దోహాలో జరిగిన ఖతర్ కప్ అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ టోర్నమెంట్‌లో భారత్‌కు మూడో పతకం లభించింది. మహిళల 64 కేజీల విభాగంలో రాఖీ హల్దర్ మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని గెలిచింది. రాఖీ మొత్తం 218 కేజీలు (స్నాచ్‌లో 85 కేజీలు+క్లీన్ అండ్ జెర్క్‌లో 123 కేజీలు) బరువెత్తింది. ఈ క్రమంలో రాఖీ 214 కేజీలతో తన పేరిటే ఉన్న జాతీయ సీనియర్ రికార్డును సవరించింది.
టోక్యో ఒలింపిక్స్ సిల్వర్ స్థాయి అర్హత టోర్నమెంట్‌గా గుర్తింపు పొందిన ఖతర్ కప్‌లో ఓవరాల్‌గా భారత్‌కు మూడు పతకాలు లభించాయి. ఇంతకుముందు ఈ టోర్నీలో మీరాబాయి చాను స్వర్ణం, జెరెమీ లాల్‌రినుంగా రజతం సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment