వరంగల్ బ్యూటిఫుల్ సిటీ..: హీరోయిన్ సుకన్య | Warangal Beautiful City ..: Actress Sukanya | Sakshi
Sakshi News home page

వరంగల్ బ్యూటిఫుల్ సిటీ..: హీరోయిన్ సుకన్య

Published Thu, Jun 19 2014 4:22 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

వరంగల్  బ్యూటిఫుల్ సిటీ..: హీరోయిన్ సుకన్య - Sakshi

వరంగల్ బ్యూటిఫుల్ సిటీ..: హీరోయిన్ సుకన్య

  •      డ్యాన్సర్ నుంచి సినీ రంగంలోకి వచ్చా..
  •      ప్రజలకు మెసేజ్ ఇచ్చే సినిమాలకు ప్రాధాన్యం
  •      తెలుగులో నటించడం అంటే చాలా ఇష్టం
  •      ‘సాక్షి’తో హీరోయిన్ సుకన్య
  • పోచమ్మమైదాన్ : ‘వరంగల్ ఈజ్.. బ్యూటిఫుల్ సిటీ.. ఇ క్కడి అందాలను చూసేందుకు రెండు కళ్లు చాలవు.. ఈ జిల్లా ప్రజలు చూపించే ఆదారాభిమానాలు తాను ఎన్నడూ మరిచిపోనని..’ అని హీరోయిన్ సుకన్య అన్నారు. ప్రజలకు మం చి మేసేజ్ ఇచ్చే సినిమాలకే తాను ప్రాధాన్యమిస్తానని.. బాలీవుడ్ నేషన్‌బుక్ అంటే ఎంతో ఇష్టమని ఆమె చెప్పుకొచ్చారు. వరంగల్‌లో మంగళవారం జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన సుకన్యను ‘సాక్షి’ పలకరించింది. ఈ సందర్భంగా చెప్పిన విషయాలు ఆమె మాటల్లోనే...  
     
    వరంగల్ బాగా నచ్చింది...

    నేను వరంగల్‌కు రావడం ఇదే మొదటిసారి. ఇ క్కడికి వచ్చే ముందు నగరంలో చూడాల్సిన పర్యాటక స్థలాలు, ఆధ్యాత్మిక ప్రాంతాలు, దేవాలయాలను ఇంటర్‌నెట్‌లో పరిశీలించా ను. ఇందులో భాగంగా ఉదయం హన్మకొండలోని వేయిస్తంభాల గుడిలోని శివలింగాన్ని, వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నా. అయితే వేయిస్తంభాల గు డిని చూడగానే మొదట ఆశ్చర్యం కలిగింది. ఇన్ని రాళ్లతో ఆలయాన్ని ఇంతపెద్దగా ఎలా క ట్టకలిగారని గుడిలో ఉన్న అధికారులను అడిగాను.

    ఈ సం దర్భంగా వారు చెప్పిన వివరాలు తెలుసుకున్న తర్వాత అమేజింగ్ అనిపించింది. వేయిస్తంభా ల గుడికి వెళ్లిన అనంతరం భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నాను. అయితే ముందు ఆల యంలోకి అడుగిడగానే ఎంతో ప్రశాంతత ల భించింది. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత అక్కడి నుంచి రావాలని అనిపించలేదు. కొద్ది సేపు కూర్చున్న తర్వాత అమ్మవారి చరిత్రను కూడా అడిగి తెలుసుకున్నాను. ఇక్కడికి వచ్చి న తనను ప్రజలు ఎంతో ఆప్యాయంగా పలకరించారు. ఇక నుంచి వరంగల్‌కు ఎప్పుడు వచ్చినా భద్రకాళి అమ్మవారిని తప్పక దర్శించుకుంటాను.
     
    తెలుగులో నాలుగు చిత్రాలు..
     
    నాకు తెలుగు సినిమాల్లో నటించడం అంటే చాలా ఇష్టం. తెలుగులో ఇప్పటివరకు పెద్దరి కం, కెప్టెన్, అధినాయకుడు, మున్నా సిని మాల్లో నటించాను. తెలుగులో డబ్బింగ్ చేసిన భారతీయుడు సినిమా ద్వారా నాకు బాగా గుర్తింపు వచ్చింది. మున్నా సినిమా ద్వారా కూడా ఆదరణ లభించింది.
     
    సినీరంగంలో రాణించాలని...
     
    సినీ రంగంలో అన్ని విభాగాల్లో పనిచేయాలని నాకు ఇష్టం. అందుకే ప్రొడ్యూసర్‌గా కూడా మారుతున్నా. ప్రస్తుతం ‘తిరుపతి మహత్యం’ పై పాటల అల్బమ్‌ను తయారు చేశాను. అలా గే ఇటీవల ‘జడ్జిమెంట్’ అనే షార్ట్ ఫిల్మ్‌కు ని ర్మాతగా, డెరైక్టర్‌గా పనిచేశాను. ఈ సినిమాలో హీరోగా ప్రకాష్‌రాజ్‌ను పెట్టాను. దీనివల్ల నాకు మంచి గుర్తింపు వచ్చింది. మ్యూజిక్ డెరైక్టర్‌గా, లిరికిస్ట్‌గా కూడా చేయాలనేదే నా కోరిక. అది కూడా త్వరలో పూర్తి చేస్తా.
     
    బాలీవుడ్ నేషన్ బుక్ అంటే మక్కువ...
    సినీనటి జానకి కుమారుడు వంశీ జూలురి రూ పొందించిన ‘బాలివుడ్ నేషన్  బుక్’ అంటే ఇష్టం. ప్రతి షూటింగ్ దగ్గరకు బుక్‌ను తప్పకుండా తీసుకెళ్తాను. షూటింగ్‌లో సమయం దొరికినప్పుడల్లా బుక్‌ను చదువుతాను.
     
    స్థాయిని గుర్తుంచుకోవాలి...
    కొత్తగా సినీరంగంలోకి వచ్చే వారు కష్టపడితే భవిష్యత్ ఉంటుంది. కొంత స్టేజీకి వెళ్లిన తర్వాత మనం ఏ స్థాయి నుంచి వచ్చామనేది గుర్తుంచుకోవాలి. గోల్ పెట్టుకుని సినీ రంగం లో రాణించేందుకు కృషి చేయాలి.
     
    భరత నాట్యం అంటే ఇష్టం...
    చిన్నప్పటి నుంచి నాకు భరతనాట్యం అంటే చాలా ఇష్టం. చిన్నతనంలో పాఠశాలకు వెళ్తున్న సమయంలో డ్యాన్సర్ గా వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నాను. తర్వాత నటి గా రంగ ప్రవేశం చేశాను. తమిళంలో 1991లో ‘పొద్దునెల్లు.. పొద్దు నత్తు’ చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగు, కన్నడం, తమిళం, మళయాళం భాషల్లో నటించాను. తమిళంలో 44, మళయాళంలో 17, కన్నడంలో 2, తెలుగులో 4 చిత్రాలు నటించాను. తమిళంలో 1992 సంవత్సరంలో బెస్ట్ యాక్టర్‌గా అవార్డు వచ్చింది. అలాగే 5 ఫిలింఫేర్ అవార్డులు కూడా వచ్చాయి. మళయాళంలో ‘లైఫ్ పార్టనర్’ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది.
     
    మెసేజ్ ఉన్న సినిమాల్లోనే నటిస్తా...
    ప్రజల్లోకి మంచి మెసేజ్ వెళ్లే సినిమాల్లోనే నటిస్తాను. ఎందుకంటే ఇలాంటి సినిమాల్లో నటిస్తే ప్రజల్లో చెరగని ముద్ర వేసుకుంటాం. ప్రతి రోజు మహిళలపై అత్యాచారాలు, చైన్ స్నాచింగులు జరుగుతున్నాయి. వీటిని చూస్తే నాకు చాలా బాధ కలుగుతోంది. పత్రికల్లో ఇలాంటి వార్తలు చదివినప్పుడల్లా నా హృదయం ద్రవిస్తుంది.
     
     ‘సౌందర్య’ మంచి స్నేహితురాలు..
     తెలుగు సినీనటి సౌందర్య అంటే నాకు ఎనలేని ఇష్టం. ఆమె ఆకస్మికంగా చనిపోవడం నన్ను చాలా బాధకు గురిచేసింది. సౌందర్య నాకు మంచి స్నేహితురాలు. అలాగే దివంగత ఎన్‌టీఆర్, ఏఎన్‌ఆర్‌లు అంటే కూడా ఇష్టం. గతంలో వీరి సినిమాలు బాగా చూసే దాన్ని. వారి నటనకు హ్యాట్సాప్.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement