![Actress Sukanya Prepared A Special Song For Ayodhya Sri Ram - Sakshi](/styles/webp/s3/article_images/2024/01/22/s.jpg.webp?itok=wOkYE8Qw)
సీనియర్ నటి సుకన్య దక్షిణాది సినీ ప్రేక్షకులకు సుపరిచితమే. తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో కథానాయకిగా పలు చిత్రాలలో నటించింది. ప్రస్తుతం ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కొనసాగుతున్నారు. ఇకపోతే సుకన్యలో నాట్య, సంగీత కళాకారిణి, గాయని, గీత రచయిత కూడా ఉన్నారనే విషయం చాలా మందికి తెలియదు. తాజాగా నటి సుకన్య శ‍్రీరాముని కోసం ఓ భక్తి గీతాన్ని రూపొందించింది. అయోధ్య శ్రీరామచంద్రుని ఆలయ నిర్మాణం సాకారమవుతున్న తరుణంలో ఈ విషయాన్ని ఆమె మీడియాకు వెల్లడించారు.
ఈ ఆలయం నిర్మాణం ప్రారంభించిన సమయంలో తన ముఖంపై గీసుకున్న శ్రీరామ్ అనే చిత్రలేఖనం అప్పట్లో సామాజిక మాధ్యమాల్లో విశేష ప్రాచుర్యం పొందిందన్నారు. తాజాగా 500 ఏళ్ల నాటి కల జనవరి 22న సాకారం కాబోతోన్న వేళ తాను రూపొందించిన జై శ్రీరామ్ భక్తిరస గీతాన్ని వీడియోగా విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. శ్రీరామ నామ మహిమ, ఆయన పరాక్రమం, రామాయణం కథను ఆవిష్కరించే విధంగా తాను రూపందిస్తున్న జై శ్రీరామ్ ఆడియోను ఆ శ్రీరాముని ఆలయ నిర్మాణంలో భాగంగా సమర్పిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment