లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని బహ్రాయిచ్‌లో దుర్గా విగ్రహ నిమజ్జన ఊరేగింపులో హింస చెలరేగింది. ఒక వర్గానికి చెందినవారు రాళ్లు రువ్వడంతో పాటు తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ యువకుడు మృతి చెందడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఈ సమయంలో జరిగిన తొక్కిసలాటలో పలువురు గాయపడ్డారు. ఈ ఘటన అనంతరం జిల్లాలోని పలు చోట్ల హిందూ సంస్థలు నిరసనలు చేపట్టాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసు అధికారులు ఘటనా స్థలంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు.
యూపీలోని బహ్రాయిచ్‌లో జరిగిన హింసాకాండపై జిల్లా ఎస్పీ వృందా శుక్లా మీడియాకు పలు వివరాలను అందించారు. ఈ ఉదంతంతో ప్రమేయమున్న 30 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, సల్మాన్ అనే నిందితుడి ఇంటి దగ్గర కాల్పులు జరిగాయని తెలిపారు. 22 ఏళ్ల యువకుడు రామ్ గోపాల్ మిశ్రా కాల్పుల్లో మృతిచెందాడన్నారు.
బహ్రాయిచర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, పోలీసు స్టేషన్ ఇన్‌ఛార్జి హార్ది, మహసీ పోలీస్ పోస్ట్ ఇన్‌చార్జితో సహా ఆరుగురు పోలీసుల నిర్లక్ష్యాన్ని గుర్తిస్తూ ఉన్నతాధికారులు వారిని సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ బహ్రాయిచ్‌లో చోటుచేసుకున్న ఘటనకు కారకులైనవారిని విడిచిపెట్టబోమని అన్నారు. నిందితులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.
ఇది కూడా చదవండి: రక్తమోడిన దేవరగట్టు
Comments
Please login to add a commentAdd a comment