
కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత యువ లిఫ్టర్ జెరెమీ లాల్‌రినుంగా స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. తాష్కెంట్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో మిజోరం రాష్ట్రానికి చెందిన 19 ఏళ్ల జెరెమీ 67 కేజీల విభాగంలో అగ్రస్థానంలో నిలిచాడు. జెరెమీ స్నాచ్‌లో 141 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 164 కేజీలు బరువెత్తి ఓవరాల్‌గా 305 కేజీలతో బంగారు పతకాన్ని దక్కించుకున్నాడు. ఇదే వేదికపై జరుగుతున్న ప్రపంచ చాంపియన్‌షిప్‌లో జెరెమీ ఏడో స్థానంలో నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment