50 ఏళ్ల వయసులో 'మళ్లీ పెళ్లి'.. సీనియర్ నటి క్లారిటీ | Actress Sukanya Denies Second Marriage Rumours - Sakshi
Sakshi News home page

Actress Sukanya: 'శ్రీమంతుడు' నటికి రెండో పెళ్లా?

Published Thu, Aug 24 2023 3:00 PM | Last Updated on Thu, Aug 24 2023 4:30 PM

Actress Sukanya Second Marriage Rumours - Sakshi

మిగతా వాళ్ల సంగతేమో గానీ సెలబ్రిటీలు ఏం చేసినా సరే అది వార్త అవుతూ ఉంటుంది. ఇక వాళ్లు రిలేషన్‌లో ఉన్నా, పెళ్లి చేసుకున్నా, విడాకులు ఇచ్చినా కూడా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది. అయితే పలు తెలుగు సినిమాల్లో తల్లి పాత్రలు చేస్తూ బిజీగా ఉన్న ఓ సీనియర్ నటి.. ఇప్పుడు రెండో పెళ్లికి సిద్ధమైందనే న్యూస్ తెగ వైరల్ అయింది.

పైన ఫొటోలో కనిపిస్తున్న నటి.. 'శ్రీమంతుడు' సినిమాలో మహేశ్‌కి తల్లిగా నటించింది. అయితే గతంలో ఈమె పలు తెలుగు, తమిళ సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. సహాయ పాత్రల్లోనూ మెప్పించింది. టాలీవుడ్‌లో పెద్దరికం, అమ్మకొడుకు, సాంబ, శ్రీ, మున్నా, అధినాయకుడు తదితర చిత్రాల్లో నటించింది. అయితే ఎక్కువగా మలయాళ మూవీస్‌తో ఫేమ్ తెచ్చుకుంది.

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్)

నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న టైంలోనే అంటే 2002లో సుకన్య.. శ్రీధరన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోయింది. ఏమైందో ఏమోగానీ ఏడాదిలోనే ఆయన‍్నుంచి విడిపోయి, తిరిగి స్వదేశానికి వచ్చేసింది. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. సౌత్ సినిమాల్లో సహాయ పాత్రలు చేస్తూ, మరోవైపు డబ్బింగ్ ఆర్టిస్టుగానూ ఫేమ్ తెచ్చుకుంది.

ప్రస్తుతం సుకన్యకు 50 ఏళ్లు. అయితే ఈమె త్వరలో పెళ్లి చేసుకోనుందనే రూమర్ బయటకొచ్చింది. ఇది ఆ నోట ఈ నోట పడి.. ఆమె వరకు చేరుకుంది. దీంతో ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అసలు విషయం బయటపెట్టింది. 'అలాంటి ఆలోచన నాకు లేదు. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే పుట్టే పిల్లలు.. అమ్మ అని పిలుస్తారా? అమ్మమ్మ అని పిలుస్తారా?' అని కౌంటర్స్ వేసింది. దీంతో ఈమె పెళ్లి కేవలం పుకారు మాత్రమే అని తేలిపోయింది.

(ఇదీ చదవండి: 'చంద్రా’లు దిద్దిన కాపురం.. స్కెచ్ మాములుగా లేదు!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement