బంగ్లాదేశ్‌: దుర్గాపూజలో చెలరేగిన హింస | Petrol Bomb Hurled at Durga Puja Pandal | Sakshi
Sakshi News home page

బంగ్లాదేశ్‌: దుర్గాపూజలో చెలరేగిన హింస

Oct 12 2024 8:36 AM | Updated on Oct 12 2024 9:51 AM

Petrol Bomb Hurled at Durga Puja Pandal

ఢాకా: బంగ్లాదేశ్‌లోని హిందువులు దుర్గాపూజలను ఘనంగా చేసుకుంటున్నారు. అయితే ఢాకాలోని ఒక ప్రాంతంలో జరుగుతున్న దుర్గాపూజలో హింస చెలరేగింది. దుర్గాపూజ మండపంపైకి కొంతమంది దుండగులు పెట్రోల్ బాంబులు విసిరారు. దీంతో భారీగా తొక్కిసలాట జరిగింది.

ఢాకాలోని తాటి బజార్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పెట్రోల్ బాంబులు విసిరిన అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ‘వాయిస్ ఆఫ్ బంగ్లాదేశ్ హిందూ’ పేరుతో సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియోలో గాయపడిన ఒక వ్యక్తిని ఆస్పత్రికి తరలించడాన్ని చూడవచ్చు.

బంగ్లాదేశ్‌లోని హిందువులను అవమానించే ఘటనలు జరుగుతున్నాయి. చిట్టగాంగ్‌లోని దుర్గా పూజ మండపంలోకి ‍ప్రవేశించిన కొందరు మరో మతానికి చెందిన పాటలు పాడారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం చిట్టగాంగ్‌లోని జేఎం సేన్ హాల్‌లో ఒక బృందం దుర్గాపాటలను పాడేందుకు పూజా కమిటీ సభ్యులు అనుమతి ఇచ్చారు. అయితే అవి వేరే వర్గానికి చెందిన పాటలని, స్థానిక హిందువులు ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

 



ఇది కూడా చదవండి: దుర్గాపూజ మండపంలో కలకలం

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement