
ముంబై: టోక్యో ఒలింపిక్స్ వెయిట్ లిఫ్టింగ్‌లో సిల్వర్ మెడల్ సాధించి చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌ను కలిసింది. ముంబైలోని ఆయన ఇంటికి వెళ్లి కొద్దిసేపు మాట్లాడింది. ఈ సందర్భంగా టోక్యో ఒలింపిక్స్ విశేషాలను గురించి సచిన్ ఆమెను అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిచారు. అనంతరం సచిన్‌ను కలిసిన ఫోటోలను ట్విట్టర్‌లో మీరాబాయి చాను షేర్ చేసుకుంది. ''సచిన్ సార్‌ని ఉదయం కలిశాను. నన్ను ప్రోత్సహిస్తూ ఆయన మాట్లాడిన మాటలను ఎప్పటికి మరిచిపోలేను. నిజంగా ఎంతో స్ఫూర్తి పొందాను.. చాలా హ్యాపీగా ఉంది'' అంటూ ట్వీట్ చేసింది.
కాగా మీరాబాయి చేసిన ట్వీట్‌పై సచిన్ కూడా రిప్లై ఇచ్చాడు. మీరాబాయిని కలవడం నాకు సంతోషంగా ఉంది. ఒలింపిక్స్‌లో రజతం తెచ్చినందుకు ఎంతో గర్విస్తున్నా.. మున్ముందు జరిగే క్రీడల్లో ఇలాంటి అద్భుత ప్రదర్శనలు మరిన్ని చేయాలని కోరుకుంటున్నా'' అంటూ తెలిపారు. ఇక టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ మంచి ప్రదర్శన కనబరిచింది. 2012 లండన్ ఒలింపిక్స్‌ను మరిపిస్తూ ఏడు పతకాలతో మురిసిన భారత్ టోక్యో ఒలింపిక్స్‌ను ఘనంగా ముగించింది. ఒక స్వర్ణం, రెండు రజతాలు, నాలుగు కాంస్యాలతో మొత్తం ఏడు పతకాలు కొల్లగొట్టింది.
Loved meeting @sachin_rt Sir this morning! His words of wisdom & motivation shall always stay with me. Really inspired. pic.twitter.com/Ilidma4geY
— Saikhom Mirabai Chanu (@mirabai_chanu) August 11, 2021