టూవీలర్‌పై వెనుక కూర్చొని వెళ్తున్న ప్రియాంక
లక్నో పోలీసులు తనపై చేయి చేసుకున్నారని కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ ఆరోపించారు. సీఏఏ నిరసనల్లో పాల్గొన్నారనే ఆరోపణలతో రిటైర్డు ఐపీఎస్ అధికారి ఎస్‌ఆర్ దారాపురిని పోలీసులు అరెస్ట్‌చేశారు. ఆయన నివాసానికి ప్రియాంక శనివారం సాయంత్రం నాటకీయ ఫక్కీలో వెళ్లారు. ‘దారాపురి నివాసం వైపు వెళ్తుండగా పోలీసులు నా వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో వాహనం దిగి నడిచి వెళ్తుండగా ఓ మహిళా పోలీసు నా గొంతు పట్టుకుంది. మరొకరు నన్ను వెనక్కి నెట్టేయడంతో కింద పడిపోయా. మెడ పట్టుకుని పైకి లేపారు’ అని చెప్పారు. ‘వారి నుంచి తప్పించుకుని కొంతదూరం నడిచి, మరికొంతదూరం ద్వి చక్రవాహనంపై ప్రయాణం చేశా. పోలీసులకు తెలియకుండా చివరికి దారాపురి నివాసానికి చేరుకోగలిగా’ అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment