అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. శ్రీరాములవారి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి దేశ నలుమూలల నుంచి పెద్ద ఎత్తున రాజకీయ, సినీ ప్రముఖులు, కళాకారులు, సాధువులు హాజరు కానున్నారు. జనవరి 22న జరగబోయే ఈ విశేష కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీ నుంచి రజనీకాంత్, చిరంజీవి, అమితాబ్ బచ్చన్, అజయ్ దేవ్‌గణ్, కంగనా రనౌత్, జాకీ ష్రాఫ్, టైగర్ ష్రాఫ్, రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, ధనుష్.. తదితరులకు ఆహ్వానాలు అందాయి.
మొన్న తండ్రికి, ఇప్పుడు తనయుడికి పిలుపు
తాజాగా రామ్‌చరణ్ దంపతులకు అయోధ్య వేడుకకు రమ్మని పిలుపు అందింది. ఆరెస్సెస్ నేత సునీల్ అంబేద్కర్.. హైదరాబాద్‌లోని రామ్‌చరణ్ నివాసానికి వెళ్లి ఆహ్వాన పత్రికను అందించారు. మరోవైపు హనుమాన్ చిత్రయూనిట్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. ప్రీమియర్ షోల ద్వారా వచ్చిన రూ.14.25 లక్షలను అయోధ్య రామమందిర నిర్మాణానికి విరాళంగా ఇచ్చింది.
ఎవరూ ఆకలితో వెళ్లకుండా
కాగా అయోధ్యలో జరగనున్న శ్రీరాముని పవిత్రోత్సవానికి వచ్చేవారు ఆకలితో వెనుదిరగకుండా ఉత్సవ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 45 ప్రాంతాల్లో భోజనశాలలు సిద్ధం చేస్తున్నారు. భక్తులకు వివిధ రాష్ట్రాల వంటకాలను అందుబాటులో ఉంచననున్నారు. శ్రీరాముడి కోసం 2.5 కిలోల బంగారు విల్లును సిద్ధం చేస్తున్నారు. విల్లు, బాణాలను రాములవారి విగ్రహానికి అలంకరించనున్నారు.
#RamCharan Received the Official Invitation at his Residence for Ram Mandir 🙏🛕pran pratishtha ceremony on Jan 22nd. Jai Shri Ram 🚩@AlwaysRamCharan @upasanakonidela pic.twitter.com/U73wamMfMD
— Trends RamCharan ™ (@TweetRamCharan) January 12, 2024
Comments
Please login to add a commentAdd a comment