ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత్ తొలిసారిగా పసిడి పతక పోరుకు అర్హత సాధించింది. రెజ్లింగ్ మహిళల 50 కేజీల విభాగంలో వినేశ్ ఫొగట్ ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ క్రమంలో బుధవారం ఆమె స్వర్ణం కోసం.. అమెరికాకు చెందిన సారా హిల్డెబ్రాంట్‌తో తలపడనుంది. చాంప్-డి- మార్స్ ఎరీనాలో మ్యాట్- బి మీద ‘పసిడి పట్టు’ పట్టేందుకు సిద్దమైంది.
రాత్రి 11.23 నిమిషాలకు ఈ బౌట్ మొదలుకానుంది. స్పోర్ట్స్ 18, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఇక వినేశ్‌తో పాటు మిగిలిన క్రీడాకారుల నేటి(ఆగష్టు 7) షెడ్యూల్ ఇదే!
రెజ్లింగ్
మహిళల ప్రీస్టయిల్ 53 కేజీలు: అంతిమ్ పంఘాల్ వర్సెస్ జైనెప్ యెట్గిల్ (మధ్యాహ్నం గం. 3:05 నుంచి)
వెయిట్‌లిఫ్టింగ్
మహిళల 49 కేజీల (పతక పోరు): మీరాబాయి చాను (రాత్రి గం. 11:00 నుంచి)
అథ్లెటిక్స్
మిక్స్‌డ్ మారథాన్ వాక్: ప్రియాంక గోస్వామి, సూరజ్ పన్వర్ (ఉదయం గం. 11:00 నుంచి).
పురుషుల హైజంప్ (క్వాలిఫికేషన్): సర్వేశ్ (మధ్యాహ్నం గం. 1:35 నుంచి).
మహిళల జావెలిన్ త్రో (క్వాలిఫికేషన్): అన్ను రాణి (మధ్యాహ్నం గం. 1:55 నుంచి).
మహిళల 100 మీటర్ల హర్డిల్స్: జ్యోతి యర్రాజీ (హీట్–4) (మధ్యాహ్నం గం. 2:09 నుంచి).
పురుషుల ట్రిపుల్ జంప్ (క్వాలిఫికేషన్): ప్రవీణ్ చిత్రావెల్, అబ్దుల్లా అబూబాకర్ (రాత్రి గం.10:45 నుంచి).
పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్ (అవినాశ్ సాబ్లే; అర్ధరాత్రి గం. 1:13 నుంచి).
భారత టీటీ జట్టు నిష్క్రమణ
పారిస్ ఒలింపిక్స్ టేబుల్ టెన్నిస్ (టీటీ) పురుషుల టీమ్ ఈవెంట్‌లో భారత జట్టు కథ ముగిసింది. మంగళవారం జరిగిన తొలి రౌండ్‌లో భారత్ 0–3తో చైనా చేతిలో ఓడింది. తొలి మ్యాచ్‌లో హర్మీత్ దేశాయ్–మానవ్ ఠక్కర్ జోడీ 2–11, 3–11, 7–11తో మా లాంగ్–వాంగ్ జంట చేతిలో 0–1తో వెనుకబడింది.
రెండో మ్యాచ్‌లో ఐదోసారి ఒలింపిక్స్‌లో ఆడుతున్న ఆచంట శరత్ కమల్ 11–9, 7–11, 7–11, 5–11తో ఫాన్ జెన్‌డాంగ్ చేతిలో ఓడిపోయాడు. తొలి గేమ్ గెలిచి ఆశలు రేకెత్తించిన శరత్ అదే జోరు చివరి వరకు కొనసాగించ లేకపోయాడు. మూడో మ్యాచ్‌గా జరిగిన సింగిల్స్ రెండో పోరులో మానవ్ ఠక్కర్ 9–11, 6–11, 9–11తో వాంగ్ చేతిలో పరాజయం పాలవడంతో భారత ఓటమి ఖరారైంది.
Comments
Please login to add a commentAdd a comment