
న్యూఢిల్లీ: డోపింగ్‌లో పట్టుబడిన భారత వెయిట్‌లిఫ్టర్ సీమాపై జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) నాలుగేళ్ల నిషేధం విధించింది. 2017 కామన్వెల్త్ చాంపియన్íÙప్‌లో 75 కేజీల విభాగంలో రజత పతకం గెలిచిన సీమా, 2018 గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో ఆరో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది విశాఖపట్నంలో జరిగిన జాతీయ మహిళల వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్íÙప్ సందర్భంగా ఆమె నుంచి ‘నాడా’ అధికారులు శాంపిల్స్ సేకరించారు. వాటిని పరీక్ష చేయగా అందులో అంతర్జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నిషేధించిన ఉత్ప్రేరకాలు ఉన్నట్లు తేలింది. దీంతో ‘నాడా’కు చెందిన డోపింగ్ నిరోధక క్రమశిక్షణా ప్యానెల్ ఆమెపై వేటు వేసింది.
Comments
Please login to add a commentAdd a comment