కొడుకును చంపిన మహిళ | mother killed boy | Sakshi
Sakshi News home page

కొడుకును చంపిన మహిళ

Oct 17 2016 10:11 PM | Updated on Sep 4 2017 5:30 PM

కొడుకును చంపిన మహిళ

కొడుకును చంపిన మహిళ

కొడుకును తల్లి కొట్టిచంపిన ఘటన స్థానికంగా తీవ్ర ప్రజాగ్రహాన్ని రేకెత్తించింది. వివరాల్లోకి వెళ్తే మహారాష్ట్రలోని చంద్రాపూర్‌కు చెందిన రేఖా నిషా (23) వివాహితురాలు. ఆమెకు ఇద్దరు సంతానం.

కంకిపాడు :  కొడుకును తల్లి కొట్టిచంపిన ఘటన స్థానికంగా తీవ్ర ప్రజాగ్రహాన్ని రేకెత్తించింది. వివరాల్లోకి వెళ్తే  మహారాష్ట్రలోని చంద్రాపూర్‌కు చెందిన రేఖా నిషా (23) వివాహితురాలు. ఆమెకు ఇద్దరు సంతానం. మధ్యప్రదేశ్‌ మొజెలికి చెందిన రాజు రావత్‌ (20) అనే యువకునితో పరిచయమైంది. ఐదేళ్ల కొడుకును భర్త వద్దే వదిలి ఏడాది వయస్సున్న కొడుకు కునాల్‌ను తీసుకుని ప్రియుడు రాజురావత్‌తో కలిసి ఇల్లు విడిచి వచ్చేసింది. నెల రోజులు క్రితం పెనమలూరు మండలం గోసాల కట్ట వెంబడి పాత సంత రోడ్డులో ఒక మహిళ ఇంట్లో అద్దెకు దిగారు.  
కన్నకొడుకునుచంపి, ముళ్లపొదల్లో పడేసి
సోమవారం ఉదయం రేఖ కొడుకు కునాల్‌ (రెండున్నరేళ్లు) కన్పించకపోవటంతో స్థానికులు ఆరా తీశారు. రేఖా, రాజులు పొంతన లేని సమాధానాలు చెప్పటంతో ఇద్దరినీ పట్టుకుని దేహశుద్ధి చేశారు. దీంతో అసలు విషయాన్ని బయటపెట్టారు.  ఏడిపిస్తుండటంతో కొట్టానని, కొట్టడంతో తెల్లవారుఝామున చనిపోయాడని, కంకిపాడు–బొడ్డపాడు రోడ్డులోని కాలువ కట్ట పొదల్లో పిల్లాడ్ని పడేసి వచ్చామని తల్లి రేఖా చెప్పింది. రాజురావత్‌ పారిపోయి సమీపంలోని చెరుకు తోటల్లో దాక్కోవటంతో స్థానికులు వెంబడించి పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. కంకిపాడ–బొడ్డపాడు రోడ్డులో బందరు కాలువ కట్టపై ముళ్లపొదల్లో పడి ఉన్న బాలుడు కునాల్‌ మృతదేహాన్ని తల్లి రేఖా, రాజులు పోలీసులకు చూపారు. విజయవాడ ఈస్ట్‌జోన్‌ ఏసీపీ విజయభాస్కర్, ఎస్‌ఐ హనీష్‌లు ఘటనాస్థలాన్ని పరిశీలించారు.
దారుణం చూసి చెమ్మగిల్లిని కళ్లు
పాలుగారే మోముతో ఉన్న బాలుడి మృతదేహం ముళ్లపొదల్లో అచేతనంగా పడి ఉండటాన్ని చూసిన ప్రతి ఒక్కరి కళ్లు చెమ్మగిల్లాయి. చీమలు పీక్కుతుంటూ, తలపై ఉన్న గాయాల నుంచి రక్తమోడుతుండటంతో అంతా తల్లడిల్లిపోయారు. స్థానికుల ఆగ్రహాన్ని గుర్తించిన పోలీసులు బాలుడి తల్లి రేఖ, రాజులను పీఎస్‌కు తరలించారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెద్దాసుపత్రికి తరలించారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement