విజయవాడ: దుర్గగుడి దేవస్థానానికి చెందిన గోశాలలో 21 గోవులు మృతి చెందడంపై విజయవాడలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం విచారణ జరగనుంది. ఉదయం 11 గంటలకు విచారణ ప్రారంభం కానుండగా.. అభ్యంతరాలు ఉన్నవారు ఎవరైనా హాజరు కావచ్చని అధికారులు పేర్కొన్నారు. కొన్ని రోజుల క్రితం మల్లికార్జునపేటలోని గోశాలలో ఆహారం విషతుల్యం కావడంతో 21 గోవులు మృతి చెందిన విషయం తెలిసిందే.