manhandle
-
కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్న ఎమ్మెల్యే
పుణె: మహారాష్ట్రకు చెందిన బీజేపీ శాసనసభ్యుడు సునిల్ కాంబ్లే విధుల్లో ఉన్న పోలీస్ కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్నారు. శుక్రవారం పుణె కంటోన్మెంట్‌లోని సస్సూన్ జనరల్ ఆస్పత్రిలో ఓ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, ఎమ్మెల్యే సునిల్ కాంబ్లే హాజరయ్యారు. కార్యక్రమం అనంతరం మెట్లు దిగి వస్తున్న ఎమ్మెల్యే కాంబ్లేకి కానిస్టేబుల్ ఎదురయ్యారు. దీంతో, ఎమ్మెల్యే ఆగ్రహంతో కానిస్టేబుల్ చెంప చెల్లుమనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. శనివారం బాధిత కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యేపై ఐపీసీ సెక్షన్ 353 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎమ్మెల్యే కాంబ్లే ఘటనపై స్పందిస్తూ.. నేను ఎవరిపైనా దాడి చేయలేదు. మెట్లుదిగి వస్తుండగా అడ్డుగా వచ్చిన ఒక వ్యక్తిని పక్కకు తోసేసి, ముందుకు వెళ్లానంతే’అని చెప్పారు. -
దత్తాత్రేయపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల దాడి
సిమ్లా: బీజేపీ సీనియర్ నాయకుడు, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయకు తీవ్ర పరాభవం ఎదురయ్యింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దత్తాత్రేయపై దాడి చేశారు. బడ్జెట్ స్పీచ్ అనంతరం బయటకు వెళ్తోన్న దత్తాత్రేయపై కాంగ్రెస్ ఎమ్మెల్యే దాడి చేశారు. శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ సందర్భంగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి సురేష్ భరద్వాజ్ మాట్లాడుతూ.. గవర్నర్ తన వాహనం వద్దకు వెళుతున్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆయనపై దాడి చేశారని తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ నెల 22 సోమవారం నాడు ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలని తీర్మానం ప్రవేశపెట్టారు. వీరిలో ప్రతిపక్ష నాయకుడు ముఖేష్ అగ్నిహోత్రి, ఎమ్మెల్యేలు హర్ష్ వర్ధన్ చౌహాన్, సుందర్ సింగ్ ఠాకూర్, సత్పాల్ రైజాదా, వినయ్ కుమార్ ఉన్నారు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా పడిన సభ నేడు తిరిగి ప్రారంభం అయ్యింది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు సభ సమావేశమైన వెంటనే ప్రతిపక్ష నేత ముఖేష్ అగ్నిహోత్రి నేతృత్వంలోని కాంగ్రెస్ సభ్యులు తమ సీట్ల నుంచి లేచి నినాదాలు చేశారు. గవర్నర్ అసెంబ్లీలో ప్రసంగం చివర్లో ఉండగా.. ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యులు ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దత్తాత్రేయ కారు వద్ద ఆందోళన చేస్తోన్న హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దాంతో గవర్నర్ తన ప్రసంగంలోని చివరి లైన్లను మాత్రమే చదివి, ప్రసంగం మొత్తం చదివినట్లుగా భావించాలని పేర్కొన్నారు. గవర్నర్ ప్రసంగంపై కాంగ్రెస్ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెల్లడించిన విషయాలన్ని అబద్ధాలని ఆరోపించారు. వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల సమస్యను ప్రసంగంలో చేర్చలేదన్నారు. స్పీచ్ ముగించిన అనంతర దత్తాత్రేయ తన కారు దగ్గరకు వెళ్తుండగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆయనపై దాడి చేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో కాంగ్రెస్ సభ్యుల ప్రవర్తనను ఖండించారు. ఇక గవర్నర్‌పై దాడి చేసిన ఎమ్మెల్యేలను మార్చి 20 వరకు సస్పెండ్ చేశారు. చదవండి: మంచుకొండల్లో ఎంజాయ్ చేసిన గవర్నర్ -
పోలీసులు నాపై చేయి చేసుకున్నారు
లక్నో పోలీసులు తనపై చేయి చేసుకున్నారని కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ ఆరోపించారు. సీఏఏ నిరసనల్లో పాల్గొన్నారనే ఆరోపణలతో రిటైర్డు ఐపీఎస్ అధికారి ఎస్ఆర్ దారాపురిని పోలీసులు అరెస్ట్‌చేశారు. ఆయన నివాసానికి ప్రియాంక శనివారం సాయంత్రం నాటకీయ ఫక్కీలో వెళ్లారు. ‘దారాపురి నివాసం వైపు వెళ్తుండగా పోలీసులు నా వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో వాహనం దిగి నడిచి వెళ్తుండగా ఓ మహిళా పోలీసు నా గొంతు పట్టుకుంది. మరొకరు నన్ను వెనక్కి నెట్టేయడంతో కింద పడిపోయా. మెడ పట్టుకుని పైకి లేపారు’ అని చెప్పారు. ‘వారి నుంచి తప్పించుకుని కొంతదూరం నడిచి, మరికొంతదూరం ద్వి చక్రవాహనంపై ప్రయాణం చేశా. పోలీసులకు తెలియకుండా చివరికి దారాపురి నివాసానికి చేరుకోగలిగా’ అని చెప్పారు. -
డిప్యూటీ సీఎం ముందే మీడియా సిబ్బందిపై..
పట్నా: ఉప ముఖ్యమంత్రి సాక్షిగా మీడియా ప్రతినిధులపై దాడి జరిగింది. ఆయన వ్యక్తిగత సిబ్బంది ముక్కుమొహం చూడకుండా మీడియా ప్రతినిధులపై పిడిగుద్దులు కుప్పించారు. ఈ ఘటన పట్నాలోని బిహార్ సెక్రటేరియట్ వద్ద చోటు చేసుకుంది. బిహార్‌లో అధికార జేడీయూకు మిత్రపక్షమైన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యుల మీద సీబీఐ అవినీతి కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. లాలూ కొడుకు అయిన ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఆయన ప్రజలకు నిజాలు చెప్పాలనీ, కేసులపై వివరణ ఇవ్వాలని జేడీయూ మంగళవారం డిమాండ్ కూడా చేసింది. ఈ నేపథ్యంలో బిహార్‌లో రోజురోజుకు రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారుతున్నాయి. తేజస్వి నుంచి రాజీనామాను కోరకపోయినా, దాదాపు అదే స్థాయిలో జేడీయూ స్పందించింది. దీంతో బుధవారం మధ్యాహ్నం తేజస్వీ యాదవ్ కోసం సెక్రటేరియట్ వద్ద మీడియా ప్రతినిధులు ఎదురుచూస్తూ ఆయన బయటకు వచ్చే సమయంలో ప్రశ్నించేందుకు యత్నించగా ఆయన వ్యక్తిగత సిబ్బంది మీడియా ప్రతినిధులపట్ల దురుసుగా ప్రవర్తించింది. వారిని ఈడ్చుకుంటూ బయటకు తీసుకెళ్లి దాడులు చేసింది. దీనిపై పలు మీడియా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సాక్షాత్తు డిప్యూటీ సీఎం ముందే ఇది జరుగుతున్నా ఆయన పట్టించుకోకుండా ఉండటంపట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. -
కొడుకును చంపిన మహిళ
కంకిపాడు : కొడుకును తల్లి కొట్టిచంపిన ఘటన స్థానికంగా తీవ్ర ప్రజాగ్రహాన్ని రేకెత్తించింది. వివరాల్లోకి వెళ్తే మహారాష్ట్రలోని చంద్రాపూర్‌కు చెందిన రేఖా నిషా (23) వివాహితురాలు. ఆమెకు ఇద్దరు సంతానం. మధ్యప్రదేశ్ మొజెలికి చెందిన రాజు రావత్ (20) అనే యువకునితో పరిచయమైంది. ఐదేళ్ల కొడుకును భర్త వద్దే వదిలి ఏడాది వయస్సున్న కొడుకు కునాల్‌ను తీసుకుని ప్రియుడు రాజురావత్తో కలిసి ఇల్లు విడిచి వచ్చేసింది. నెల రోజులు క్రితం పెనమలూరు మండలం గోసాల కట్ట వెంబడి పాత సంత రోడ్డులో ఒక మహిళ ఇంట్లో అద్దెకు దిగారు. కన్నకొడుకునుచంపి, ముళ్లపొదల్లో పడేసి సోమవారం ఉదయం రేఖ కొడుకు కునాల్ (రెండున్నరేళ్లు) కన్పించకపోవటంతో స్థానికులు ఆరా తీశారు. రేఖా, రాజులు పొంతన లేని సమాధానాలు చెప్పటంతో ఇద్దరినీ పట్టుకుని దేహశుద్ధి చేశారు. దీంతో అసలు విషయాన్ని బయటపెట్టారు. ఏడిపిస్తుండటంతో కొట్టానని, కొట్టడంతో తెల్లవారుఝామున చనిపోయాడని, కంకిపాడు–బొడ్డపాడు రోడ్డులోని కాలువ కట్ట పొదల్లో పిల్లాడ్ని పడేసి వచ్చామని తల్లి రేఖా చెప్పింది. రాజురావత్ పారిపోయి సమీపంలోని చెరుకు తోటల్లో దాక్కోవటంతో స్థానికులు వెంబడించి పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. కంకిపాడ–బొడ్డపాడు రోడ్డులో బందరు కాలువ కట్టపై ముళ్లపొదల్లో పడి ఉన్న బాలుడు కునాల్ మృతదేహాన్ని తల్లి రేఖా, రాజులు పోలీసులకు చూపారు. విజయవాడ ఈస్ట్‌జోన్ ఏసీపీ విజయభాస్కర్, ఎస్ఐ హనీష్‌లు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. దారుణం చూసి చెమ్మగిల్లిని కళ్లు పాలుగారే మోముతో ఉన్న బాలుడి మృతదేహం ముళ్లపొదల్లో అచేతనంగా పడి ఉండటాన్ని చూసిన ప్రతి ఒక్కరి కళ్లు చెమ్మగిల్లాయి. చీమలు పీక్కుతుంటూ, తలపై ఉన్న గాయాల నుంచి రక్తమోడుతుండటంతో అంతా తల్లడిల్లిపోయారు. స్థానికుల ఆగ్రహాన్ని గుర్తించిన పోలీసులు బాలుడి తల్లి రేఖ, రాజులను పీఎస్‌కు తరలించారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెద్దాసుపత్రికి తరలించారు. -
'నా భార్యకు స్వైన్‌ఫ్లూ.. దారి ఇవ్వండి ప్లీజ్'
థానే: 'నా భార్యకు స్వైన్‌ఫ్లూ.. దారి ఇవ్వండి ప్లీజ్' అంటూ ఓ వ్యక్తి థానేలో ఓ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద గట్టిగా అరిచాడు. ఎవ్వరూ పట్టించుకోలేదు. కోపంతో ఊగిపోయాడు. అక్కడే ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఓ మహిళా ట్రాఫిక్ పోలీసు కానిస్టేబుల్‌పై దాడి చేశాడు. ట్రాఫిక్‌ను క్లియర్ చేయడంలో అలసటత్వం ప్రదర్శించిందనే కారణంతో చేయిచేసుకున్నాడు. దీంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నాడు. ఓ అంబులెన్స్‌లో తన భార్యను ఆస్పత్రికి తీసుకెళుతున్న వ్యక్తి(పేరు ఇంకా తెలియరాలేదు) ట్రాఫిక్ సిగ్నల్ వద్ద భారీ మొత్తంలో వాహనాలు ఉండటం చూశాడు. అంబులెన్స్ సైరన్ ఇస్తున్నా అవి పక్కకు తప్పుకోలేదు. పైగా అక్కడే ఉన్న మహిళా కానిస్టేబుల్ వారికి సహకరించలేదు. తన భార్య స్వైన్‌ఫ్లూ అని, ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు దారిచ్చేలా చూడాలని ప్రాధేయపడ్డాడు. కానీ పరిస్థితి అక్కడ అంతగా అనుకూలంగా ఉండటకపోవడంతో ఆగ్రహానికి లోనైనా ఆ వ్యక్తిని ఆమెపై చేయిచేసుకున్నాడట.