వెయిట్ లిఫ్టింగ్ ఎంపికలో పాల్గొన్న క్రీడాకారిణి
ఆమదాలవలస: విజయనగరం జిల్లా కొండవెలగవాడలో ఈ నెల 23, 23వ తేదీల్లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్టును ఆదివారం ఎంపిక చేశారు. ఆమదాలవలసలోని మారుతి యువజన వ్యాయామ మండలిలో జరిగిన ఎంపికల్లో ఎనిమిది మంది మహిళలు, 19 మంది పురుషులను ను వివిధ కేటగిరీల్లో ఎంపిక చేసినట్లు రాష్ట్ర వెయిట్ లిఫ్టింగ్ సమాఖ్య ఉపాధ్యక్షుడు ఇంజరాపు భాస్కరరావు, జిల్లా సమాఖ్య కార్యదర్శి కె.మధుసూదనరావులు తెలిపారు. పురుషుల విభాగంలో ఎం.జగదీష్, ఎ.వాసుదేవ్‌నాయుడు, సీహెచ్.నరసింగరావు, ఎన్.జగపతిబాబు, జి.రామకృష్ణ, ఎం.మన్మధరావు, పి.ఎర్రన్నాయుడు, కె.వాసు, జి.రవి, వై.తవిటిరాజు, ఎన్.వెంకటేష్, ఎం.సూర్యారావు, కె.కృష్ణ, ఎ.గోవిందరావు, బి.లక్ష్మినారాయణ, ఐ.శ్రీరాముడు, ఎం.తిరుపతి ఎంపికయ్యారు.
మహిళల విభాగంలో ఎం.ప్రశాంతి, కె.శ్రావణి, బి.ఆదిలక్ష్మి, కె.లక్ష్మి, సీహెచ్ శ్రావణి, టి.అనూరాధ, జి.లలిత, ఎన్.లలితలు ఎంపికయ్యారు. నార ఈశ్వరరావు, ఇప్పిలి అప్పన్న, కె.అమ్మినాయుడులు సెలక్షన్ కమిటీ సభ్యులుగా వ్యవహరించారు.