
అయోధ్యలో రామాలయ నిర్మాణం, రామ విగ్రహ ప్రతిష్టాపన అనేవి వందల సంవత్సరాల నిరీక్షణకు కార్యరూపంగా భావిస్తున్నాను. ఇలాంటి ఒక చారిత్రాత్మక ఘట్టంలో పాలుపం
మెగాస్టార్ చిరంజీవికి భక్తి ఎక్కువ. నిత్యం ఏదో ఒక పూజ చేస్తూ భగవంతుడి సేవలో తరించిపోతుంటాడు. అలా ఎప్పుడూ ఆధ్యాత్మిక సేవలో మునిగిపోయే చిరంజీవికి అయోధ్య నుంచి ఆహ్వానం అందింది. చిరుతో పాటు ఆయన తనయుడు, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌కు సైతం జనవరి 22న అయోధ్యలో జరగబోయే రామవిగ్రహ ప్రతిష్టాపనకు రావాల్సిందిగా ఆహ్వాన పత్రికలు అందాయి.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. 'అయోధ్యలో రామాలయ నిర్మాణం, రామ విగ్రహ ప్రతిష్టాపన అనేవి వందల సంవత్సరాల నిరీక్షణకు కార్యరూపంగా భావిస్తున్నాను. ఇలాంటి ఒక చారిత్రాత్మక ఘట్టంలో పాలుపంచుకోవడం గొప్ప అదృష్టం. ఈ ఆహ్వానాన్ని నాకు అందజేసిన రామ జన్మభూమి ట్రస్టు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఇంత గొప్ప కార్యక్రమానికి నేను సతీసమేతంగా హాజరు అవుతున్నాను' అని తెలిపాడు.