న్యూఢిల్లీ: డోపింగ్ వివాదంలో నిర్దోషిగా బయటపడిన భారత వెయిట్ లిఫ్టర్, కామన్వెల్త్ గేమ్స్ పసిడి పతక విజేత సంజిత చాను కేంద్ర ప్రభుత్వం అందించే క్రీడా పురస్కారం ‘అర్జున’ను ఆశిస్తోంది. 2016 నుంచి ఈ అవార్డు కోసం ప్రయత్నిస్తోన్న తనకు ఈ సారైనా ఈ గౌరవాన్ని అందజేయాలని ఆమె కోరింది. ‘నాలుగేళ్ల క్రితం అర్జున అవార్డు కోసం దరఖాస్తు చేశాను. అప్పుడు తిరస్కరించారు. 2017లో కూడా విస్మరించారు. ఆ తర్వాత డోపింగ్ ఆరోపణలతో నన్ను పక్కన బెట్టారు. కానీ ఈసారి అర్జున వస్తుందని నేను ఆశిస్తున్నా’ అని 26 ఏళ్ల చాను పేర్కొంది. గత నెలలోనే చాను అర్జున దరఖాస్తును క్రీడా మంత్రిత్వ శాఖకు పంపించింది. అయితే డోపింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఈ పురస్కారానికి అనర్హులని కేంద్ర క్రీడా శాఖ ఆమె దరఖాస్తును తిరస్కరించింది.
Comments
Please login to add a commentAdd a comment