆర్డీవో రఘుబాబు స్పష్టం చేశారు. గోవుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు ప్రస్తుతం జంతు హింస నివారణ సంఘంలో 123 గోవులు ఉన్నాయని, వీటిలో రెండు పశువులు నీర్సంగా ఉండడంతో వైద్యం అందిస్తున్నట్లు ఆర్డీవో రఘుబాబు వివరించారు. ఎవరైనా పశువులకు దానా రూపంలోనే విరాళాలు అందజేయాలని సూచించారు. ఎవరు ఏమీ ఇచ్చినా వాటికి సంబంధించి రశీదు పొందాలన్నారు. ప్రస్తుతం ఉన్న గోవుల సంరక్షణకు వీలుగా కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. షాపులకు సంబంధించిన లీజులను కూడా పెంచే ఆలోచన ఉన్నట్లు తెలిపారు. ఇకపై గతంలో లీజులు తీసుకున్న వారిని తొలగిస్తామని, నేరుగా షాపు యజమానులకే లీజు కేటాయించి, ఆ సొమ్ములను నెల, నెలా జంతుహింస నివారణ సంఘం పేరుతో ఏర్పాటు చేసిన బ్యాంకు ఖాతాకు జమ అయ్యేలా చర్యలు తీసుకుంటామని ఆర్డీవో రఘుబాబు స్పష్టం చేశారు. పశుసంవర్ధకశాఖ జేడీ వెంకటేశ్వరరావు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
షరతులపై ఉచితంగా గోశాల గిత్తదూడలు
-సోమవారం తొమ్మిది జతలు రైతులకు అందజేత -సరిగా సాకకపోతే దేవస్థానం స్వాధీనం చేసుకునే అవకాశం అన్నవరం :రత్నగిరి దిగువన దేవస్థానం గోశాలలో గల గిత్తదూడలను రైతులకు ఉచితంగా అందచేస్తున్నారు. సోమవారం తొమ్మిది జతల దూడలను వివిద గ్రామాల రైతులకు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన దేవస్థానం ఏసీ ఈరంకి జగన్నాథరావు విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం గోశాలలో ఉన్న 12 జతల గిత్త దూడలను తీసుకువెళ్లేందుకు దరఖాస్తులు కోరగా 11 మంది రైతులు ధరఖాస్తు చేసుకున్నారని, వారిలో తొమ్మిది మందిని ఎంపిక చేసి అందజేశామని తెలిపారు. ఎనిమిదేళ్ల క్రితం ఈ విధంగా కొన్ని గిత్తదూడలను రైతులకు ఇవ్వగా తిరిగి ఇప్పుడు ఇచ్చామని తెలిపారు. ఏఈఓ సాయిబాబా, గోశాల సిబ్బంది పాల్గొన్నారు. ఇవీ షరతులు.. దూడలను తీసుకువెళ్లే వ్యక్తి చిరునామా తదితర వివరాలతో పాటు దేవస్థానం పెట్టిన షరతులన్నీ పాటిస్తానని స్టాంప్ పేపర్ మీద సంతకం చేసి దానిని నోటరీ చేయించి దేవస్థానానికి ఇవ్వాలి. దూడలను తీసుకునే రైతులు ఆరు నెలలకొకసారి వాటిని దేవస్థానం అధికారులకు చూపాలి. దూడలను సరిగా చూస్తున్నారో లేదో అని దేవస్థానం సిబ్బందికి అనుమానం వస్తే ఆకస్మికంగా తనిఖీ చేస్తారు. వాటిని సరిగా మేపకపోతే దేవస్థానం వాటిని స్వాధీనం చేసుకుంటుంది. దూడను కబేళాకు తరలించడం వంటివి చేస్తే ‘గోసంరక్షణ చట్టం’ ప్రకారం దేవస్థానం అధికారులు కేసు పెడతారు. ఈ షరతులన్నింటికీ అంగీకరిస్తేనే గిత్త దూడలను అందజేస్తారు. -
పాదగయ గోశాలకు రక్షణ కరువు
పిఠాపురం : స్థానిక పాదగయ కుక్కుటేశ్వరస్వామి దేవస్థానంలో గోశాలలో అప్పుడే పుట్టిన లేగదూడలు కుక్కల బారిన పడి ప్రాణాలు వదులుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాదగయ పుష్కరిణికి తూర్పు వైపున ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షెడ్లలో గోశాల నిర్వహిస్తున్నారు. వీటిలో సుమారు 16 గోవులు ఉన్నాయి. వీటి పోషణకు భక్తులు రూ.లక్షల్లో విరాళాలు సమర్పిస్తుంటారు. పలు పర్వదినాలలో సైతం ఈ గోవులకు పూజలు చేస్తుంటారు. రాత్రిళ్లు కాపలా ఉండేవారు నిర్లక్ష్యం వహిస్తుండడంతో కుక్కలు ఆలయ పరిసరాలు, గోశాలలోకి ప్రవేశించి లేగదూడలను పీక్కు తీనేస్తున్నాయి. ఇప్పటివరకూ మూడు దూడలు చనిపోయినట్టు గోసంరక్షణ సమితి సభ్యులు గుర్తించారు. ఈ విషయంపై ఆలయ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గోదాతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు లేగదూడల మరణాలపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుని గోవులకు రక్షణ కల్పించాలని భక్తులు కోరుతున్నారు. ఇది వాస్తవమే... ఈ విషయంపై ఆలయ ఈఓ చందక దారబాబును వివరణ కోరగా లేగదూడలను కుక్కలు పీక్కుతినడం వాస్తవమేనని అంగీకరించారు. ఈ విషయం తన దృష్టికి వచ్చిందని, విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్నారు. -
కొడుకును చంపిన మహిళ
కంకిపాడు : కొడుకును తల్లి కొట్టిచంపిన ఘటన స్థానికంగా తీవ్ర ప్రజాగ్రహాన్ని రేకెత్తించింది. వివరాల్లోకి వెళ్తే మహారాష్ట్రలోని చంద్రాపూర్‌కు చెందిన రేఖా నిషా (23) వివాహితురాలు. ఆమెకు ఇద్దరు సంతానం. మధ్యప్రదేశ్ మొజెలికి చెందిన రాజు రావత్ (20) అనే యువకునితో పరిచయమైంది. ఐదేళ్ల కొడుకును భర్త వద్దే వదిలి ఏడాది వయస్సున్న కొడుకు కునాల్‌ను తీసుకుని ప్రియుడు రాజురావత్తో కలిసి ఇల్లు విడిచి వచ్చేసింది. నెల రోజులు క్రితం పెనమలూరు మండలం గోసాల కట్ట వెంబడి పాత సంత రోడ్డులో ఒక మహిళ ఇంట్లో అద్దెకు దిగారు. కన్నకొడుకునుచంపి, ముళ్లపొదల్లో పడేసి సోమవారం ఉదయం రేఖ కొడుకు కునాల్ (రెండున్నరేళ్లు) కన్పించకపోవటంతో స్థానికులు ఆరా తీశారు. రేఖా, రాజులు పొంతన లేని సమాధానాలు చెప్పటంతో ఇద్దరినీ పట్టుకుని దేహశుద్ధి చేశారు. దీంతో అసలు విషయాన్ని బయటపెట్టారు. ఏడిపిస్తుండటంతో కొట్టానని, కొట్టడంతో తెల్లవారుఝామున చనిపోయాడని, కంకిపాడు–బొడ్డపాడు రోడ్డులోని కాలువ కట్ట పొదల్లో పిల్లాడ్ని పడేసి వచ్చామని తల్లి రేఖా చెప్పింది. రాజురావత్ పారిపోయి సమీపంలోని చెరుకు తోటల్లో దాక్కోవటంతో స్థానికులు వెంబడించి పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. కంకిపాడ–బొడ్డపాడు రోడ్డులో బందరు కాలువ కట్టపై ముళ్లపొదల్లో పడి ఉన్న బాలుడు కునాల్ మృతదేహాన్ని తల్లి రేఖా, రాజులు పోలీసులకు చూపారు. విజయవాడ ఈస్ట్‌జోన్ ఏసీపీ విజయభాస్కర్, ఎస్ఐ హనీష్‌లు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. దారుణం చూసి చెమ్మగిల్లిని కళ్లు పాలుగారే మోముతో ఉన్న బాలుడి మృతదేహం ముళ్లపొదల్లో అచేతనంగా పడి ఉండటాన్ని చూసిన ప్రతి ఒక్కరి కళ్లు చెమ్మగిల్లాయి. చీమలు పీక్కుతుంటూ, తలపై ఉన్న గాయాల నుంచి రక్తమోడుతుండటంతో అంతా తల్లడిల్లిపోయారు. స్థానికుల ఆగ్రహాన్ని గుర్తించిన పోలీసులు బాలుడి తల్లి రేఖ, రాజులను పీఎస్‌కు తరలించారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెద్దాసుపత్రికి తరలించారు. -
దుర్గగుడిలో గోవధపై విచారణ
విజయవాడ: దుర్గగుడి దేవస్థానానికి చెందిన గోశాలలో 21 గోవులు మృతి చెందడంపై విజయవాడలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం విచారణ జరగనుంది. ఉదయం 11 గంటలకు విచారణ ప్రారంభం కానుండగా.. అభ్యంతరాలు ఉన్నవారు ఎవరైనా హాజరు కావచ్చని అధికారులు పేర్కొన్నారు. కొన్ని రోజుల క్రితం మల్లికార్జునపేటలోని గోశాలలో ఆహారం విషతుల్యం కావడంతో 21 గోవులు మృతి చెందిన విషయం తెలిసిందే. -
25 సెంట్లు ఆలయ అభివృద్ధికి ఇవ్వండి
దుర్గగుడి అధికారుల విన్నపం గోశాల యాజమాన్యం తాత్సారం విజయవాడ : రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న దుర్గగుడి అభివృద్ధికి గోశాల అడ్డంకిగా మారింది. సుమారు రూ.50 కోట్ల వ్యయంతో నిర్మించిన రాజగోపురం, మల్లికార్జున మహామండపాన్ని ఇటీవల ప్రారంభించిన సంగతి తెలిసిందే. వీటిని భక్తులకు అందుబాటులోకి తేవాలంటే అర్జున వీధిని అభివృద్ధి చేయాలి. ఇందుకు గోశాల నుంచి కొంత స్థలం సేకరించాల్సి ఉంది. ఆ స్థలం కేటాయించాలంటూ దేవస్థానం అధికారులు మూడేళ్లుగా అడుగుతున్నప్పటికీ ఇవ్వకుండా గోశాల నిర్వాహకులు తాత్సారం చేస్తున్నారు. కొలిక్కిరాని చర్చలు అర్జున వీధిని అభివృద్ధి చేయడంతో పాటు ఇంద్రకీలాద్రిపై ఉన్న రాజగోపురానికి చేరుకోవడానికి మల్లికార్జున మహామండపానికి ర్యాంపులు వేయాలి. లేదంటే స్పీడ్ లిఫ్టులు ఏర్పాటుచేయాల్సి ఉంది. దీనికి గోశాలకు చెందిన 25 సెంట్ల స్థలం అవసరం అవుతుంది. దీని కోసం దేవస్థానం అధికారులు ఇప్పటికే పలు దఫాలుగా గోశాల నిర్వాహకులతో చర్చలు జరిపారు. ఇంకా ఒక కొలిక్కి రాలేదు. గోశాలకు చెందిన స్థలం ఇస్తే ప్రస్తుతం ఉన్న భూమి రేటు కంటే రెట్టింపు ఇస్తామని దేవస్థానం అధికారులు సూచించారు. గోసంరక్షణ సంఘం మెలిక.. గోశాల 78 సెంట్ల భూమిలో ఉంది. 28 సెంట్లు గోశాలకు చెందినది. వెనుకవైపు ఉన్న 50 సెంట్లు ఇరిగేషన్ శాఖది. దుర్గగుడి మెట్ల మార్గం వైపు ఉన్న 28 సెంట్ల స్థలాన్ని దేవస్థానానికి ఇస్తే.. ఇరిగేషన్ స్థలం తమకు ఇప్పించాలని అప్పట్లో గోశాల నిర్వాహకులు కోరారు. దీనికి అంగీకరించిన అప్పటి కలెక్టర్ నవీన్‌మిట్టల్, ఈవో చంద్రకుమార్‌తో పాటు పలువురు అధికారులు గోశాల యాజమాన్యంతో ఒక ఒప్పం దానికి వచ్చారు. దీని ప్రకారం ఇరిగేషన్ స్థలాన్ని గోశాలకు ఇప్పించాల్సి ఉంది. అయితే అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ స్థలం బదలాయింపు జరగలేదు. ఇప్పుడు దుర్గగుడి అభివృద్ధి కోసం గోశాలకు చెందిన 28 సెంట్ల స్థలాన్ని ఇచ్చేస్తే ఆవులకు అసలు స్థలం ఉండదని, గోశాల మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందని నిర్వాహకులు అంటున్నారు. ఆర్థికపరమైన విషయాలను పక్కనపెట్టి ఇరిగేషన్ స్థలం తమకు బదిలీ చేస్తే దేవస్థానానికి స్థలం తక్షణం ఇస్తామని గోశాల ప్రతినిధులు చెబుతున్నారు. గోశాల స్థలాన్ని బలవంతంగా తీసుకుంటే గోప్రేమికుల నుంచి తిరుగుబాటు వచ్చే అవకాశం ఉన్నందున సాధ్యమైనంత వరకు నిర్వాహకుల్ని ఒప్పించి తీసుకోవాలని అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది. గోశాల తరలిపోకుండా ఉండాలంటే ఇరిగేషన్ స్థలం ఇప్పించడి -
గోశాల తరలింపుపై హైకోర్టు స్టే
చిట్టినగర్ : గోశాల తరలింపుపై రాష్ర్ట హైకోర్టు స్టే ఇచ్చిందని విజయవాడ గోసంరక్షణ సంఘం అధ్యక్షుడు చింతలపూడి రఘురామ్ పేర్కొన్నారు. అర్జున వీధిలోని గోశాలలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేశారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత నెల 28న జరిగన ఘటనలో గోవులు మృతి చెందడంతో గోశాలను వెంటనే ఖాళీ చేయాలని సీపీ నోటీసులు ఇచ్చారన్నారు. దీనిపై తాము హైకోర్టును ఆశ్రయించగా గోశాలను యథాతథ స్థితిలో కొనసాగించాలని స్టే ఆర్డర్ ఇచ్చిందన్నారు. ప్రస్తుతం గోశాలలో 250 ఆవులు ఉండగా, 12 వందలకు పైగా గోవులు ఉన్నట్లు పోలీసులు భావించారన్నారు. గోవుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. సంఘ సెక్రటరీ కమల్ నాయన్ బంగ్, గోవింద్‌కుమార్ సాబూ, సురేష్‌కుమార్ జైన్, కె.మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 23 మంది కమిటీ సభ్యుల అరెస్టు గోవుల మృతి చెందిన ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలపై 23 మంది కమిటీ సభ్యులను వన్‌టౌన్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. కమిటీ అధ్యక్ష, కార్యదర్శులైన రఘురామ్‌తో పాటు కమల్‌జీలతో పాటు 23 మందిని అరెస్టు చేసి సొంత పూచికత్తుపై విడుదల చేసినట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. గోశాల పరిరక్షణ కోసం మౌన ప్రదర్శన గోశాల పరిరక్షణ కోసం శుక్రవారం సాయంత్రం గోశాల కమిటీ సభ్యులు, గో ప్రేమికులు మౌన ప్రదర్శన నిర్వహించారు. గోశాల నుంచి కాళేశ్వరరావు మార్కెట్ వరకు సాగింది. -
వారెవరు?
మిస్టరీగా గోవుల మృతి అర్ధరాత్రి గోశాలలోకి {పవేశించిన పదిమంది బలవంతంగా ఆవులకు పట్టిన ద్రావకమేంటి? నిజాలు దాచేస్తున్నారా? ‘సాక్షి’ టీవీ ఎక్స్‌క్లూజివ్ వీడియోలో రహస్యాలు మల్లికార్జునపేట గోశాలలో 17 ఆవుల మృతి వెనుక ఏదైనా కుట్ర దాగి ఉందా..? ఏప్రిల్ 28వ తేదీ అర్ధరాత్రి గోశాలలోకి గోడ దూకి ప్రవేశించిన గుర్తుతెలియని ఆ పదిమంది ఎవరు? వారంతా ఆవులకు పట్టిన ద్రావకం ఏమిటి? అవి తాగడం వల్లే ఆవులు మృతిచెందాయా? శుక్రవారం ‘సాక్షి’ టీవీకి మాత్రమే లభించిన గోశాల వీడియో పుటేజ్‌ను తిలకిస్తే ఈ అనుమానాలు రాకతప్పదు. బొంబాయి రవ్వ అధిక మోతాదులో తినడం వల్లే గోవులు చనిపోయాయని గోశాల నిర్వాహకులు, పశువైద్యులు పదేపదే చెబుతున్నా.. ఏదైనా విషాహారం తినడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందా..? లేక గోవులకు నాటువైద్యం ఏమైనా చేశారా.. అనే ప్రశ్నలతో గోమాతల మృతి మిస్టరీగా మారింది. - సాక్షి, విజయవాడ ఆ పదిమంది ఎవరు? ఏప్రిల్ 28వ తేదీ రాత్రి 9 గంటలకు అర్జునవీధిలో నుంచి దాదాపు పదిమంది గుర్తుతెలియని వ్యక్తులు గోడ దూకి గోశాలలోకి ప్రవేశించారు. అర్ధరాత్రి 12 గంటల వరకు అక్కడే ఉన్నట్టు వీడియో పుటేజ్ చూస్తే తెలుస్తోంది. ఈ పదిమంది వ్యక్తులు తమ వద్ద ఉన్న బాటిల్లోని ద్రావకాన్ని గోవులకు పట్టించినట్లు తెలుస్తోంది. వీరు గోశాలలోకి ప్రవేశించే సమయానికే కొన్ని ఆవులు నిద్రపోయాయి. వాటిని కూడా బలవంతంగా పైకిలేపి తాము తెచ్చిన పదార్థాన్ని పట్టిస్తున్నట్లు పుటేజ్‌లో రికార్డయింది. గోశాల ప్రయివేటు వ్యక్తుల ఆధ్వర్యంలో నడుస్తోంది. మేనేజర్ లావణ్య రాత్రి ఎనిమిది గంటలకు గోశాలకు తాళాలు వేయించి వెళ్లిపోతారు. ఆ తరువాత నిర్వాహకుల అనుమతి లేకుండా బయట వ్యక్తుల్ని అనుమతించరు. గోశాల తాళాలు వెంకటేశ్వర్లు, ఆంజనేయులు సిబ్బంది వద్దే ఉంటాయి. 28వ తేదీ లావణ్య వెళ్లిపోయిన తరువాత గోశాలలోకి ఎవరూ రాలేదని గోశాల అధ్యక్షుడు రఘురాం, సిబ్బంది చెబుతున్నా వీడియో పుటేజ్‌లో పదిమంది వ్యక్తులు సంచరిస్తున్నట్లు కనిపిస్తోంది. అర్ధరాత్రి వేళ పదిమంది వ్యక్తులు గోడ దూకి లోపలకు ఎందుకు రావాల్సి వచ్చింది? వారు నిర్వాహకుల అనుమతి లేకుండా లోపలికి వస్తుంటే రాత్రి కాపలా ఉన్నవారు ఎందుకు ఊరుకున్నారు? వారు తెచ్చిన ద్రావకం ఏంటి? దానిని గోవులకు తాగించడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నాటు వైద్యం చేశారా? బొంబాయి రవ్వ తిన్న గోవులు అనారోగ్యం పాలైతే వాటికి పశువైద్యులతో చికిత్స చేయించకుండా నిర్వాహకులే నాటు వైద్యం చేయించారని ప్రచారం జరుగుతోంది. గోశాలలో రాత్రిపూట సంచరించిన వ్యక్తుల చేతుల్లో ఉన్న బాటిల్స్ వంటివే గోశాల కార్యాలయంలోనూ ఉన్నాయి. అయితే, అవి నువ్వుల నూనె బాటిల్స్. గోవులకు ఆ రాత్రి నువ్వుల నూనె పట్టించారనే అనుమానం వస్తోంది. బొంబాయి రవ్వ తిన్న గోవులకు గ్యాస్ రావడంతో దాన్ని తగ్గించేందుకే నాటువైద్యం కింద నువ్వుల నూనె పట్టిస్తే అది వికటించి ఆవులు చనిపోయాయా? అనే అనుమానం వ్యక్తమవుతోంది. నిర్వాహకుల అనుమతితో వారు గోశాలలోకి వస్తే గోడ ఎందుకు దూకాల్సి వచ్చిందనే అనుమానమూ లేకపోలేదు. 28వ తేదీ గోవులకు నాటు వైద్యం చేసినట్టు పోలీసుల విచారణలో నిర్వాహకులు వెల్లడించకపోవడంపై సందేహాలు కలుగుతున్నాయి. నిర్వాహకులు వాస్తవాలను దాచి బొంబాయి రవ్వ విషయమే చెప్పారని సమాచారం. అనధికారికంగా వచ్చి ఉంటారు రోజూ రాత్రి 8 గంటలకు గోశాలకు తాళాలు వేసి వెళ్లిపోతాం. ఆ తరువాత నిర్వహకులకు ఏదైనా అవసరమైతే సమీపంలోనే ఉన్న వెంకటేశ్వరరావును పిలుస్తారు. 28వ తేదీ రాత్రి మేము తాళాలు వేసి వచ్చిన తరువాత గోశాలలోకి పదిమంది గోడ దూకి వచ్చినట్లు నాకు తెలియదు. నిర్వాహకుల అనుమతి లేకుండా రాత్రిపూట ఎవరినీ అనుమతించం. వారంతా అనధికారికంగానే వచ్చి ఉంటారు. - లావణ్య, గోశాల మేనేజర్ పొట్ట ఉబ్బరమైతే ఆయిల్ పట్టిస్తారు.. నూకలు, రవ్వలు, వండిన ఆహారం వంటి వాటిని ఆవులకు పెట్టకూడదు. వీటివల్ల కడుపులో ఆమ్లాలు ఉత్పత్తి అయ్యి అవి చనిపోయే ప్రమాదం ఉంది. అయితే, ఆవుల పొట్టలో గ్యాస్ తగ్గించేందుకు ఒక్కోసారి నాటువైద్యంగా నువ్వుల నూనె తాగిస్తుంటారు. - వి.ప్రసాద్, అసిస్టెంట్ డెరైక్టర్, పశువైద్యశాల -
మూగరోదన
60 ఆవులకు రెండు రోజులు నరకయాతన 17 మృతి, ఎనిమిదింటి పరిస్థితి విషమం గడువు తీరిన బొంబాయి రవ్వే కారణం గోశాలలో నిబంధనలు శూన్యం అడ్డూఅదుపులేని నిబంధనలు.. అందుబాటులో లేని సౌకర్యాలు.. అక్కరకు రాని వైద్యం.. మల్లికార్జునపేట గోశాల నిర్వహణ తీరును ప్రశ్నిస్తున్నాయి. తక్కువ రేటుకు వస్తుందన్న సాకుతో కాలంచెల్లిన బొంబాయిరవ్వను తినిపించిన కనికరం లేని మనుషుల మధ్య మూగజీవాలు నలిగిపోతున్నాయి. కలుషిత ఆహారం తిని 17 ఆవులు మృతిచెందిన ఘటన నేపథ్యంలో గోశాలలో కొన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. విజయవాడ : మల్లికార్జునపేటలో గో సంరక్షణ సంఘం ఆధ్వర్యంలో నడుస్తున్న గోశాలలో కలుషిత ఆహారం తిని 17 ఆవులు మృతిచెందిన ఘటన చర్చనీయాంశమైంది. సుమారు వందేళ్లుగా నడుస్తున్న ఈ గోశాలలో ఒకేసారి సుమారు 60 ఆవులు తీవ్ర అస్వస్థతకు గురికావడం, వాటిలో 17 చనిపోవడం, మరో ఎని మిదింటి పరిస్థితి విషమంగా ఉండటం గోప్రేమికులను కలవరపరుస్తోంది. మరో రెండు రోజులు గడిస్తే కానీ గోవులు పూర్తిగా కోలుకునే అవకాశం కనిపించడం లేదు. ఈ పాపం ఎవరిది? గోశాలలో మూడు షెడ్లలో 280 ఆవులు ఉన్నాయి. ఇందులో కొన్ని వయస్సు మళ్లినవి కాగా, కొన్ని సాధారణ, మరికొన్ని చూడి ఆవులు. సోమవారం ఉదయం భవానీ ట్రేడర్ నుంచి తెప్పించిన సుమారు 750 కేజీల బొంబాయిరవ్వను ఆవులకు మేతగా వేశారు. ఈ రవ్వను జనవరిలోగానే ఉపయోగించాల్సి ఉంది. గడువు తీరిన బొంబాయి రవ్వను అధిక మోతాదులో తినడం వల్లే మూగజీవాలు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాయి. మంగళవారం ఉదయానికే సుమారు 60 ఆవులు అస్వస్థతకు గురైనట్లు వెటర్నరీ వైద్యులు గుర్తించారు. 35 ఆవులు కనీసం లేచి నిలబడలేని పరిస్థితిలో ఉన్నాయి. కొన్ని ఆవులు కింద పడే ఉన్నాయి.. ఇంకొన్ని కళ్లు తేలేశాయి. ఉదయం నుంచి ఆహారం, నీరు ముట్టలేదు. దీంతో వెటర్నరీ వైద్యులు ఏడు బృందాలుగా ఏర్పడి వైద్యసేవలు అందించినా బుధవారం సాయంత్రం వరకు గోవులు నరకయాతన అనుభవిస్తూనే ఉన్నాయి. తీవ్రంగా అనారోగ్యం పాలైన 17 ఆవులు చనిపోయాయి. మిగిలిన ఆవులకు సెలైన్లు, గ్లూకోజ్‌లు అందించి కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. సుమారు 15 చూడి ఆవులు గర్భస్రావం అవుతాయేమోననే ఆందోళనలో వైద్యులు ఉన్నారు. ఈ ఘటనకు బాధ్యుడైన భవానీ ట్రేడర్స్ వ్యాపారి సాంబశివరావును వన్‌టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. తక్కువ ధరకు వస్తుందని గడువు ముగిసిన బొంబాయి రవ్వను గో సంరక్షణ సంఘం ప్రతినిధులు కొనుగోలు చేశారనే విమర్శలు వస్తున్నాయి. ఆహారంపై నిబంధనలు నిల్ నిత్యం అనేకమంది భక్తులు గోశాలకు వచ్చి గోవులకు కావాల్సిన మేత వేస్తుంటారు. దాతలు వేసే మేతపై ఎటువంటి నియంత్రణ లేదు. గోవులకు ఏవిధమైన ఆహారం ఇవ్వొచ్చు, ఏది ఇవ్వకూడదనే సూచనలు తెలియజేసే నోటీసు బోర్డులు గో సంరక్షణ కేంద్రంలో లేవు. వాస్తవానికి బొంబాయి రవ్వ, అన్నం, గంజి, స్వీట్లను ఆవులకు అధిక పరిమాణంలో ఇవ్వకూడదు. అయితే, కొంతమంది దాతలు గోవులకు స్వీట్లు, అన్నం పెడుతున్నట్లు సమాచారం. దాతలు ఇచ్చే ఆహారాన్ని నిర్వహకులు తనిఖీ చేయడం లేదు. అంబులెన్స్, వైద్య సలహాలు అంతంతమాత్రమే ఆవులకు అత్యవసర వైద్యం కోసం లబ్బీపేటలోని పశువైద్యశాలకు తీసుకువెళ్లాలంటే అంబులెన్స్ వంటి కనీస సౌకర్యం లేదు. దీంతో అస్వస్థతకు గురైన ఆవుల్ని అక్కడే ఉంచి వైద్యసేవలు అందిస్తున్నారు. ప్రతి మంగళవారం పశువైద్యుడు వచ్చి గోవులకు పరీక్షలు చేస్తారు తప్ప ఏయే వాతావరణ పరిస్థితుల్లో పశువులకు ఏవిధమైన ఆహారం ఇవ్వాలి అనే సూచనలు ఇస్తున్న దాఖాలాలు లేవు. వెంటి లేషన్, ఫ్లోరింగ్, దాణా తొట్లు, మురుగునీరు పోయే సౌకర్యాలు మాత్రం బాగానే ఉన్నాయి. కేసు మాఫీకి యత్నం 17 మూగజీవాల మరణానికి కారణంపై మంత్రి దేవినేని ఉమా విచారణకు ఆదేశాలు జారీ చేశారు. అయితే, ఇందుకు బాధ్యులైన వారిని శిక్షించే కంటే వారిని రక్షించేందుకే ఎక్కువ ప్రయత్నాలు జరుగుతున్నాయని, అందుకు కావాల్సిన నివేదికలు తయారవుతున్నాయని అధికార పార్టీలోనే జోరుగా ప్రచారం జరుగుతోంది.