![Inter Student commits Suicide AT Bachupally College Hostel - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2023/06/13/Suicide-AT-Bachupally-College-Hostel.jpg.webp?itok=n-oxZxww)
సాక్షి, మైదరాబాద్: బాచుపల్లి ఓ ప్రైవేట్ కాలేజీలో విషాదం చోటుచేసుకుంది. బాలికల క్యాంపస్ హాస్టల్‌లో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. మంగళవారం ఉదయం హాస్టల్ భవనం 5వ అంతస్తు నుంచి దూకి విద్యార్థిని వంశిక మృతి చెందింది.
కామారెడ్డి జిల్లాకు చెందిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న వంశిక.. వారం రోజుల క్రితమే క్యాంపస్‌లో చేరినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు హాస్టల్ వద్దకు చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. వంశిక ఆత్మహత్య చేసుకుందా?. ప్రమాదవశాత్తు కింద పడి చనిపోయిందా? అన్నది స్పష్టత లేదు. అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. మృతికి గల కారణలపై దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
చదవండి: శిరీషది హత్యా.. ఆత్మహత్యా?.. తెలంగాణ డీజీపీకి మహిళా కమిషన్ ఆదేశం
Comments
Please login to add a commentAdd a comment