
డోపింగ్ ఆరోపణలతో భారత వెయిట్‌లిఫ్టర్ సంజిత చానుపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసి, విచారణ కొనసాగించాలని అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య నిర్ణయించింది. గతేడాది కామన్వెల్త్ క్రీడల్లో సంజిత 53 కేజీల విభాగంలో స్వర్ణం గెల్చుకుంది.
దీనికిముందు 2017 ప్రపంచ చాంపియన్‌షిప్ సందర్భంగా ఆమె మూత్ర నమూనాలు సేకరించి పరీక్షకు పంపారు. అందులో పాజిటివ్‌గా తేలడంతో కామన్వెల్త్ క్రీడల అనంతరం మే 15న నిషేధం విధించారు. అయితే డోపింగ్ పరీక్షలకు సంజిత నమూనాల సేకరణలో జాప్యం చోటుచేసుకుని... కేసు సంక్లిష్టం కావడమే నిషేధం ఎత్తివేతకు కారణంగా తెలుస్తోంది.