Karnam Malleswari
-
తెలుగు బిడ్డ కరణం మల్లీశ్వరీ విజయగాథ
2000, సెప్టెంబర్ 19.. ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరం.. ఒలింపిక్స్ బహమతి ప్రదానోత్సవ వేదికపై భారత జాతీయ జెండా ఎగిరింది. కళ్ళల్లో అంతు లేని ఆనందం! బయటకు వ్యక్తీకరించలేని భావోద్వేగంతో పాతికేళ్ల వయసున్న ఒక అచ్చ తెలుగు బిడ్డ సగర్వంగా ఆ వేదికపై నిలబడింది. ప్రపంచానికి మరో వైపు భారత్‌లో కూడా దాదాపు అదే తరహా వాతావరణం కనిపించింది. మన అమ్మాయి సృష్టించిన కొత్త చరిత్ర గురించే అంతటా చర్చ. ఇంకా చెప్పాలంటే తామే ఆ ఘనతను సాధించినంతగా ఎంతో మంది సంబరపడిపోయారు. కొద్ది క్షణాల తర్వాత ‘భారత్ కీ బేటీ’ అంటూ దేశ ప్రధాని వాజ్‌పేయి నుంచి వచ్చిన ఏకవాక్య ప్రశంస ఆ చారిత్రక ఘట్టం విలువను మరింత పెంచింది. ఒలింపిక్స్ చరిత్రలో భారత్ నుంచి ఒక మహిళ సాధించిన తొలి పతకమది. బరువులెత్తే పోటీల్లో భారత అభిమానుల అంచనాల భారాన్ని మోస్తూ బరిలోకి దిగిన మన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి అందుకున్న గొప్ప విజయమది. ఎక్కడో శ్రీకాకుళం జిల్లాలోని మారుమూల ప్రాంతం ఊసవానిపేట నుంచి వచ్చి ఒలింపిక్స్ వేదికపై కాంస్యం అందుకున్న ఆ అద్భుతం పేరే కరణం మల్లీశ్వరి. ఒలింపిక్స్‌లో మనోళ్లు పాల్గొనడమే తప్ప అంచనాలు లేని, పతకం ఆశించని భారత క్రీడాభిమానులకు ఆ కంచు కూడా కనకంలా కనిపించింది. అన్నింటికి మించి మలీశ్వరి గెలిచిన మెడల్ ఆమె కంఠానికి మాత్రమే ఆభరణంగా మారలేదు. భవిష్యత్తులో మన దేశం నుంచి క్రీడల్లో రాణించాలనుకున్న అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలిచి లక్ష్యాలను నిర్దేశించింది. సిడ్నీ ఒలింపిక్స్‌కు ముందు భారత్ ఖాతాలో రెండు వ్యక్తిగత పతకాలు మాత్రమే ఉన్నాయి. 1952 హెల్సింకీ ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌లో కె.డి. జాదవ్, 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో టెన్నిస్‌లో లియాండర్ పేస్ ఆ పతకాలు సాధించారు. సిడ్నీ ఒలింపిక్స్‌లోనే మహిళల వెయిట్ లిఫ్టింగ్‌ను తొలిసారి ప్రవేశపెట్టారు. మల్లీశ్వరి అప్పటికీ అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటి తానేంటో రుజువు చేసుకుంది. అయినా సరే ఒలింపిక్స్ పతకంపై అంచనాలు లేవు. ఇతర ఈవెంట్లలో ఎన్ని ఘనతలు సాధించినా ఒలింపిక్స్‌కు వచ్చేసరికి మన ప్లేయర్లు తడబడటం అప్పటికే ఎన్నో సార్లు కనిపించగా.. మల్లీశ్వరి వెయిట్ కేటగిరీకి ఇది పూర్తిగా భిన్నం కావడంతో ఎలాంటి ఆశా లేకుండింది. 1993, 1994, 1995, 1996లలో వరుసగా నాలుగేళ్ల పాటు వరల్డ్ చాంపియన్‌షిప్‌లో మల్లీశ్వరి పతకాలు గెలుచుకుంది. ఇందులో 2 స్వర్ణాలు, 2 కాంస్యాలు ఉన్నాయి. దీంతో పాటు 1994 హిరోషియా ఆసియా క్రీడల్లో కూడా రజతం సాధించింది. అయితే ఇవన్నీ 54 కేజీల విభాగంలో వచ్చాయి. ఆ తర్వాత కొంత బరువు పెరిగిన ఆమె 63 కేజీల కేటగిరీకి మారి 1998 బ్యాంకాక్ ఆసియా క్రీడల్లోనూ కాంస్యం సాధించింది. అయితే ఒలింపిక్స్‌కు వచ్చే సరికి 69 కేజీల కేటగిరీలో పోటీ పడాల్సి వచ్చింది. అప్పటి వరకు ఆమె ఆ విభాగంలో ఎలాంటి అంతర్జాతీయ ఈవెంట్లో పాల్గొనకపోగా, వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పతకం సాధించి కూడా నాలుగేళ్లయింది. దాంతో మల్లీశ్వరి గెలుపుపై సందేహాలే నెలకొన్నాయి. ఆ రోజు ఏం జరిగిందంటే... ఫైనల్లో మొత్తం 15 మంది లిఫ్టర్లు పోటీ పడ్డారు. 12 మంది పేలవ ప్రదర్శనతో బాగా వెనుకబడిపోగా, ముగ్గురి మధ్యనే తుది పోటీ నెలకొంది. స్నాచ్ విభాగంలో 110 కిలోల బరువెత్తిన మల్లీశ్వరి మరో లిఫ్టర్‌తో కలసి సమానంగా రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత రెండో అంకమైన క్లీన్ అండ్ జర్క్ వచ్చింది. ఆమె కంటే ముందుగా చైనా, హంగేరీ అమ్మాయిలు 132.5, 130 కిలోల చొప్పున బరువులెత్తి సవాల్ విసిరారు. రెండు విభాగాల్లో కలిపి మొత్తం పాయింట్లు చూస్తే మిగతా ఇద్దరికంటే మల్లీశ్వరి 2.5 కిలోలు తక్కువ బరువెత్తింది. ఆమెకు ఆఖరి ప్రయత్నం మిగిలి ఉంది. ఆమె శరీర బరువును కూడా లెక్కలోకి తీసుకుంటే 132.5 కిలోలు ఎత్తితే రజతం ఖాయం, ఆపై 135 కిలోలు ఎత్తితే స్వర్ణం లభించేది. అయితే ఈ సమయంలో కోచ్‌లు ఇచ్చిన సూచనలతో పెద్ద సాహసానికి ప్రయత్నించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం కోల్పోరాదని భావించి నేరుగా 137.5 కిలోలు ఎత్తేందుకు సిద్ధపడింది. ప్రాక్టీస్‌లో దీనిని సునాయాసంగా ఎత్తిన అనుభవం ఉండటం ఆమె నమ్మకానికి కారణం. అయితే అంతకు ముందు రెండో ప్రయత్నంలో 130 కిలోలే ఎత్తిన మల్లీశ్వరి మూడో ప్రయత్నంలో ఏకంగా 7.5 కిలోలు పెంచడం అసాధ్యంగా మారింది. దానిని పూర్తి చేయలేక ఈ ప్రయత్నం ‘ఫౌల్’గా మారింది. చివరకు ఓవరాల్‌గా 240 కిలోల బరువుతో మూడో స్థానంలో నిలిచి కాంస్యం అందుకుంది. అయితేనేం.. భారత క్రీడల్లో కొత్త చరిత్ర సృష్టించేందుకు అది సరిపోయింది. ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారత మహిళగా మల్లీశ్వరి కీర్తి చిరస్థాయిగా నిలిచింది. అమ్మ అండగా.. మల్లీశ్వరి ఆటలో ఓనమాలు నేర్చుకున్న సమయంలో పరిస్థితులు పూర్తిగా భిన్నం. అందుబాటులో ఉన్న కొద్దిపాటి స్థలంలో పాతకాలపు పరికరాలతోనే వెయిట్ లిఫ్టింగ్ సాధన మొదలైంది. ఈ క్రీడలో భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవరికీ నమ్మకం లేని సమయంలో తన అక్కను చూసి మల్లీశ్వరి ఆట వైపు ఆకర్షితురాలైంది. ఆరంభంలో బలహీనంగా ఉందంటూ కోచ్ నీలంశెట్టి అప్పన్న తిరస్కరించినా, ఆ తర్వాత ఆమెకు అవకాశం కల్పించాడు. ఈ క్రమంలో అందరికంటే ఎక్కువగా తల్లి శ్యామల అండగా నిలిచి కూతురుని ప్రోత్సహించింది. 1990 ఆసియా క్రీడలకు ముందు జాతీయ క్యాంప్‌లో అక్కను కలిసేందుకు వెళ్లిన మల్లీశ్వరిలో ప్రతిభను కోచ్ లియోనిడ్ తారానెంకో గుర్తించి సరైన దిశ చూపించాడు. దాంతో బెంగళూరు ‘సాయ్’ కేంద్రంలో ఆమెకు అవకాశం దక్కింది. ఆపై జాతీయ జూనియర్ చాంపియన్‌షిప్‌లో వరుసగా రికార్డులు నెలకొల్పి సీనియర్ నేషనల్స్‌లో రజతం సాధించడంతో మల్లీశ్వరి విజయ ప్రస్థానం మొదలైంది. ఆపై వరుస అవకాశాలు అందుకున్న ఆమె వరల్డ్ చాంపియన్ షిప్‌లలో సంచలన ప్రదర్శనతో పలు ఘనతలు తన పేరిట లిఖించుకుంది. 18 ఏళ్ల వయసులో తొలి వరల్డ్ చాంపియన్‌షిప్ పతకంతో మొదలు పెట్టి ఈ ప్రయాణం చివరకు ఒలింపిక్స్ మెడల్ వరకు సాగడం విశేషం. ఆమె స్ఫూర్తితోనే.. ‘80వ దశకం చివర్లో మన మహిళా ప్లేయర్లు మంచి ఫలితాలు సాధిస్తుండటం మొదలైంది. ఉష, షైనీ విల్సన్, కుంజరాణిలాంటి ప్లేయర్లు పెద్ద వేదికపై రాణించారు. కానీ మలీశ్వరి విజయంతోనే అసలైన మార్పు వచ్చింది. 2000 తర్వాతే అన్ని క్రీడాంశాల్లో ప్రాతినిధ్యం పెరుగుతూ వచ్చింది. ఒలింపిక్స్‌లో సైనా, సింధు, మేరీకోమ్వంటి విజేతలు వచ్చేందుకు మల్లీశ్వరి విజయమే కారణం’ అని అథ్లెట్ దిగ్గజం అంజూ జార్జ్ చెప్పడం ఆ పతకం విలువను చెప్పింది. సిడ్నీలో భారత్ సాధించిన ఏకైక పతకం కూడా అదే. రెజ్లింగ్‌లో స్టార్లను అందించిన మహావీర్ ఫొగాట్‌కు తన కూతుళ్లు ఏదైనా సాధించగలరనే నమ్మకాన్ని మల్లీశ్వరి విజయం అందించిందట. ఈ విషయాన్ని స్వయంగా రెజ్లర్ గీతా ఫొగాట్ వెల్లడించడం విశేషం. ‘మల్లీశ్వరి గెలిచినప్పుడు విజయం స్థాయి ఏంటో మాకు అర్థం కాలేదు కానీ నాన్న మాత్రం అదే మేలిమలుపుగా చెప్పుకునేవారు. ఆమె గురించే మాకు ట్రైనింగ్‌లో మళ్లీ మళ్లీ చెప్పేవారు. నాన్నకు సంబంధించి మల్లీశ్వరి హరియాణా అమ్మాయే’ అని గీత గుర్తు చేసుకుంది. నిజంగానే ఏ ప్రమాణాల ప్రకారం చూసుకున్నా మల్లీశ్వరి సాధించిన విజయం చాలా గొప్పది. ఆమె సాధించిన ఘనత ఒక తరంలో పెద్ద సంఖ్యలో ఆడపిల్లలను ఆటల వైపు మళ్లించిందనడంలో సందేహం లేదు. కొత్త బాధ్యతతో... సహచర వెయిట్‌లిఫ్టర్ రాజేశ్త్యాగిని వివాహం చేసుకున్న అనంతరం హరియాణాలోనే..యమునా నగర్లో మల్లీశ్వరి స్థిరపడిపోయింది. అక్కడే వెయిట్‌లిఫ్టింగ్ అకాడమీని నిర్వహిస్తోన్న ఆమె ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) ఉద్యోగిగా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. అర్జున, ఖేల్‌రత్న, పద్మశ్రీ, పురస్కారాలు అందుకున్న మల్లీశ్వరి ఇప్పుడు కొత్త బాధ్యతలు చేపడుతోంది. త్వరలో ఢిల్లీ ప్రభుత్వం ప్రారంభించబోయే స్పోర్ట్స్ యూనివర్సిటీకి తొలి వైస్ చాన్స్‌లర్‌గా ఆమెను నియమించారు. -
తెలుగు క్రీడా శిఖరం మల్లీశ్వరికి అరుదైన గౌరవం
తెలుగు నేలలో ఉదయించిన క్రీడా శిఖరం, గ్రామీణ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి ఉవ్వెత్తున ఎగిసిన అథ్లెటిక్ కెరటం, ఒలింపిక్ పతకాన్ని భారత దేశానికి అందించిన ఆంధ్రుల ఆడపడుచు, మహిళా క్రీడాకారులకు స్ఫూర్తి ప్రదాత, దేశ ఉన్నత పురస్కారం పద్మశ్రీ అందుకున్న భరతజాతి ముద్దుబిడ్డ... ఇప్పటివరకు ఇవన్నీ కరణం మల్లేశ్వరి గురించి మనకి తెలిసిన విషయాలు. కానీ దేశంలోనే ఒక అరుదైన అవకాశాన్ని దక్కించుకొని మళ్లీ వార్తల్లో నిలిచారామె. తెలుగు ప్రజల ఖ్యాతిని మరోసారి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిలిపారు. ఢిల్లీ ప్రభుత్వం నెలకొల్పిన ‘ఢిల్లీ క్రీడా విశ్వవిద్యాలయాని‘కి ఉపకులపతిగా ఎంపిక కావడం ద్వారా దేశ చరిత్రలో పదిలమైన స్థానాన్ని పొందారు. తనలాగే దేశంలో ఎందరో ఔత్సాహిక క్రీడాకారులకు అత్యుత్తమ సదుపాయాలతో కూడిన మంచి శిక్షణలో దిశానిర్దేశం చేయాలనే ఆమె తపనను ఢిల్లీ ప్రభుత్వం గుర్తిం చింది. ఇప్పటివరకు ప్రత్యేకంగా క్రీడా యూనివర్సిటీలు నెలకొల్పిన సందర్భాలు అరుదు. జాతీయ స్థాయిలో ఒకే ఒక క్రీడా యూనివర్సిటీ నెలకొల్పారు. కానీ ఢిల్లీ ప్రభుత్వం ఆ దిశగా ప్రస్తుతం అడుగులు వేసింది. దీనిని నడిపించి మెరికల్లాంటి యువతను అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దే బాధ్యతను కరణం మల్లీశ్వరి భుజస్కంధాలపై ఉంచింది. ఇది నిజంగా ఒక గొప్ప ప్రయత్నమే. నిజానికి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాల్లోనూ ఈ విధమైన యూనివర్సిటీలు నెలకొల్పితే గ్రామీణ యువతకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుందని క్రీడా నిపుణుల అభిప్రాయం. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద దేశంగా 130 కోట్లకు పైగా ప్రజలు ఉన్న మనం క్రీడల్లో చాలా వెనకబడి ఉన్నాం. దీనికి ప్రధానమైన కారణం సమర్థులైన క్రీడాకారులు లేక కాదు. శక్తి సామర్థ్యాలతో పాటు నైపుణ్యాన్ని అందించి తగిన విధంగా తీర్చిదిద్దేందుకు సరైన యంత్రాంగం లేకపోవడమే. క్రీడలలో రాణించాలంటే శరీర ధారుఢ్యం ఉండాలి, పౌష్టికాహారంతో పాటు తగిన అత్యుత్తమ శిక్షణ ఉండాలి. దేశంలో ఔత్సాహిక క్రీడాకారులకు కొదువ లేదు. కానీ వారిని గుర్తించి ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. గ్రామీణ నేపథ్యంతో పాటు పేద కుటుంబాలకు చెందిన క్రీడాకారుల నైపుణ్యాలను గుర్తించి వారికి వెన్నుదన్నుగా నిలిస్తే అద్భుతాలు సాధించవచ్చు. ఈ దిశగా ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభిస్తే ఎంతో ప్రయోజనం ఉంటుంది. గ్రామీణ క్రీడాకారులకు కరణం మల్లేశ్వరి ఒక ఆదర్శం. మారుమూల కుగ్రామం శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలస జిల్లా పరిషత్ హైస్కూల్లో తన సోదరి నరసమ్మ స్ఫూర్తితో తన 12వ ఏట నుండే క్రీడలపై ఆసక్తితో, నిరంతర శ్రమతో, పట్టుదలతో, మొక్కవోని ఆత్మవిశ్వాసంతో, అలుపెరుగని ఆమె ప్రయత్నం సఫలీకృతం అయింది. ప్రపంచ అగ్రశ్రేణి వెయిట్ లిఫ్టర్‌గా కీర్తిని సొంతం చేసుకున్నారు. మౌలిక వసతుల లేమి, అరకొర శిక్షణ, పరిమితమైన ప్రభుత్వ ప్రోత్సాహం ఇవన్నీ దేశంలో క్రీడాకారులకు ఎదురవుతున్న ఇబ్బందులు. వీటిని ఆమె అధిగమించారు. ఒలింపిక్ పతకంతో పాటు పలు జాతీయ, అంతర్జాతీయ క్రీడలలోను రాణించారు. ఈ క్రీడా ప్రయాణంలో ఆటుపోట్లు ఆమెకు తెలుసు. ఆ స్థాయికి చేరేందుకు క్రీడాకారులు పడుతున్న ఇబ్బందులను ఆమె దగ్గరగా చూశారు. ఆ అవరోధాలను అధిగమించి దేశానికి అత్యుత్తమ అ«థ్లెట్లను అందించేందుకు ఆమె తపన పడ్డారు. తన మాతృభూమి రుణం తీర్చుకోవాలనే సంకల్పంతో శ్రీకాకుళం జిల్లాలో ఒక వెయిట్‌లిఫ్టింగ్ అకాడమీ నెలకొల్పేందుకు స్థల కేటాయింపు కోసం నాటి ప్రభుత్వాన్ని కోరినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఆమె మెట్టినిల్లు హరియానా రాష్ట్రంలో అకాడమీని నెలకొల్పి క్రీడాకారులను తీర్చిదిద్దే పనిలో ఉన్నారు. అడిగిందే తడవుగా విశాఖలో బ్యాడ్మింటన్ అకాడమీ నెలకొల్పేందుకు ప్రపంచ స్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.సింధుకు రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి అధిక ప్రాధాన్యతను ఇస్తానని ప్రకటించారు. కానీ 2000వ సంవత్సరంలో దేశానికి ఒలింపిక్ పతకాన్ని అందించిన తెలుగు బిడ్డ కరణం మల్లీశ్వరి అథ్లెటిక్ అకాడమీ ఏర్పాటు కోసం చేయని ప్రయత్నం లేదు. కానీ అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం మొండిచేయి చూపింది. గత ప్రభుత్వ హయాంలో కూడా ఆ దిశగా ప్రయత్నించినా ఆమెకు ప్రోత్సాహం లభించలేదు. తాను జన్మించిన తెలుగు నేలకు సేవలు చేసేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటానంటారు కరణం మల్లేశ్వరి. తన పతకాల వేటతో తన పని పూర్తి అయినట్లు ఆమె భావించలేదు. తనలాంటి క్రీడాకారులను దేశానికి అందించాలని దీక్షబూనారు. ఆమె సంకల్పాన్ని గుర్తించిన ఢిల్లీ ప్రభుత్వం ఆమెకు ఆ బాధ్యతను అప్పగించింది. ఆమె సారథ్యంలో పలువురు క్రీడాకారులు అంతర్జాతీయ ఖ్యాతి పొందాలని ఆకాంక్షిద్దాం. నేలపూడి స్టాలిన్ బాబు వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకులు మొబైల్ : 83746 69988 -
Karnam Malleswari: ఇది ఒక వరం లాంటింది
సాక్షి, న్యూఢిల్లీ: ఒలింపిక్స్ పతకాల సాధనే లక్ష్యంగా ఢిల్లీ క్రీడా యూనివర్సిటీ పనిచేస్తుందని వైస్ చాన్సలర్(ప్రకటిత) కరణం మల్లీశ్వరి చెప్పారు. దేశంలో ప్రస్తుతం క్రీడలకు కావాల్సిన వనరులున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుంటే అంతర్జాతీయ స్థాయిలో పతకాల సాధన సులభమేనన్నారు. ఢిల్లీ క్రీడా వర్సిటీ వీసీగా నియమితులైన క్రమంలో బుధవారం ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. చిన్నతనం నుంచే క్రీడలపై మనసు లగ్నం చేస్తే.. యుక్త వయసు నాటికి అంతర్జాతీయ ప్రమాణాలు అందుకోవడం, పతకాలు సాధించడం వీలవుతుందని అభిప్రాయపడ్డారు. ఢిల్లీ క్రీడా యూనివర్సిటీలో ఆరో తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్, పీహెచ్డీ వరకు కోర్సులుంటాయన్నారు. ‘ఆరో తరగతి నుంచే క్రీడల్లో శిక్షణ ఇస్తే ఈ రంగంలో మరింత దూసుకెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అకాడమీల్లో ఏదో ఒక క్రీడ మాత్రమే నేర్చుకునే వీలుంది. యూనివర్సిటీలో పలు క్రీడల పట్ల అవగాహన పెంచుకుని తగిన క్రీడను ఎంచుకునేందుకు అనేక అవకాశాలుంటాయి. క్రీడలను కెరియర్‌గా ఎంచుకుని ఎదగగలమన్న విశ్వాసాన్ని కల్పించేలా ఈ వర్సిటీ ఉంటుంది. క్రీడలను ప్రోత్సహించడంలో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయం. తెలుగు రాష్ట్రాలకే కాదు.. దేశవ్యాప్తంగా విద్యార్థులకు ఇది ఒక వరం లాంటింది. త్వరలోనే బాధ్యతలు చేపడతా. అధికారులు, ప్రభుత్వంతో చర్చించి ప్రవేశాలు, అర్హతలు, ఇతరత్రా అంశాలపై నిర్ణయం తీసుకుంటాం’ అని కరణం మల్లీశ్వరి వివరించారు. చదవండి: ఢిల్లీ స్పోర్ట్స్ వర్సిటీ మొదటి వీసీగా కరణం మల్లీశ్వరి -
ఢిల్లీ స్పోర్ట్స్ వర్సిటీ మొదటి వీసీగా కరణం మల్లీశ్వరి
సాక్షి, శ్రీకాకుళం న్యూకాలనీ: ప్రముఖ వెయిట్‌లిఫ్టర్, ఒలింపిక్ పతక విజేత కరణం మల్లీశ్వరి ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ తొలి వైస్ చాన్స్‌లర్‌గా నియమితులయ్యారు. ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ చాన్స్‌లర్ అయిన లెఫ్టినెంట్ గవర్నర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం ఊసవానిపేటకు చెందిన మల్లీశ్వరి 2000లో జరిగిన సిడ్నీ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించారు. అంచెలంచెలుగా.. ఆమదాలవలస మండల పరిధిలోని ఊసవానివానిపేట అనే మారుమూల గ్రామానికి చెందిన మల్లేశ్వరి అంచెలంచెలుగా ఎదిగారు. ఆమె తల్లిదండ్రులు కరణం మనోహర్, శ్యామల. మల్లేశ్వరి అక్క నరసమ్మకు జాతీయస్థాయి వెయిట్‌లిఫ్టింగ్ మాజీ కోచ్ నీలంసెట్టి అప్పన్న శిక్షణ ఇస్తుండేవారు. అక్క విజయాలను చూసిన మల్లేశ్వరి కూడా వెయిట్‌లిఫ్టింగ్‌పై ఆసక్తి పెంచుకున్నారు. తొలుత జిల్లాస్థాయి, దానికి కొనసాగింపుగా రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందారు. అనంతరం జాతీయ స్థాయిలో పతకాల పంట పండించారు. ఒలింపియన్‌గా.. 2000లో సిడ్నీలో జరిగిన ఒలింపిక్స్‌లో మల్లేశ్వరి 69 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించి విశ్వవ్యాప్తంగా సిక్కోలు ఖ్యాతిని వ్యాపింపజేశారు. ఈ పోటీ ల్లో 110 కేజీల స్నాచ్, 130 కేజీల క్లీన్ అండ్ జర్క్ ద్వారా మొత్తం 240 కేజీల బరువు ఎత్తి ఒలింపిక్స్ లో పతకం సాధించిన మొట్టమొదటి భారత మహిళగా చరిత్ర సృష్టించారు. అంతకుముందు పలు ప్ర పంచస్థాయి వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ పోటీ ల్లో మల్లేశ్వరి వరుసగా పతకాల పంట పండించారు. మొత్తం అన్నీ 54 కేజీల విభాగంలో సాధించారు. 1993లో ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో కాంస్యం, 1994లో టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో బంగారం, 1995లో చైనాలోని గ్యాంగ్‌ఝూలో బంగారం, 1996లో చైనాలోని గ్యాంగ్ ఝాలో కాంస్య పతకాలు సాధించింది. ఆ తరువాత 1998లో బ్యాంకాక్‌లో జరిగిన ఏసియన్ గేమ్స్‌లో 63 కేజీల విభా గంలో రజతం సాధించి శభాష్ అనిపించారు. 1997 లో ఈమె సహచర వెయిట్‌లిఫ్టింగ్ క్రీడాకారుడైన రాజేష్ త్యాగిని వివాహం చేసుకున్నారు. 2004 ఒలింపిక్స్ తర్వాత తన ఆటకు ఫుల్స్టాప్ పెట్టారు. ప్రస్తుతం ఈమె హర్యానాలోని యమునానగర్‌లో ఫుడ్ కార్పొరేషన్ ఇండియా చీఫ్ జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. అలాగే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఏపీ (శాప్) బోర్డు డైరెక్టర్‌గా, దేశంలోని పలు స్పోర్ట్స్ కమిటీల్లో, ఇండియన్ వెయిట్‌లిప్టింగ్ ఫెడరేషన్లో కీలక సభ్యురాలిగా ఉన్నారు. తాజాగా ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీకి మొదటి వీసీగా నియామకమయ్యారు. చదవండి: Milkha Singh Love Story: ఆమె ప్రేమకై అతడి పరుగు -
తెలంగాణలో వెయిట్‌లిఫ్టింగ్ అకాడమీ
సాక్షి, హైదరాబాద్: ఒలింపిక్స్ క్రీడల్లో పతకం అందించిన భారత తొలి మహిళా క్రీడాకారిణిగా ఆంధ్రప్రదేశ్ వెయిట్‌లిఫ్టర్ కరణం మల్లేశ్వరి చరిత్రలో నిలిచిపోయింది. సరిగ్గా 20 ఏళ్ల క్రితం 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో మల్లేశ్వరి మహిళల వెయిట్‌లిఫ్టింగ్ 69 కేజీల విభాగంలో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సొంతం చేసుకుంది. ఈ ఘనత సాధించి రెండు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా ఆమెతో టీ–స్పోర్ట్స్ చైర్మన్, జాతీయ హ్యాండ్‌బాల్ సంఘం ఉపాధ్యక్షుడు అరిసనపల్లి జగన్మోహన్ రావు వెబీనార్ నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లేశ్వరి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం సహకారమిస్తే హైదరాబాద్ కేంద్రంగా వెయిట్‌లిఫ్టింగ్ అకాడమీని ఏర్పాటు చేస్తానని, తెలుగు రాష్ట్రాల క్రీడాకారుల అభ్యున్నతి కోసం తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని హామీ ఇచ్చింది. తెలంగాణలో ప్రతిభావంతులైన ఎంతోమంది యువ వెయిట్‌లిఫ్టర్లు ఉన్నారని... అయితే వారికి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అకాడమీ లేకపోవడంతో వెలుగులోకి రావడం లేదని టీ–స్పోర్ట్స్ చైర్మన్ జగన్మోహన్ రావు తెలిపారు. మల్లేశ్వరి ఫౌండేషన్‌తో కలిసి తెలంగాణ లిఫ్టర్లకు చేయూత ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. మల్లేశ్వరి హైదరాబాద్‌కు రావాలని ఈ వెబీనార్‌లో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ (శాట్స్) అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి ఆహ్వానించారు. క్రీడల మంత్రి శ్రీనివాస్ గౌడ్ సహకారంతో సీఎం కేసీఆర్‌ను కలిసి రాష్ట్రంలో వెయిట్‌లిఫ్టింగ్ అకాడమీ ఏర్పాట్లపై చర్చిద్దామని ఆయన అన్నారు. -
మన ‘మల్లి’ మెరిసిన వేళ....
ఒలింపిక్ వేదికపై మన తెలుగమ్మాయి సగర్వంగా నిలబడిన రోజది... భారత జాతీయ పతాకం రెపరెపలాడుతుండగా ఆమె మెడలో పడిన కాంస్య పతకం దేశంలోని అమ్మాయిలకు కొత్త స్ఫూర్తిని అందించింది. ఏళ్లుగా అంచనాల భారం మోస్తూ వెళ్లే మన అథ్లెట్లు మెగా ఈవెంట్ నుంచి రిక్తహస్తాలతో తిరిగి వస్తున్న సమయంలో నేనున్నానంటూ బరువులెత్తి పరువు నిలబెట్టిన ఘనత ఆమె సొంతం. 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో కాంస్య పతకంతో మెరిసిన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి కరణం మల్లీశ్వరి విజయం గురించి ఎంత చెప్పినా తక్కువే. శ్రీకాకుళం జిల్లా ఊసవానిపేట నుంచి ఒలింపిక్స్ వరకు ఎదిగి ఆమె సాధించిన పతకానికి భారత క్రీడా చరిత్రలో ‘తొలి మహిళ’గా ప్రత్యేక స్థానం ఉంటుంది. లెక్కల్లో చూస్తే అది కాంస్యమే కావచ్చు కానీ ఈ ఘనత బంగారు పతకంకంటే తక్కువేమీ కాదు. 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో లియాండర్ పేస్ టెన్నిస్ సింగిల్స్‌లో సాధించిన కాంస్యమే భారత్ ఖాతాలో చేరిన ఏకైక పతకం. ఆ తర్వాత కూడా మన క్రీడలు ఒక్కసారిగా ఏమీ మారిపోలేదు కాబట్టి 2000 సిడ్నీ ఒలింపిక్స్‌పై కూడా పెద్దగా ఆశలు లేవు. పతకం సాధించగల సత్తా ఉన్న క్రీడాకారుల జాబితాలో కరణం మల్లీశ్వరిని ఎవరూ పెద్దగా లెక్కలోకి తీసుకోలేదు. నిజానికి అప్పటికే మల్లీశ్వరి తనను తాను నిరూపించుకుంది. రెండుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలవడం (1994, 1995)తో పాటు మరో రెండు కాంస్యాలు కూడా సాధించింది. వరుసగా రెండు ఆసియా క్రీడల్లో రెండు రజత పతకాలు కూడా ఉన్నాయి. సిడ్నీ సంచలనానికి వచ్చేసరికే మల్లీశ్వరి 11 స్వర్ణాలు సహా 29 అంతర్జాతీయ పతకాలు సాధించింది. అయితే వెయిట్ కేటగిరీ మారిపోవడంతోపాటు ఇతర ఫలితాలు ఎలా ఉన్నా ఒలింపిక్స్‌కు వచ్చేసరికి మనవాళ్ల తడబాటు జగమెరిగిందే కాబట్టి ఎవరూ అంచనాలు పెట్టుకోలేదు. ఇదే చివరకు మల్లీశ్వరికి కూడా మేలు చేసింది. ఒకదశలో ఒలింపిక్స్‌కు ముందు ఉత్తరాది లాబీ ఒకటి పనిగట్టుకొని ఇండియాటుడే లాంటి పత్రికలో మల్లీశ్వరి గురించి తప్పుడు కథనాలు ప్రచురింపజేసి ఆమెను మానసికంగా దెబ్బ తీసేందుకు ప్రయత్నించింది. అయితే ఇవన్నీ పట్టించుకోకుండా దృఢ చిత్తంతో ఆమె ముందడుగు వేసింది. స్వర్ణానికి గురి పెట్టి... 2000 సెప్టెంబర్ 19న సిడ్నీ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్లో పోరు జరిగింది. మహిళల 69 కేజీల విభాగంలో మల్లీశ్వరి బరిలోకి దిగింది. స్నాచ్‌లో మూడు ప్రయత్నాల్లో మన వెయిట్‌లిఫ్టర్ ఎక్కడా తడబాటుకు గురి కాకుండా వరుసగా 105 కేజీలు, 107.5 కేజీలు, 110 కేజీలు బరువులెత్తింది. ఫలితంగా అత్యుత్తమ ప్రదర్శన 110 కేజీల వద్ద స్కోరు నిలిచింది. క్లీన్ అండ్ జర్క్‌లో తొలి రెండు ప్రయత్నాల్లో 125 కేజీలు, 130 కేజీలు ఆమె ఎత్తింది. అయితే ఈ దశలో చేసిన చిన్న తప్పు ఆమెను వైఫల్యంలో పడేసింది. మల్లీశ్వరి స్వయంగా నిర్ణయం తీసుకుందో, లేక కోచ్‌లు చెప్పారో కానీ చివరి ప్రయత్నంలో ఎవరికీ అందనంత పైన ఉండి స్వర్ణం సాధించే పట్టుదలతో ఏకంగా 137.5 కేజీల బరువెత్తేందుకు సిద్ధమైంది. సాధారణంగా వెయిట్‌లిఫ్టర్లు తమ చివరి లిఫ్ట్ వచ్చేసరికి అంతకుముందు లిఫ్ట్కంటే గరిష్టంగా 2.5 కేజీల వరకు అదనంగా బరువు ఎత్తగలరు. అయితే ఒక్కసారిగా 7.5 కేజీలు పెరిగేసరికి మల్లీశ్వరి తడబడింది. ఫలితంగా మూడో యత్నంలో 137.5 కేజీలు ఎత్తలేక వదిలేసింది. తుది ఫలితంలో మొత్తంగా 240 కేజీలతో మూడో స్థానంలో నిలిచి కాంస్యాన్ని గెలుచుకుంది. స్వర్ణ, రజతాలు సాధించిన లిన్ వీనింగ్ (చైనా), ఎర్‌జెబెత్ (హంగేరి) ఎత్తిన మొత్తం (242.5 కేజీలు) మల్లీశ్వరికంటే 2.5 కేజీలే ఎక్కువ కావడం గమనార్హం. ఆమె కూడా 132.5 కేజీల లక్ష్యాన్ని పెట్టుకొని ఉంటే స్వర్ణం కోసం పోటీలో నిలిచేదేమో! లిన్ వీనింగ్, ఎర్‌జెబెత్ సమానంగా 242.5 కేజీలు ఎత్తినా... ఎర్‌జెబెత్ (68.52 కేజీలు) శరీర బరువుకంటే లిన్ వీనింగ్ (66.74 కేజీలు) తక్కువగా ఉండటంతో చైనా లిఫ్టర్‌కు స్వర్ణం దక్కింది. అభినందనల వర్షం... మల్లీశ్వరి కాంస్య పతకం కూడా భారత్‌కు సంబంధించి బంగారమే అయింది. సిడ్నీలో మనకు దక్కిన పతకం అదొక్కటే. మల్లీశ్వరికి కూడా తాను సాధించిన విజయం విలువ తెలిసేందుకు కొంత సమయం పట్టింది. దేశం యావత్తూ ఆమెకు జేజేలు పలికి ప్రశంసల్లో ముంచెత్తింది. ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారత మహిళగా మల్లీశ్వరి కీర్తికెక్కింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘనంగా సన్మాన సత్కారాలతో ఆమెను అభినందించి భారీ పురస్కారాలు ప్రకటించింది. అయితే పతకం గెలిచిన మరుసటి రోజు ప్రధానమంత్రి అటల్ బిహారి వాజ్‌పేయ్ నుంచి వచ్చిన ఫోన్ కాల్ అత్యంత ప్రత్యేకమైంది. ‘భారత్ కీ బేటీ’ అంటూ మల్లీశ్వరిని అభినందించిన ప్రధాని ఒక కవితను కూడా వినిపించారు. అయితే ఆ హిందీ కవిత తనకేమీ అర్థం కాలేదని ఆ తర్వాత ఆమె సరదాగా గుర్తు చేసుకుంది. మల్లీశ్వరి సిడ్నీ ఒలింపిక్స్ ఘనతపై త్వరలోనే సినిమా కూడా రూపుదిద్దుకోనుంది. కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ నిర్మించనున్న ఈ సినిమాకు సంజనా రెడ్డి దర్శకత్వం వహిస్తుంది. -
ఏ సెహ్వాగ్ ఇది నీ అనుభవమే కదా!
న్యూఢిల్లీ : టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. హాస్యం జోడించి వీరు చేసే ట్వీట్లు ఆసక్తికరంగా, వ్యంగ్యంగా ఉంటాయన్న విషయం తెలిసిందే. ప్రతీ విషయంపై తనదైన శైలిలో స్పందించే సెహ్వాగ్ గత రెండు నెలలుగా ఐపీఎల్‌తో బీజీగా ఉన్నాడు. ఈ క్యాష్ రిచ్ లీగ్ ముగియడంతో మళ్లీ తన ట్వీట్ల పర్వం మొదలు పెట్టాడు. శుక్రవారం ‘అనుకోకుండా మీ అత్తగారు వస్తే’ అనే క్యాప్షన్‌తో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ఈ వీడియోని చూసిన అభిమానులు నవ్వు ఆపుకోలేకపోతున్నారు. ఆ వీడియోలో ఏముందటంటే.. ఇంట్లో తన తల్లిలేదని భావించిన ఓ వ్యక్తి చిన్న ప్లాస్టిక్ టబ్‌లో నీటిని తీసుకుని తన భార్య కాళ్లు కడుగుతూ ఉంటాడు. తన భర్త చూపుతున్న ప్రేమ పట్ల ఆ మహిళ ఎంతో పొంగిపోతూ ఉంటుంది. ఇంతలో బయటకు వెళ్లిన ఆయన తల్లి ఆకస్మాత్తుగా వచ్చేస్తుంది. అంతే వెంటనే ఆ భార్యభర్తలు తమ పొజిషన్లను మార్చేసుకుంటారు. అప్పటి వరకు తన భార్య కాళ్లు కడిగిన ఆ వ్యక్తి ఆ నీటిని తన నెత్తిపై పోసుకుంటాడు. కాళ్లు కడిగించుకున్న ఆ మహిళా తన భర్త తలపై నీళ్లు పోస్తుంటుంది. అయితే ఈ ట్వీట్‌పై నెటిజన్లు సైతం వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. ‘ఏ సెహ్వాగ్ ఇలా నీకు అనుభవమైంది కదా!’ చెప్పూ అంటూ సెటైర్ వేస్తున్నారు. When your mother-in law suddenly appears pic.twitter.com/tLCdF29Nhf — Virender Sehwag (@virendersehwag) 1 June 2018 i think sir you had experienced like this😂 — Kunj patel (@kunjpatel9898) 1 June 2018 ఉక్కు మహిళకు విషెస్ ఒలింపిక్స్‌లో మహిళగా తొలి పతకం సాధించిన తెలుగు బిడ్డ కరణం మల్లీశ్వరీకి సెహ్వాగ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. ‘కరణం మల్లీశ్వరీ జీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఒలింపిక్స్‌లో మహిళగా తొలి పతకం సాధించి ఎంతో మందికి స్తూర్తిని కలిగించారు.’ అని ట్వీట్ చేశాడు. 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో మల్లీశ్వరీ కాంస్య పతకం గెలుచుకున్నారు. Happy Birthday Karnam Malleswari ji , the first Indian woman to win an individual Olympic medal and a woman who with her Karnama inspired millions of Indians to live their dreams and showed that it is possible 🙏🏼 pic.twitter.com/8hOhZxVKWD — Virender Sehwag (@virendersehwag) 1 June 2018 -
భారత్‌కు ఇది గొప్ప ఆరంభం: కైఫ్
సాక్షి, స్పోర్ట్స్ : కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ, రజత పతకాలు సాధించిన భారత అథ్లెట్లను క్రికెటర్ మహ్మద్ కైఫ్ అభినందించారు. గురువారం జరిగిన మహిళల 48 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో మీరాబాయి చాను పసిడిని సాధించారు. తద్వారా ఈ గేమ్స్‌లో భారత్ ఖాతాలో తొలి స్వర్ణం చేరింది. మరో అథ్లెట్ గురురాజా రజతం సాధించిన విషయం తెలిసిందే. మీరాబాయి చాను, గురురాజాలు మరిన్ని విజయాలు అందుకోవాలని, రాబోయే రోజుల్లో మీ ప్రతిభకు మరింత గుర్తింపు దక్కాలని తన ట్వీట్ ద్వారా కైఫ్ ఆకాంక్షించారు. కాగా, పురుషుల వెయిట్ లిఫ్టింగ్ 56 కేజీల విభాగంలో గురురాజా రెండో స్థానంలో నిలిచి రజతం కైవసం చేసుకున్నాడు. ఈ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన అథ్లెట్‌గా గురురాజా నిలిచాడు. Congratulations to #MirabaiChanu for the gold and #Gururaja for the silver at the #CWG2018 . Great start for India. Wish more success and recognition for our talent in the coming days. pic.twitter.com/OR33sFskeK — Mohammad Kaif (@MohammadKaif) 5 April 2018 కరణం మల్లేశ్వరి హర్షం వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను అద్భుతంగా బరువులెత్తి కామన్వెల్త్ క్రీడల్లో సత్తా చాటిందని వెయిట్ లిఫ్టర్, పద్మశ్రీ కరణం మల్లేశ్వరి ప్రశంసించారు. భారతీయ అథ్లెట్లకు ఇది శుభ పరిణామం. ఇతర అథ్లెట్లకు మీరాబాయి స్వర్ణం స్ఫూర్తినిస్తుందన్నారు. తొలి లిఫ్ట్‌తోనే పతకం సాధించడం విశేషమని మల్లేశ్వరి కొనియాడారు. మీరాబాయి ప్రదర్శనను గమనించినట్లయితే ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌లో పథకంపై ఆశలు చిగురిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. ఒలింపిక్ పోటీల్లో భారతదేశానికి వెయిట్‌లిఫ్టింగ్‌లో తొలి పతకం తీసుకువచ్చిన వెయిట్‌లిఫ్టర్‌గా కరణం మల్లేశ్వరి రికార్డులకెక్కిన విషయం తెలిసిందే. -
కడప గడపలో క్రీడా పద్మం మల్లేశ్వరి
కడప జన్మభూమిగా.. శ్రీకాకుళం కర్మభూమిగా భావిస్తానని.. తెలుగు ఆడపడచుగా తెలుగు క్రీడాకారులకు తనవంతు సహకారం అందిస్తానని.. ప్రభుత్వం ప్రోత్సహిస్తే ప్రపంచస్థాయి పతకాలు సాధించి చూపుతానంటున్నారు పద్మశ్రీ కరణం మల్లేశ్వరి.. ఒలింపిక్ పోటీల్లో భారతదేశానికి వెయిట్‌లిఫ్టింగ్‌లో తొలి పతకం తీసుకువచ్చిన వెయిట్‌లిఫ్టర్ కరణం మల్లేశ్వరి కడప నగరానికి విచ్చేశారు.. ఈమెను సాక్షి పలుకరించగా పలు విషయాలు వెల్లడించారు. కడప స్పోర్ట్స్:అమ్మాయిలకు ఆటలేంటి... అన్న వారే అదరహో.. అన్నారు.. సన్నగా ఉన్నావు బరువులెత్తే వెయిట్లిఫ్టింగ్కు పనికిరావు అన్న వారే.. భారతదేశపు.. పరువు నీవేనన్నారు.. తర్వాత కాలంలో.. ఎన్నో రికార్డులు బద్ధలయ్యాయి.. అర్జున, రాజీవ్ ఖేల్‌రత్న, పద్మశ్రీ వంటి మరెన్నో పురస్కారాలు ఈమెను వరించాయి.. తన మూలాలు ఇక్కడే ఉన్నాయని.. తెలుగు క్రీడాకారులకు తనవంతు సహకారం అందిస్తానని అంటోంది క్రీడా పద్మం కరణం మల్లేశ్వరి. గురువారం కడప నగరానికి విచ్చేసిన ఆమె సాక్షితో పలు విషయాలను పంచుకుంది. సాక్షి :చరిత్రలో నిలిచేలా తొలి ఒలింపిక్ పతకం సాధించిన మహిళా క్రీడాకారిణిగా మీ స్పందన..? మల్లేశ్వరి : క్రీడలు అంటే తక్కువగా తెలిసిన సమయంలో.. ఒలంపిక్స్ అంటే ఏందో సరిగా తెలియని సమయంలో ఎన్నో ఆటుపోట్ల మధ్య క్రీడాసాధన సాగింది. దేశానికి పతకం సాధించిన తొలి మహిళగా చరిత్రలో నిలిచిపోవడం సంతోషంగా గర్వంగా ఉంది. అయితే అప్పటితో పోల్చితే నేడు మౌలిక సదుపాయాలు పెరిగాయి. సాక్షి :ప్రభుత్వం నుంచి లభించిన ప్రోత్సాహం..? మల్లేశ్వరి :సిడ్నీ ఒలింపిక్స్‌లో కాంస్యపతకం సాధించడంతో ప్రభుత్వం రూ.35 లక్షలు నగదు ప్రోత్సాహం అందించారు. హైదరాబాద్‌లో స్థలం కేటాయించారు. అయితే తర్వాత నేను ఏథెన్స్ ఒలింపిక్స్‌పై దృష్టి సారించడంతో స్థలం తీసుకోలేకపోయాను. తర్వాత ప్రయత్నించినప్పటికీ స్థలం లభించలేదు. అప్పట్లో ప్రభుత్వం కనీసం ఉద్యోగం కూడా ఆఫర్ చేయలేదు. సాక్షి :ఇప్పుడు ప్రభుత్వం ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన వారికి నగదు బహుమతి, గ్రూప్–1 కేడర్ ఉద్యోగాలు ఇస్తోంది కదా.. మీ స్పందన..? మల్లేశ్వరి : క్రీడలను ప్రోత్సహించేందుకు నగదు బహుమతి, స్థలం, ఉద్యోగం ఇవ్వడం సంతోషకరమే. అయితే ఈ ప్రోత్సాహం అన్ని క్రీడల్లో రాణించే వారికి కూడా ఇవ్వడంతో పాటు అన్ని క్రీడలను సమానంగా చూస్తే బాగుంటుంది. సాక్షి :ఆంధ్రా ఆడపడుచుగా తెలుగు రాష్ట్రాల్లో అకాడమీ ఏర్పాటు చేసి వెయిట్‌లిఫ్టింగ్‌ను అభివృద్ధి చేసే ఆలోచన ఉందా..? మల్లేశ్వరి : రాయలసీమలో పుట్టి.. ఉత్తరాంధ్రలో పెరిగిన నాకు ఇక్కడి క్రీడాకారులకు ఎంతో చేయాలని ఉంది. ప్రభుత్వం తగినంత స్థలం కేటా యించి, మౌలిక సదుపాయాలు కల్పించి ప్రోత్సహిస్తే అకాడమీని ఏర్పాటు చేసి సేవలందిస్తా. సాక్షి :రాజధాని అమరావతిలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేస్తామంటున్నారు కదా.. అక్కడ ఏమైనా అకాడమీ ఏర్పాటు చేసే ఆలోచన ఉందా..? మల్లేశ్వరి : తొలి పతకం సాధించిన మహిళా వెయిట్ లిఫ్టర్‌ను నేను. అయితే ప్రభుత్వాలు ఈ విషయంలో మమ్మల్ని పరిగణలోకి తీసుకోవడం లేదు. ప్రభుత్వం స్పందించి మా సహకారం కోరితే తప్పకుండా అందిస్తాం. 20 సంవత్సరాల అనుభవాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. సాక్షి : భవిష్యత్తులో భారత్ నుంచి ఒలింపిక్ మెడల్స్ మరిన్ని ఆశించవచ్చా..? మల్లేశ్వరి : 130 కోట్లు ఉన్న భారతదేశంలో మనకు లభిస్తున్న పతకాల సంఖ్య తక్కువే. దీర్ఘకాలిక వ్యూహంతో పాటు చక్కటి ప్రోత్సాహం ఇస్తే అసాధ్యమేమీ కాదు. రానున్న కాలంలో మంచి ఫలితాలు, పతకాలు వస్తాయనుకుంటున్నా. సాక్షి : ఒలింపిక్స్‌లో పతకాలు సాధించేందుకు ప్రభుత్వాలు ఇటీవల తీసుకున్న చర్యలు ఎటువంటి ఫలితాలు ఇస్తుందనుకుంటున్నారు..? మల్లేశ్వరి :కేంద్ర క్రీడల మంత్రి ఒలింపిక్ మెడలిస్టు కావడం సంతోషం. ఇటీవల ఖేలోఇండియాతో పాటు పలు టాలెంట్‌హంట్ స్కీంలు చక్కగానే ఉన్నాయి. ఇందులో సైతం క్రీడల్లో రాణించిన వారినే సభ్యులుగా తీసుకుంటున్నారు. భవిష్యత్తులో మంచి ఫలితాలు వస్తాయని భావిస్తున్నా. సాక్షి : క్రీడలు ముఖ్యమా.. చదువు ముఖ్యమా.. అన్న డైలమా చాలా మందిలో ఉంది.. దేనికి ప్రాధాన్యత ఇవ్వాలంటారు..? మల్లేశ్వరి :ఖచ్చితంగా చదువుకు ప్రాధాన్యత ఉంది. 8 నుంచి 25 సంవత్సరాల దాకా చదువుకు, క్రీడల సాధనకు ఎంతో విలువైన సమయం. వారి శారీరక, మానసిక స్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి. క్రీడలతో పాటు చదువుకు కూడా ప్రాధాన్యత ఇస్తే కెరీర్ పరంగా ఉపయోగపడుతుంది. సాక్షి : క్రీడల అభివృద్ధికి మీరిచ్చే సూచన..? మల్లేశ్వరి :ప్రభుత్వం క్రీడలను అభివృద్ధి చేసే క్రమంలో రాష్ట్రం నుంచి అంతర్జాతీయ స్థాయిలో రాణించిన, పతకాలు సాధించిన వారి సలహాలు తీసుకుంటే బాగుంటుంది. రాజధానిలో నిర్మిస్తున్న క్రీడానగరంలో ఏర్పాటు చేసే అంశాలపై కూడా చర్చిస్తే ఉపయోగకరంగా ఉంటుంది. సాక్షి :మీ పిల్లలు మీ వారసులుగా క్రీడల్లోకి తీసుకువస్తున్నారా..? మల్లేశ్వరి : మాకు ఇద్దరు పిల్లలు. పెద్ద కుమారుడు (10వ తరగతి) రైఫిల్షూటింగ్లోను, చిన్నబాబు (6వ తరగతి) ఫిట్నెస్ సాధించేందుకు జిమ్నాస్టిక్స్ సాధన చేస్తున్నారు. వారికి ఇష్టమైన రంగంలో రాణించేలా స్వేచ్చనిచ్చాం. సాక్షి : క్రీడాకారులకు మీరిచ్చే సందేశం..? మల్లేశ్వరి : మనదేశంలో యువశక్తి చాలా ఉంది. లక్ష్యాన్ని నిర్ధేశించుకుని దానిని సాధించేందుకు కష్టపడాలి. క్రమశిక్షణ, అంకితభావం, పట్టుదల, ఏకాగ్రతో సాధన చేస్తే ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి. ముఖ్యంగా మహిళా క్రీడాకారిణులు తాము అబలం.. కాదు.. ఆదిశక్తి అంశమన్న విషయం గుర్తుంచుకోవాలి. దేశానికి పతకం తీసుకువచ్చిన వారిలో అమ్మాయిలే అగ్రస్థానంలో ఉన్నారన్న విషయం గుర్తుంచుకోవాలి. సాక్షి :మీ అకాడమీ నుంచి ఒలింపిక్స్‌లో పతకాలు ఆశించవచ్చా..? మల్లేశ్వరి :హర్యానాలో నిర్వహిస్తున్న అకాడమీ నుంచి రానున్న కాలంలో మంచి ఫలితాలు వస్తాయనుకుంటున్నా. రానున్న 2024, 2028 ఒలంపిక్స్‌లో పతకాలే ధ్యేయంగా శిక్షణ ఇస్తున్నాం. సాక్షి :కడపతో మీకున్న అనుబంధం..? మల్లేశ్వరి :కడప జిల్లా నందలూరు మండలం ఎర్రిపాపయపల్లె మా అమ్మగారి ఊరు. కాబట్టి కడప జిల్లాను నా జన్మభూమిగా భావిస్తా. నాన్నది చిత్తూరు జిల్లా. శ్రీకాకుళం నేను పెరిగిన ప్రాంతం కాబట్టి అది నా కర్మభూమిగా భావిస్తా. సాక్షి : మళ్లీ వెయిట్‌లిఫ్టింగ్‌లో ఒలింపిక్ మెడల్ మనదేశం నుంచి ఆశించవచ్చా..? మల్లేశ్వరి :వాస్తవానికి లైట్ వెయిట్ కేటగిరీలో వెయిట్ లిఫ్టింగ్ క్రీడలో ఒలింపిక్ పతకం సాధించడం కాస్త కష్టపడితే సాధ్యమే. ఖచ్చితంగా పతకం వచ్చే విభాగంలో వెయిట్‌లిఫ్టింగ్ ఒకటి. -
‘మనందరిపై బాధ్యత ఉంది’
సాక్షి, చేబ్రోలు: ఈ ఏడాదిలోనే రాష్ట్రంలో వెయిట్‌లిఫ్టింగ్ అకాడమీ ఏర్పాటు చేస్తామని ఒలింపిక్ పతక విజేత, ప్రముఖ వెయిట్ లిఫ్టర్ కరణం మల్లేశ్వరి చెప్పారు. 2024లో జరిగే ఒలింపిక్స్‌లో తమ అకాడమీ క్రీడాకారులు తప్పక ఒలింపిక్ పతకం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. శనివారం గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలో జరిగిన విజ్ఞాన్ మహోత్సవ్ ముగింపు వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. హరియాణాలో వెయిట్ లిఫ్టింగ్ అకాడమీని ఏర్పాటు చేయబోతున్నామని.. శ్రీకాకుళం జిల్లాలోనూ అకాడమీ స్థాపించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. యువతరం ఆలోచనలు, ఆశలను నెరవేర్చాల్సిన బాధ్యత మనపైనే ఉందన్నారు. ప్రభుత్వం క్రీడలకు ఇస్తున్న ప్రోత్సాహం బాగుందన్నారు. కానీ నిధులను వినియోగించే విషయంలో ఇప్పటికీ సమస్యలున్నాయన్నారు. ప్రతిభావంతులకు మెరుగైన వసతులు కల్పించే దిశగా కృషి చేయాలని కోరారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు సరైన ప్రోత్సాహం ఉండటం లేదన్నారు. వెయిట్‌లిఫ్టింగ్ శిక్షణ ఇచ్చేందుకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలకు చెందిన 49 మంది విద్యార్థులను ఎంపిక చేసినట్లు తెలిపారు. ప్రైవేటు విద్యాసంస్థలు ముందుకొచ్చి వారికి ఉచితంగా చదువులు చెప్పగలిగితే.. తాము వారిని అత్యుత్తమ వెయిట్ లిఫ్టర్లుగా తీర్చిదిద్దుతామన్నారు. -
నా రికార్డులు బ్రేక్ చేస్తే రూ.లక్ష నజరానా
శ్రీకాకుళంలో రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలు ప్రారంభించిన కరణం మల్లీశ్వరి శ్రీకాకుళం న్యూకాలనీ: ఒలింపిక్స్‌లో తాను నెలకొల్పిన రికార్డులను బ్రేక్ చేసిన వారికి రికార్డుకి రూ.లక్ష చొప్పున బహుమతిగా ఇస్తానని ఒలింపిక్ కాంస్య పతక గ్రహీత, శాప్ బోర్డ్ సభ్యురాలు కరణం మల్లీశ్వరి ప్రకటించారు. శ్రీకాకుళంలోని డా.అంబేడ్కర్ ఆడిటోరియంలో రెండు రోజుల ఖేలో ఇండియా రాష్ట్ర స్థాయి అండర్–14, అండర్–17 బాలబాలికల వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ పోటీలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మల్లీశ్వరి మాట్లాడుతూ.. శ్రీకాకుళంలో తన పేరిట త్వరలో వెయిట్ లిఫ్టింగ్ అకాడమీని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. మిగిలిన క్రీడా అకాడమీలతో పోలిస్తే వెయిట్ లిఫ్టింగ్ ఖర్చుతో కూడుకున్నదని అన్నారు. కాగా, పోటీల్లో సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తోన్న చిత్తూరు జిల్లా మినహా అన్ని జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా నుంచి కనీస ప్రాతినిధ్యం లేకపోవడం చర్చనీయాంశమైంది. -
ఏదీ గుర్తురాలేదు...!
కరణం మల్లీశ్వరి... భారత క్రీడారంగంలో పరిచయం అవసరం లేని పేరు. ఒలింపిక్స్ చరిత్రలో భారత్‌కు పతకం అందించిన తొలి క్రీడాకారిణి. ఈనాటికీ ఒలింపిక్ పతకం సాధించిన ఏకైక అసలు సిసలు పదహారణాల తెలుగు బిడ్డ. శ్రీకాకుళం జిల్లాలోని ఓ మారుమూల పల్లెటూరులో జన్మించి... ప్రపంచం అంతా కీర్తించే స్థాయికి ఎదిగిన క్రీడాకారిణి. 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో వెయిట్‌లిఫ్టింగ్‌లో కాంస్యం సాధించింది. ఒలింపిక్స్‌కు అప్పట్లో మల్లీశ్వరి ఎలా సన్నద్ధమైంది. పోటీల్లో పాల్గొనే సమయంలో ఉండే ఒత్తిడిని ఎలా అధిగమించింది. అసలు ఇప్పుడేం చేస్తోంది..? భవిష్యత్‌లో మళ్లీ ఆటకు తిరిగి చేయబోతున్నదేంటి..? ఇలాంటి అనేక అంశాలతో మల్లీశ్వరి కాలమ్ ‘సాక్షి’కి ప్రత్యేకం. కరణం మల్లీశ్వరి సిడ్నీ ఒలింపిక్స్ (2000)లో తొలిసారి మహిళలకు వెయి ట్ లిఫ్టింగ్‌ను ప్రవేశపెట్టారు. దీంతో మా అందరిలోనూ ఒక రకమైన ఉద్వేగం. అయితే అప్పటి వరకు నేను అంతర్జాతీయ స్థాయిలో 54 కిలోల కేటగిరీలోనే పాల్గొని పతకాలు సాధిం చాను. నా ప్రపంచ చాంపియన్‌షిప్ స్వర్ణం కూడా ఇదే కేటగిరీ లో వచ్చింది. సిడ్నీ ఒలింపిక్స్‌లో మాత్రం 69 కేజీల విభాగంలో పోటీ పడ్డాను. ఈ కేటగిరీలో నాకు ఇదే తొలి అంతర్జాతీయ ఈవెంట్ కూడా. అందరిలాగే నేనూ ఒలింపిక్స్ కోసం కఠోర సాధన చేశాను. సన్నాహక శిబిరంలో చాలా కష్ట పడ్డాను. సిడ్నీ వెళ్లేటప్పుడు కూడా మనసులో స్వర్ణమే లక్ష్యంగా పెట్టుకున్నాను. ఈవెంట్ ప్రారంభానికి ముందు కూడా నాపై ఎలాంటి ఒత్తిడి, ఆందోళనలేదు. ప్రశాంతంగానే పోటీకి సిద్ధమయ్యాను. స్వర్ణం కోల్పోయాను పోటీలు జరిగిన రోజు కొద్దిగా టెన్షన్‌తో ఉన్నా ... ఒక్క సారి డయాస్ వద్దకు వెళ్లగానే ఏ విషయమూ మనసులోకి రాలేదు. ఎదురుగా ఎంత మంది ఉన్నా, పతకం, రికార్డులాంటివేవీ ఆలోచించలేదు. బార్‌పై చేతులు ఉంచగానే మన శక్తిని అంతా ఒక్క చోటికి చేర్చి బరువు ఎత్తడమొక్కటే నాకు తెలిసిన పని. అది మినహా ఆ క్షణంలో ఏదీ గుర్తురాలేదు. స్నాచ్‌లో మూడో ప్రయత్నంలో 110 కేజీలు స్కోర్ చేశాను. క్లీన్ అండ్ జర్క్‌లో తొలి రెండు ప్రయత్నాల్లో 125, 130 కిలోలు ఎత్తగలిగాను. మూడో ప్రయత్నంలో వాస్తవానికి 132.5 కిలోలు ఎత్తినా నాకు స్వర్ణం లభించేది. కానీ మా కోచ్‌లు లెక్కల్లో చేసిన చిన్న పొరపాటు వల్ల నేను స్వర్ణం కోల్పోయాను. మూడో ప్రయత్నంలో నేను 137.5 కిలోల బరువు ఎత్తే విధంగా లక్ష్యం పెట్టుకున్నాను. ఇంత బరువు కోసం ట్రైనింగ్ సమయంలో సాధన చేసినా... అసలు పోటీల్లో అంత సులువు కాదు. రెండో ప్రయత్నంలో 130 కిలోలు ఎత్తిన నేను మూడో సారి అంతకంటే ఐదు కిలోలు అదనంగా అయినా ప్రయత్నించగలిగేదానిని. కానీ ఏకంగా ఏడున్నర కిలోలు తేడా తీసుకు రావడం అనేది దాదాపు అసాధ్యం. కేవలం అదనంగా రెండున్నర కిలోలు పెంచి 132.5 కిలోలు లక్ష్యంగా చేసుకోవాల్సింది (ఈ మొత్తం ఎత్తితే మల్లీశ్వరి స్కోరు 242.5 అయ్యేది. స్వర్ణ, రజతాలు గెలిచిన ఇద్దరూ ఇంతే బరువు లేపారు. అయితే ఈ ముగ్గురిలో బరువు తక్కువగా ఉన్న మల్లీశ్వరికి మొదటి స్థానం దక్కేది). కానీ 137.5 నా వల్ల కాక విఫలమయ్యాను. చివరకు 110 ప్లస్ 130 కలిపి 240 కేజీలతో కాంస్య పతకమే లభించింది. చేతులారా స్వర్ణం పోగొట్టుకున్నాననే అంశం నన్ను చాలా సార్లు బాధించింది. అది అపూర్వం స్వర్ణం కోల్పోయిన ఆలోచన కొద్ది సేపు ఉన్నా... ఒలింపిక్స్‌లో దేశం తరఫున పతకం గెలిచిన తొలి క్రీడాకారిణిని నేనే కావడం ఎప్పటికీ గర్వపడేలా చేసింది. సిడ్నీలో ఉన్న భారత బృందం మొత్తం కలిసి అభినందనలు తెలిపి ప్రశంసల వర్షం కురిపిస్తుంటే నా విజయం విలువేమిటో తెలిసింది. దేశ ప్రధాని వాజ్‌పేయి కూడా ఫోన్ చేసి అభినందించారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన తర్వాత లభించిన అపూర్వ స్వాగతం, సన్మానాలు ఎప్పటికీ మరచిపోలేను. తెలుగు ప్రజలంతా నా విజయాన్ని తమ విజయంగా భావించారు. మన మల్లి అంటూ వాడవాడలా అభినందనలు తెలియజేశారు. ఒలింపిక్స్‌లో పతకం సాధించడమనే కల నెరవేరడం, తొలి మహిళను నేనే కావడంతో అవి నా జీవితంలో అత్యుత్తమ క్షణాలుగా నిలిచాయి. ఏథెన్స్లో నిరాశ కాంస్యం సాధించడంతోనే సరిపెట్టకుండా తర్వాతి ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించాలనే లక్ష్యంగా పెట్టుకున్నాను. బరువు తగ్గి వెయిట్ కేటగిరీ 69 కేజీలనుంచి 63 కేజీలకు మారాను. బెంగళూరులో జరిగిన క్యాంపులో కూడా తీవ్రంగా సాధన చేశాను. అయితే కీలక సమయంలో దురదృష్టం వెంటాడింది. స్నాచ్‌లో మొదటి ప్రయత్నంలో బరువు ఎత్తే సమయంలోనే నా వెన్నుపూస పట్టేసింది. దాంతో పోటీనుంచి ఒక్కసారిగా తప్పుకోవాల్సి వచ్చింది. నిజానికి వెన్ను గాయం నన్ను అంతకు ముందు చాలా రోజులనుంచే బాధిస్తోంది. కొన్ని సార్లు బాగా ఇబ్బంది పడ్డా చికిత్స తీసుకుంటూనే ప్రాక్టీస్ చేశాను. కోచ్‌లు కూడా అప్పటి వరకు కోలుకోగలవని ప్రోత్సహించారు. ఆ నమ్మకంతోనే ఏథెన్స్ వెళ్లాను. కానీ నా రెండో ఒలింపిక్స్ అలా ముగిసిపోయింది. ఆ తర్వాత మళ్లీ లిఫ్టింగ్ చేస్తే మరిన్ని అనారోగ్య సమస్యలు రావచ్చని డాక్టర్లు హెచ్చరించడంతో ఆటను ఆపేశాను. ఏథెన్స్ తర్వాత ఏ పోటీల్లోనూ పాల్గొనలేదు. గత కొన్నేళ్లలో డోపింగ్ తదితర వివాదాల కారణంగా వెయిట్ లిఫ్టింగ్‌కు బ్యాడ్ ఇమేజ్ వచ్చింది. ఫలితాలు కూడా ఆశించినంత గొప్పగా లేకపోగా, చాలా మంది ఇతర క్రీడల వైపు ఆకర్షితులవుతున్నారు. ఈ సారి రియోకు ఇద్దరు లిఫ్టర్లే వెళుతున్నారు. వారి ప్రదర్శనపై నమ్మకముంది. కానీ పతకంపై ఏమీ చెప్పలేం. అనుబంధం కొనసాగిస్తా రిటైర్మెంట్ తర్వాత నేను వెయిట్లిఫ్టింగ్కు సంబంధించి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్నాను. గౌరవ హోదాలో సాయ్‌లో కూడా అనేక బాధ్యతలు నిర్వహించాను. అర్జున అవార్డులు తదితర ఇతర కమిటీల్లో భాగంగా ఉన్నాను. ప్రస్తుతం శాప్ డెరైక్టర్లలో ఒకరిగా ఉన్నాను. అయితే నేరుగా కోచ్‌గా ఎప్పుడూ పూర్తి స్థాయిలో వ్యవహరించలేదు. పైగా వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్యతో కూడా పెద్దగా కలిసి పని చేయలేదు. కానీ నా ఆటను నలుగురితో పంచుకోవాలని, శిక్షణ ఇవ్వాలని పట్టుదలగా ఉన్నాను. శ్రీకాకుళం జిల్లాలో అకాడమీ ఏర్పాటు చేసేందుకు నాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే అన్ని అనుమతులు మంజూరు చేసింది. సాధ్యమైనంత త్వరలో నా స్వస్థలంలో అకాడమీ ప్రారంభం అవుతుంది. కుమారుడు షూటర్‌గా... వ్యక్తిగత జీవితంలో నా భర్త రాజేశ్ త్యాగి ఎంతో అండగా నిలిచారు. ఇద్దరు కొడుకుల్లో పెద్ద అబ్బాయి శరద్ త్యాగికి 15 ఏళ్లు. అతను క్రీడాకారుడిగా ఎదుగుతున్నాడు. పూర్తి స్థాయిలో షూటింగ్‌ను ప్రొఫెషన్‌గా తీసుకున్న శరద్... 10 మీ. ఎయిర్ రైఫిల్ విభాగంలో శిక్షణ పొందుతున్నాడు. మా ఇంట్లోకి మరో ఒలింపిక్ పతకం తీసుకు రాగలడేమో చూడాలి. రెండో అబ్బాయి అంగద్ త్యాగికి పదేళ్లు.