సాక్షి, అమరావతి: టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ బోణీ కొట్టిన విషయం తెలిసిందే. భారత స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను శనివారం వీరోచిత ప్రదర్శనతో రజత పతకాన్ని సాధించింది. 49 కిలోల వెయిట్ లిఫ్టింగ్ విభాగంతో రజత పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా మీరాబాయి చరిత్ర సృష్టించింది. కాగా భారత్‌కు పథకం సాధించిన మీరాబాయికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ మేరకు ట్విటర్ స్పందించారు.
‘అద్భుతమైన ప్రదర్శన. టోక్యో 2020 ఒలింపిక్స్‌లో భారతదేశం పథకం సాధించడం చాలా ఆనందంగా ఉంది. 49 కిలోల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో రజత పతకం సాధించినందుకు మీరాబాయి చానుకి హృదయపూర్వక అభినందనలు’ అని ట్వీట్ చేశారు. కాగా కరణం మల్లీశ్వరి తర్వాత ఒలింపిక్స్ వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో పథకాన్ని గెలుచుకున్న రెండో భారతీయ మహిళగా మీరాబాయి చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్ 49 కేజీల విభాగంలో మొత్తం మీద 202 కేజీలు ఎత్తిన మీరాబాయి.. స్వర్ణం కోసం జరిగిన మూడో అటెంప్ట్‌లో మాత్రం విఫలమైంది. క్లీన్ అండ్ జెర్క్‌లో 117 కేజీలు ఎత్తే క్రమంలో తడబడింది. అయితేనేం రజతం ద్వారా భారత్ పతకాల బోణీని తెరిచిన తొలి వ్యక్తిగా నిలిచింది.
A magnificent feat!
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 24, 2021
Absolutely delighted to see India off the mark in #Olympics #Tokyo2020. Hearty congratulations @mirabai_chanu on winning the silver medal in 49 kgs women's weight lifting category.#MirabaiChanu
Comments
Please login to add a commentAdd a comment