క్రికెటర్ మహ్మద్ కైఫ్ (ఫైల్ ఫొటో)
సాక్షి, స్పోర్ట్స్ : కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ, రజత పతకాలు సాధించిన భారత అథ్లెట్లను క్రికెటర్ మహ్మద్ కైఫ్ అభినందించారు. గురువారం జరిగిన మహిళల 48 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో మీరాబాయి చాను పసిడిని సాధించారు. తద్వారా ఈ గేమ్స్‌లో భారత్ ఖాతాలో తొలి స్వర్ణం చేరింది. మరో అథ్లెట్ గురురాజా రజతం సాధించిన విషయం తెలిసిందే. మీరాబాయి చాను, గురురాజాలు మరిన్ని విజయాలు అందుకోవాలని, రాబోయే రోజుల్లో మీ ప్రతిభకు మరింత గుర్తింపు దక్కాలని తన ట్వీట్ ద్వారా కైఫ్ ఆకాంక్షించారు. కాగా, పురుషుల వెయిట్ లిఫ్టింగ్ 56 కేజీల విభాగంలో గురురాజా రెండో స్థానంలో నిలిచి రజతం కైవసం చేసుకున్నాడు. ఈ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన అథ్లెట్‌గా గురురాజా నిలిచాడు.
Congratulations to #MirabaiChanu for the gold and #Gururaja for the silver at the #CWG2018 . Great start for India. Wish more success and recognition for our talent in the coming days. pic.twitter.com/OR33sFskeK
— Mohammad Kaif (@MohammadKaif) 5 April 2018
కరణం మల్లేశ్వరి హర్షం
వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను అద్భుతంగా బరువులెత్తి కామన్వెల్త్ క్రీడల్లో సత్తా చాటిందని వెయిట్ లిఫ్టర్, పద్మశ్రీ కరణం మల్లేశ్వరి ప్రశంసించారు. భారతీయ అథ్లెట్లకు ఇది శుభ పరిణామం. ఇతర అథ్లెట్లకు మీరాబాయి స్వర్ణం స్ఫూర్తినిస్తుందన్నారు. తొలి లిఫ్ట్‌తోనే పతకం సాధించడం విశేషమని మల్లేశ్వరి కొనియాడారు. మీరాబాయి ప్రదర్శనను గమనించినట్లయితే ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌లో పథకంపై ఆశలు చిగురిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. ఒలింపిక్ పోటీల్లో భారతదేశానికి వెయిట్‌లిఫ్టింగ్‌లో తొలి పతకం తీసుకువచ్చిన వెయిట్‌లిఫ్టర్‌గా కరణం మల్లేశ్వరి రికార్డులకెక్కిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment