ఐపీఎల్ 2012లో ఘోరంగా విఫలమైన తర్వాత తనపై తనకే చికాకు కలిగింది విరాట్ కోహ్లికి. జట్టులో ఒక్కరికైనా క్రీడాకారుడికి ఉండాల్సిని బాడీ ఫిట్‌నెస్ ఉందా అంటూ అప్పటి టీమిండియా కోచ్ విమర్శ. జట్టులో కొనసాగలన్నా.. అత్యున్నత శిఖరాలు ఎక్కాలన్నా ఎదో కొత్తగా ట్రై చేయాలి అనుకున్నాడు కోహ్లి. అనుకున్నదే తడవుగా ఫిట్‌నెస్ మంత్ర మొదలెట్టాడు. బాడీ ఫిట్‌గా ఉంటే బ్యాటింగ్ బాదేయొచ్చని ఫిక్స్ అయ్యాడు. అప్పుడు మొదలెట్టిన వర్కౌట్స్ ఇప్పటి వరకూ కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుత క్రికెట్ ప్రపంచంలో ఆటగాళ్ల ఫిట్‌నెస్ గురించి ఎక్కడ ప్రస్తావన వచ్చినా.. తొలుత కోహ్లి పేరే వినిపించడం విశేషం. ప్రస్తుతం క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ రికార్డులను అధిగమించే వరకు వచ్చాడు.
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో ఆక్టివ్‌గా ఉండే కోహ్లి.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది. వెయిట్ లిఫ్టర్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా.. ఎక్కువ బరువులను మోస్తూ ప్రొఫెషనల్ వెయిట్ లిఫ్టర్‌గా కోహ్లి కనిపించాడు. అంతేకాకుండా ‘ఏం సాధించాలనుకున్నా, ఏదైనా కావాలని కోరుకోవాలనుకున్నా ముందుగా మనం బలంగా, బాడీ ఫిట్‌గా ఉండాలి’అంటూ క్యాప్షన్ చేర్చాడు.
యథా రాజా తథా ప్రజా అన్నట్టు.. సారథి దారిలోనే మిగిలిన ఆటగాళ్లు ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టడం విశేషం. అందుకే ఆటగాళ్లు పూర్తిగా ఫిట్‌గా ఉండటంతో టీమిండియా ఎప్పుడూ లేనంతంగా ఫీల్డింగ్‌లో బలంగా ఉంది. ఇక వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో చెలరేగిన టీమిండియా సారథి వరసగా మూడు శతకాలు సాధించి మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచాడు. ఇక ఈ సిరీస్‌లోనే పదివేల పరుగుల క్లబ్‌లో చేరాడు. అతి తక్కువ ఇన్నింగ్స్‌లోనే పదివేల పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
Comments
Please login to add a commentAdd a comment